- Home
- Entertainment
- బాలకృష్ణ నటించిన తొలి హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు ఏం చేస్తుంది? వ్యాంప్ పాత్రలతో ఫేమస్
బాలకృష్ణ నటించిన తొలి హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు ఏం చేస్తుంది? వ్యాంప్ పాత్రలతో ఫేమస్
నందమూరి బాలకృష్ణ `అన్నదమ్ముల అనుబంధం` చిత్రంలో ఎన్టీఆర్‌కి తమ్ముడిగా నటించాడు. ఈ చిత్రంలో ఆయనకు హీరోయిన్ కూడా ఉంది. ఆమెతో డ్యూయెట్లు పాడుకోవడం విశేషం.
- FB
- TW
- Linkdin
Follow Us

`తాతామనవుడు` చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య
బాలకృష్ణ నటుడిగా గతేడాదితోనే యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1974లో `తాతామనవుడు` చిత్రంతో బాలయ్య నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో బాలయ్య ఏజ్ కేవలం 14ఏళ్లే. ఎన్టీఆర్ కావాలని బాలయ్యని తీసుకొచ్చి సినిమాల్లో నటింప చేశాడు. ఇందులో తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి నటించాడు.
అలా నందమూరి నటసింహం నటుడిగా ఎంట్రీ కావాల్సి వచ్చింది. బాలయ్య రెండో మూవీ `రామ్ రహీమ్`. ఇందులో అన్నయ్య హరికృష్ణతో కలిసి నటించారు. వీరిద్దరు స్నేహితులుగా కనిపించారు.
`అన్నదమ్ముల అనుబంధంలో` ఎన్టీఆర్‌కి తమ్ముడిగా బాలయ్య
బాలయ్య మూడో చిత్రమే `అన్నదమ్ముల అనుబంధం`. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన చిత్రమిది. ఇందులో రామారావుకి తమ్ముళ్లుగా మురళీ మోహన్, బాలకృష్ణ నటించారు.
ఇది బాలీవుడ్ మూవీ `యాదోన్ కి బారాత్`కి రీమేక్. ఎస్ డి లాల్ దర్శకత్వం వహించారు. 1975 జులై 4న విడుదలైన ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇందులో రామారావుకి చిన్న తమ్ముడిగా మెప్పించాడు బాలయ్య.
తనదైన నటనతో ఆకట్టుకుంటారు. అయితే మొదటి రెండు చిత్రాల్లో బాలకృష్ణ లేడీ పెయిర్ లేదు. కానీ ఈ మూవీలో ఆయనకు జోడీ ఉంది. ఎన్టీఆర్ హీరోయిన్ లేదుగానీ, బాలయ్యకి డ్యూయెట్లు ఉండటం విశేషం.
బాలయ్య రొమాన్స్ చేసిన తొలి హీరోయిన్ జయమాలిని
ఇందులో బాలయ్య సరసన నటించిన హీరోయిన్ జయమాలిని. ఆమెకిది రెండో సినిమా. ఇలా జయమాలినితో బాలయ్య తొలిసారి రొమాన్స్ చేశారు, డ్యూయెట్లు పాడారని చెప్పొచ్చు.
తొలుత హీరోయిన్‌గా సినిమాలు చేసిన జయమాలిని ఆ తర్వాత వ్యాంప్ రోల్స్ వైపు టర్న్ తీసుకుంది. ఆకర్షించే పాత్రలతో ఆకట్టుకుంది. అదే సమయంలో పబ్ డాన్స్ లతో ఉర్రూతలూగించింది.
గ్లామర్ సైడ్ ఓపెన్ అయి రెచ్చిపోయింది. వ్యాంప్స్ రోల్స్, ఐటెమ్ సాంగ్స్ తో పాపులర్ అయ్యింది. అప్పట్లో సిల్క్ స్మితకి, జయమాలికి ఇలాంటి వ్యాంపు రోల్స్, ఐటెమ్స్ సాంగ్స్ కి మధ్య తీవ్రమైన పోటీ ఉందని చెప్పొచ్చు.
అంతా సిల్క్ మాయలో కొట్టుకుపోతున్న నేపథ్యంలో ఆమె పోటీగా తట్టుకుని నిలబడింది జయమాలిని. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ ఐదు వందలకుపైగా సినిమాలు చేసింది.
వ్యాంప్ పాత్రలతో పాపులరైన జయమాలిని ఇప్పుడు సినిమాలకు దూరం
అన్ని ప్రధాన భాషలను ఓ ఊపు ఊపేసిన జయమాలిని పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది. దాదాపు 15ఏళ్లు సినిమాని ఊపేసిన ఆమె 1994లో పోలీస్ ఆఫీసర్ పార్థిబన్‌ని వివాహం చేసుకుంది.
ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. వీరికి ఒక కొడుకు ఉన్నారు. ప్రస్తుతం చెన్నైలో సెటిల్ అయ్యింది జయమాలిని. అక్కడే సొంతంగా ఇల్లు కట్టుకుంది.
కొన్ని ఆస్తులు సంపాదించుకుంది. తన భర్త కూడా బాగానే సంపాదించారు. ఆ తర్వాత ఇంకెప్పుడూ ఆమె సినిమాలు చేయలేదు. ఇటీవల పలు యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలిచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.
ప్రస్తుతం ఆమె పూర్తిగా ఫ్యామిలీకే పరిమితమని, సినిమాలకు దూరంగానే ఉంటున్నట్టు చెప్పడం విశేషం.
జయమాలిని నటించిన తెలుగు సినిమాలు
జయమాలిని తెలుగు సినిమాలు చూస్తే, `అన్నదమ్ముల అనుబంధం`, `ముత్యాల ముగ్గు`, `భక్త కన్నప్ప`, `మగాడు`, `అమర దీపం`, `అర్థాంగి`, `చక్రధారి`, `ఛాణక్య చంద్రగుప్తా`, `దాన వీర శూర కర్ణ`, `దేవతలారా దీవించండి`,
`యమగోల`, `అన్నదమ్ముల సవాల్`, `మనవూరి పాండవులు`, `జగన్మోహిని`, `సింహబలుడు`, `మేలుకొలుపు`, `శ్రీరామబంటు`, `హేమా హేమీలు`, `టైగర్`, `వేటగాడు`, `యుగంధర్`, `సీతా రాములు`, `ఆటగాడు`, `పున్నమినాగు`, `రగిలేజ్వాల`,
`కళియుగ రాముడు`, `బొబ్బిలి పులి`, `యమకింకరుడు`, `సిరిపురం మొనగాడు`, `మగమహా రాజు`, `కిరాయి కోటిగాడు`, `వందేమాతరం`, `హీరో`, `పదహారేళ్ల అమ్మాయి`, `రాము`, `స్టేట్ రౌడీ`, `కొడుకు దిద్దిన కాపురం` వంటి పాపులర్ హిట్ మూవీస్‌లో నటించింది జయమాలిని.