- Home
- Entertainment
- థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు, బాలయ్య రికార్డ్ కి ధీటుగా నిలిచింది ఒక్కడే.. చిరంజీవి కాదు
థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు, బాలయ్య రికార్డ్ కి ధీటుగా నిలిచింది ఒక్కడే.. చిరంజీవి కాదు
థియేటర్స్ లో లాంగెస్ట్ రన్ కలిగిన తెలుగు సినిమాల వివరాలు మీకు అందిస్తున్నాం. థియేటర్లలో ఎక్కువ రోజులు ప్రదర్శించబడిన సినిమాల జాబితాలో బాలయ్య కంప్లీట్ డామినేషన్ చూపిస్తున్నారు.

Nandamuri Balakrishna
తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప చిత్రాలు ఉన్నాయి. కొన్ని చిత్రాలు చరిత్రలో నిలిచిపోయేలా రికార్డులు సృష్టిస్తాయి. ఇప్పుడంటే సినిమాలు కేవలం కొన్ని వారాలకు మాత్రమే థియేటర్లకు పరిమితం అవుతున్నాయి. సినిమా బావుంటేనే కొన్ని వారాల పాటు థియేటర్స్ లో ఉంటోంది. కానీ గతంలో అలా కాదు. సినిమా హిట్ అయితే కచ్చితంగా 100 రోజులు ఆడేది. ఇంకా బావుంటే 200 రోజులపైగా ఆడిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఏకంగా 100 రోజులు ప్రదర్శించబడిన చిత్రాలు కూడా ఉన్నాయి. తెలుగు సినిమా చరిత్రలో థియేటర్స్ లో అత్యధిక రోజులు ప్రదర్శించబడిన సినిమాల జాబితాలో నందమూరి బాలకృష్ణ టాప్ లో ఉన్నారు.
ఈ జాబితాలో బాలకృష్ణ, రాంచరణ్, నందమూరి తారకరామారావు నటించిన చిత్రాలు ఉన్నాయి. ఈ లిస్ట్ లో చిరంజీవి చిత్రం లేకపోవడం ఆశ్చర్యకరం. రాంచరణ్ మాత్రం ఓ చిత్రంతో బాలయ్యకి ధీటుగా నిలిచాడు. ఈ తరం హీరోల్లో రాంచరణ్, మహేష్ బాబు నటించిన చిత్రాలు మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి. అత్యధిక రోజులు ప్రదర్శించబడిన టాప్ 8 సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
లెజెండ్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన లెజెండ్ చిత్రం 2014లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కర్నూలులోని ఎమ్మిగనూరు థియేటర్ లో లెజెండ్ చిత్రాన్ని 2014 నుంచి 2017 వరకు ఏకంగా 1000 రోజులకు పైగా ప్రదర్శించారు. టాలీవుడ్ లో అత్యధిక రోజులు ప్రదర్శించబడిన చిత్రంగా లెజెండ్ రికార్డు సృష్టించింది.
మగధీర
బాలయ్య తర్వాత ఆ రికార్డు మెగా పవర్ స్టార్ రాంచరణ్ సొంతం చేసుకున్నారు. చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన దృశ్య కావ్యం మగధీర చిత్రం కర్నూలులోని విజయలక్ష్మి థియేటర్ లో 1000 రోజులు ప్రదర్శించబడింది. కలెక్షన్స్ లో మగధీర చిత్రం తెలుగు సినిమా రికార్డులని తిరగరాసింది.
పోకిరి
లాంగెస్ట్ థియేటర్ రన్ కలిగిన చిత్రాల్లో మహేష్ బాబు పోకిరి మూడవ స్థానంలో ఉంది. ఓ థియేటర్ లో ఈ చిత్రం ఏకంగా 580 రోజులు ప్రదర్శించబడింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్, ఇలియానా జంటగా నటించిన చిత్రం ఇది. మహేష్ స్టార్ డమ్ ని అమాంతం పెంచేసిన చిత్రం పోకిరి.
మంగమ్మ గారి మనవడు
బాలయ్యకి స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన చిత్రం మంగమ్మ గారి మనవడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సుహాసిని బాలయ్యకి జంటగా నటించింది. 1984లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించి థియేటర్స్ లో 565 రోజులు ఆడింది.
మరో చరిత్ర
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మరో చరిత్ర చిత్రం సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అప్పట్లో ఏకంగా 556 రోజు థియేటర్స్ లో ప్రదరించబడింది.
ప్రేమాభిషేకం
అక్కినేని నాగేశ్వర రావు సినీ కెరీర్ లో గొప్ప చిత్రాలలో ప్రేమాభిషేకం ఒకటి. ఈ చిత్రంలో శ్రీదేవి, జయసుధ హీరోయిన్లుగా నటించారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 533 రోజులు ఆడింది. చాలా థియేటర్స్ లో 300 రోజులకు పైగా ప్రదర్శించబడింది. లవ్ ఎమోషనల్ సీన్స్ తో ఈ చిత్రం ప్రేక్షకులని కట్టిపడేసింది.
లవకుశ
నందమూరి తారకరామారావు శ్రీరాముడిగా నటించిన లవకుశ చిత్రం 1963లో విడుదలైంది. మైథలాజికల్ చిత్రంగా వచ్చిన లవకుశ ఏకంగా మూడున్నర గంటల నిడివి ఉంటుంది. అప్పట్లో ఈ చిత్రాన్ని 469 రోజులు ప్రదర్శించారు. ఈ చిత్రంలో పాటలు ఇప్పటికీ ప్రతి ఊరి రామాలయంలో వినిపిస్తూనే ఉంటాయి.
ప్రేమ సాగరం
కమల్ హాసన్, నళినీ, సరిత ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమ సాగరం మూవీ క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని 465 రోజులు ప్రదర్శించారు. స్టార్ హీరో శింబు తండ్రి టి రాజేందర్ ఈ చిత్రానికి దర్శకుడు.