చిరంజీవితో అనిల్ రావిపూడి ఓ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో వెంకటేష్ హీరోగా నటిస్తున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ ఇచ్చారు వెంకటేష్.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. `గ్యాంగ్ లీడర్`, `ఘారానా మొగుడు` స్టయిల్‌లో వింటేజ్ చిరంజీవి చూపించబోతున్నారు అనిల్ రావిపూడి.
ఇందులో హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. `సైరా`, `గాడ్ ఫాదర్` తర్వాత మరోసారి వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.
చిరంజీవి అనిల్ రావిపూడి మూవీలో వెంకటేష్
చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ చిత్రంలో మరో స్టార్ హీరో గెస్ట్ గా కనిపించబోతున్నారు. ఆయన ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. ఈ సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు వెంకటేష్.
దీనికి కూడా అనిల్ రావిపూడినే దర్శకుడు. వీరి కాంబినేషన్‌లో గతంలో `ఎఫ్ 2`, `ఎఫ్ 3` చిత్రాలు వచ్చి అలరించాయి. ఆ బాండింగ్ తో చిరంజీవి సినిమాలో వెంకీని గెస్ట్ రోల్ చేయించబోతున్నారనే ప్రచారం జరిగింది.
చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్‌పై వెంకీ క్లారిటీ
తాజాగా దీన్ని కన్ఫమ్ చేశారు విక్టరీ వెంకటేష్. నాట్స్ సభల్లో పాల్గొన్న ఆయన అక్కడి ఆడియెన్స్ ని ఉర్రూతలూగించేలా మాట్లాడారు. వచ్చే ఏడాది మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో రాబోతున్నట్టు తెలిపారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నట్టు తెలిపారు. అదే సమయంలో చిరంజీవి సినిమాలో కొమియో చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో ఈ మాటకి అక్కడి ఆడియెన్స్ అరుపులతో హోరెత్తించడం విశేషం.
ప్రస్తుతం వెంకీ చెప్పిన ఈ విషయం వైరల్‌గా మారింది. ఇన్నాళ్లు రూమర్‌గా ఉన్న విషయాన్ని ఇప్పుడు స్వయంగా వెంకీనే కన్ఫమ్ చేయడం విశేషం.
వచ్చే సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద రచ్చ రచ్చే
90లో చిరంజీవి మార్క్ యాక్షన్, కామెడీ, డాన్సులు బాగా పాపులర్. అప్పటి మాస్ ఆడియెన్స్ ని ఉర్రూతలూగించాయి. మరోసారి చిరంజీవిని అలా చూపించబోతున్నారు అనిల్.
యాక్షన్ ఎంటర్టైన్‌మెంట్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే మూవీ ప్రారంభమైంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని విడుదల చేయబోతున్నారు.
ఈ సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం`తో వెంకీ రచ్చ చేయగా, ఇక వచ్చే సంక్రాంతికి చిరంజీవి, వెంకీ కలిసి రచ్చ రచ్చ చేయబోతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.