హీరోయిన్ ముఖం వాచిపోయేలా 14 చెంపదెబ్బలు కొట్టిన నాగార్జున, అసలేం జరిగింది?
సినిమా కోసం కొన్ని సందర్భాల్లో హీరోలు హీరోయిన్లు బాగా కష్టపడాల్సి వస్తుంది. ఈక్రమంలో నిజంగా దెబ్బలు కూడా తీనాల్సి వస్తుంది. అటువంటి సందర్భం ఎదురయ్యింది ఓ హీరోయిన్ కు . నాగార్జున చేత ఆమె ముఖం వాచిపోయేలా దెబ్బలు తినాల్సి వచ్చింది. ఇంతకీ ఎవరా బ్యూటీ.

షూటింగ్స్ లో స్టార్స్ కు తప్పని తిప్పలు
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ల సూపర్ స్టార్లు అయినా సరే కొన్నిసార్లు తిప్పలు తప్పవు. తెర ముందు సినిమా ఎంత అద్భుతంగా ఉన్నా, తెర వెనుక కొన్నిసందర్భాల్లో స్టార్స్ దెబ్బలు కూడా తినాల్సి వస్తుంది. అటువంటి సంఘటన గురించిసెలబ్రిటీలు ఏదైనా ఇంటర్వ్యలో వెల్లడించినప్పుడు.. అవి ఆడియన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి ఒక షాకింగ్ వాస్తవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటి ఇషా కొప్పికర్ వెల్లడించారు.
KNOW
హీరోయిన్ ను 14 చెంపదెబ్బలు కొట్టిన నాగార్జున
ఆమె 1998లో విడుదలైన చంద్రలేఖ అనే సినిమాలో నాగార్జున సరసన నటించారు. ఈ చిత్రాన్ని కృష్ణవంశీ దర్శకత్వం వహించగా, నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. హీరోయిన్ ఇషాను నాగార్జున 14 చెంపదెబ్బలు కొట్టాల్సి వచ్చింది. దాంతో హీరోయిన్ ముఖం వాచిపోయింది.
నాగార్జున ఎంత చెప్పినా వినని ఇషా కొప్పికర్
ఇషా తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ. '' చంద్రలేఖ షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన జరిగింది. సినిమాలో ఒక సీన్‌లో నాగార్జున నన్ను చెంపపై కొట్టే సీన్ ఉంది. షూటింగ్‌కు ముందు నాగార్జున నాతో సున్నితంగా కొడతాను, షాట్ ఓకే చేద్దాం అన్నారు.
కానీ నేను మాత్రం అలా అయితే ఈ సీనుకు న్యాయం చేయలేము కాబట్టి మీరు నిజంగా కొట్టాలి అని చెప్పాను. అప్పటికీ నాగార్జున నాకు సర్ధి చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశారు. కాని ఆయన ఎంత చెప్పినా నేను వినలేదు. దాంతో నేను అడిగినందకే ఆయన నిజంగానే గట్టిగా చెంపపై కొట్టారు.
నాగార్జున దెబ్బకు వాచిపోయిన హీరోయిన్ ముఖం
అయితే నా ముఖంలో కోపం, బాధల కలయికతో ఎమోషన్ సరిగ్గా కనిపించకపోవడంతో అదే సీన్‌ను 14 సార్లు టేక్ చేయాల్సి వచ్చింది. దాంతో ప్రతి టేక్‌లోనూ నాగార్జున నా ముఖంపై నిజంగానే కొట్టాల్సి వచ్చింది. దాంతో ఈ షాట్ పూర్తయ్యేసరికి చెంప వాచిపోయింది, నా చెంపపై నాగార్జున వేళ్ల ముద్రలు పడిపోయాయి '' అని ఆమె వెల్లడించింది. అయితే ఆ తర్వాత నాగార్జున బాధతో “సారీ '' కూడా చెప్పారట. కానీ ఇషా మాత్రం, “నన్ను కొట్టమని నేనే చెప్పాను కదా దానికి సారీ అవసరం లేదు” అని బదులిచ్చిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఇషా కొప్పికర్ వెల్లడించారు .
చంద్రలేఖ సినిమా రిజల్ట్
ఈ సంఘటన సినిమాకోసం ఎంత పెద్ద స్టార్ యాక్టర్స్ అయినా ఎలాంటి త్యాగాలు చేయాల్సి వస్తుందో తెలిసేలా చేస్తుంది. ఇక నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమా తెలుగులో విజయవంతం కాలేకపోయినప్పటికీ, మలయాళంలో అదే పేరుతో వచ్చిన ఒరిజినల్ మూవీ ఘన విజయం సాధించింది. ప్రియదర్శన్ దర్వకత్వంలో రూపొందిన ఆ చిత్రం ఆకట్టుకోగా, తెలుగులో కృష్ణవంశీ ఈ సినిమాను రీమేక్ చేశారు. సందీప్ చౌతా సంగీతం అందించారు. పాటలు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ సాధించాయి.
ప్రస్తుతం ఇషా కొప్పికర్ ఏం చేస్తున్నారు?
ఇక ఇషా కొప్పికర్ విషయానికి వస్తే.. చంద్రలేఖ సినిమా ఇషాకు తెలుగులో రెండవ సినిమా. పస్ట్ మూవీ వైఫ్ ఆఫ్ వరప్రసాద్. 1997 రిలీజ్ అయిన ఈ సినిమాలో ఇషా కొప్పికర్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. తరువాత ఆమెకు ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ సినిమాలకు షిఫ్ట్ అయ్యారు. చాలా గ్యాప్ తర్వాత 2017లో నిఖిల్ నటించిన కేశవ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించారు. తాజాగా తమిళ చిత్రం ఆయలాన్లోనూ నటించారు.