- Home
- Entertainment
- మహేష్ బావ బంగారం, పుట్టెడు కష్టాలు అనుభవించాడు.. మరదలు శిల్పా శిరోద్కర్ ఎమోషనల్ కామెంట్స్
మహేష్ బావ బంగారం, పుట్టెడు కష్టాలు అనుభవించాడు.. మరదలు శిల్పా శిరోద్కర్ ఎమోషనల్ కామెంట్స్
మా బావ బంగారం అంటూ మహేష్ బాబుని ప్రశంసల్లో ముంచేసింది మరదలు శిల్పా శిరోద్కర్. మహేష్ అనుభవించిన కష్టాల గురించి ఎమోషనల్ గా మాట్లాడింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

రాజమౌళి దర్శకత్వంలో మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజమౌళి గ్లోబల్ చిత్రంగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రం 1000 కోట్ల బడ్జెట్ లో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్ కాస్టింగ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. మహేష్ బాబు సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు.
మహేష్ పై మరదలు కామెంట్స్
తాజాగా మహేష్ బాబుపై అతని మరదలు (నమ్రతా శిరోద్కర్ చెల్లి) శిల్పా శిరోద్కర్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. మా బావ బంగారం అంటూ ప్రశంసలు కురిపించింది. మహేష్ బాబు తక్కువ వ్యవధిలోనే తన సోదరుడు, తల్లి, తండ్రి లని కోల్పోయారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శిల్పా శిరోద్కర్ కామెంట్స్ చేసింది.
మా బావ అత్యుత్తమ వ్యక్తి
ఈ ప్రపంచంలో నాకు తెలిసిన అత్యుత్తమ వ్యక్తుల్లో మహేష్ బావ ఒకరు. మహేష్ బావ ఫ్యామిలీ కోసం దృఢంగా నిలబడే వ్యక్తి. మహేష్ బావ తక్కువ సమయంలో తండ్రి కృష్ణ, తల్లి ఇందిరా దేవి, సోదరుడు రమేష్ బాబులని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. అంతటి కష్టాల్లో కూడా ఆయన తాను అభిమానించే వారికోసం చిరునవ్వుతో కనిపించేవారు. మా పేరెంట్స్ ని కూడా మేము కోల్పోయాము. ఆ సమయంలో అక్కకి మహేష్ బావ, నాకు నా భర్త అండగా నిలిచి ఓదార్చారు అని శిల్పా శిరోద్కర్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
అక్కకంటే ముందు నాకే పెళ్లి
అక్క నమ్రత కంటే నాకే ముందుగా సినిమాల్లో అవకాశం వచ్చింది. అక్కకంటే ముందుగా నాకే పెళ్లి అయింది. దీనితో అంతా నేనే పెద్దదాన్ని అని అనుకుంటారు. కానీ నేను చిన్నదాన్ని. అక్క నన్ను చంటి బిడ్డలా చూసుకుంటుంది అని శిల్పా శిరోద్కర్ పేర్కొంది.
శిల్పా శిరోద్కర్ నటించిన ఏకైక తెలుగు మూవీ
శిల్పా శిరోద్కర్ హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. 1992లో మోహన్ బాబు సరసన బ్రహ్మ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. తెలుగులో శిల్పా శిరోద్కర్ నటించిన ఏకైక చిత్రం అదే.