MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • రాజకీయాల్లో సంచలనాలకు తెరలేపబోతున్న త్రిష, పవన్‌ కళ్యాణ్‌ స్ట్రాటజీ.. తెరవెనుక విజయ్‌ చక్రం తిప్పుతున్నాడా?

రాజకీయాల్లో సంచలనాలకు తెరలేపబోతున్న త్రిష, పవన్‌ కళ్యాణ్‌ స్ట్రాటజీ.. తెరవెనుక విజయ్‌ చక్రం తిప్పుతున్నాడా?

త్రిష రాజకీయాల్లోకి వస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఆమె తాజాగా కేంద్ర మంత్రి అమిత్‌ షాని కలిసిందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు త్రిష తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 18 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజకీయాల్లో త్రిష ప్రకంపనలు
Image Credit : Instagram/X

రాజకీయాల్లో త్రిష ప్రకంపనలు

స్టార్‌ హీరోయిన్‌ త్రిష చుట్టూ ఇప్పుడు చాలా రాజకీయం నడుస్తోంది. విజయ్‌, త్రిష మధ్య ఎఫైర్‌ ఇప్పుడు ఈ చర్చలకు కారణమయ్యింది. కోలీవుడ్‌లోనే కాదు, తమిళ రాజకీయాల్లోనూ ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది ఎఫైర్‌ వరకు పరిమితం కావడం లేదు, రాజకీయాల్లోనూ ప్రకంపనలకు కారణమవుతోంది. త్రిష ఏదో గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నట్టుగా ఉంది. తెరవెనుక విజయ్‌ చక్రం తిప్పుతున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ స్ట్రాటజీని వాడుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్‌తో త్రిష ఎఫైర్‌ రచ్చ
Image Credit : X

విజయ్‌తో త్రిష ఎఫైర్‌ రచ్చ

త్రిషతో విజయ్‌కి ఎఫైర్‌ ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో దళపతి విజయ్‌ భార్య సంగీత ఏకంగా ఆయనకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. కోర్ట్ లో డైవర్స్ కి పిటిషన్‌ దాఖలు చేసింది. ఇందులో ఆమె విజయ్‌కి ఓ నటితో ఎఫైర్‌ ఉందని ఆరోపించిందట. ఆ నటి త్రిషనే అని అంటున్నారు. ఇప్పటికే వీరి మధ్య ఎఫైర్‌ ఉందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో సంగీత ఆరోపణలకు బలం చేకూరాయి. ఆ మధ్య ఓ ఫంక్షన్‌లో విజయ్‌, త్రిష కలిసి కనిపించారు. దీంతో ఈ రూమర్స్ మరింత  హాట్‌ టాపిక్‌గా మారాయి.

Related Articles

Related image1
Vijay Trisha Marriage: ఎన్నికల తర్వాత విజయ్-త్రిష పెళ్లి? హింట్‌ ఇచ్చిన స్టార్‌ హీరోయిన్‌ తల్లి ?
Related image2
Ustaad Bhagat Singh Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఫస్ట్ రివ్యూ, పవన్‌ కళ్యాణ్‌ విశ్వరూపం.. మైనస్‌ ఏంటంటే?
35
ఎంజీఆర్‌, జయలలిత స్ట్రాటజీని విజయ్‌, త్రిష ఫాలో అవుతున్నారా?
Image Credit : Asianet News

ఎంజీఆర్‌, జయలలిత స్ట్రాటజీని విజయ్‌, త్రిష ఫాలో అవుతున్నారా?

ఇదిలా ఉంటే ఇప్పుడు త్రిష రాజకీయాల్లోకి వస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి. ఎంజీఆర్, జయలలిత తరహాలో విజయ్‌, త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారని, విజయ్‌కి త్రిష సపోర్ట్ గా ఉండబోతుందని సమాచారం. ఇటీవల కాలంలో ఆమె కొత్తగా ఒక్క సినిమాకి కూడా ఒప్పుకోలేదు. రాజకీయాల్లోకి రావడం కోసమే ఆమె సినిమాలు చేయడం లేదంటున్నారు. ఇదే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంజీఆర్‌ రాజకీయాల్లో ఉన్నప్పుడు జయలలిత ఆయనకు సపోర్ట్ గా ఉంది. ఆయన మరణించాక జయలలిత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లింది. సీఎం అయి తమిళ రాష్ట్రాన్ని శాసించింది. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని త్రిష ఫాలో అవుతుందని టాక్‌.

45
అమిత్‌ షాతో త్రిష భేటీ?
Image Credit : ANI

అమిత్‌ షాతో త్రిష భేటీ?

మరోవైపు ఇప్పుడు త్రిషకి సంబంధించిన మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఆమె కేంద్ర మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆమె బీజేపీ నాయకులను కలిశారనే వార్త పెద్ద దుమారం రేపుతుంది. బీజేపీతో పొత్తుకు ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్‌. ఇదంతా తెరవెనుక విజయ్‌ ఆడుతున్న గేమా? అనే టాక్‌ కూడా వినిపిస్తోంది. విజయ్‌ స్థాపించిన టీవీకే పార్టీ.. బీజేపీ, ఏఐఏడీఎంకేతో కలిసి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్టు సమాచారం. అందులో భాగంగానే త్రిష అమిత్‌ షాని కలిసిందంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

55
పవన్‌ కళ్యాణ్‌ తరహాలో విజయ్‌, త్రిష రాజకీయ ఎత్తుగడ ?
Image Credit : Asianet News

పవన్‌ కళ్యాణ్‌ తరహాలో విజయ్‌, త్రిష రాజకీయ ఎత్తుగడ ?

చూడబోతుంటే విజయ్‌ కూడా పవన్‌ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ గత ఎన్నికల్లో బీజీపీ, టీడీపీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. విజయ్‌ కూడా త్రిషని వాడుకొని ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్‌ చేస్తున్నాడా? అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఇందులో నిజమెంతా? త్రిష చుట్టూ జరుగుతున్న రాజకీయంలో నిజమెంతా ? త్రిష నిజంగానే రాజకీయాల్లోకి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కానీ వీరికి సంబంధించిన పరిణామాలు మాత్రం తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మున్ముందు ఏం జరగబోతుందో చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
త్రిష
ఏషియానెట్ న్యూస్
అమిత్ షా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image2
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image3
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Related Stories
Recommended image1
Vijay Trisha Marriage: ఎన్నికల తర్వాత విజయ్-త్రిష పెళ్లి? హింట్‌ ఇచ్చిన స్టార్‌ హీరోయిన్‌ తల్లి ?
Recommended image2
Ustaad Bhagat Singh Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఫస్ట్ రివ్యూ, పవన్‌ కళ్యాణ్‌ విశ్వరూపం.. మైనస్‌ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved