MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీదేవితో పోల్చుతూ నాగార్జునపై అవమానకరమైన కామెంట్లు..కసితో డైరెక్టర్ ఇంటి గేటు దగ్గరే, ఏం చేశాడంటే

శ్రీదేవితో పోల్చుతూ నాగార్జునపై అవమానకరమైన కామెంట్లు..కసితో డైరెక్టర్ ఇంటి గేటు దగ్గరే, ఏం చేశాడంటే

నాగార్జున సినిమాలు చేయడం మొదలు పెట్టారు. సినిమాలు హిట్స్ అవుతున్నాయి కానీ ఒక్క చిత్రంలో కూడా తనకి మంచి పేరు రావడం లేదు. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Aug 09 2024, 04:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
sridevi

sridevi

తెలుగు లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని దశాబ్దాలు కష్టపడి దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. తన తర్వాత తన వారసులు నటులు కావాలని ఏఎన్నార్ కోరుకునేవారట. కానీ నాగార్జునని ఎప్పుడూ బలవంతం చేయలేదు. నాగార్జున చదువులు పూర్తి చేసుకుని ఫారెన్ నుంచి తిరిగివచ్చారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అప్పుడు ఏఎన్నార్ సినిమాలు నిర్మించేవారు. నాన్నగారితో కలసి సినిమాలు నిర్మించాలని ఏఎన్నార్ ఆయన సోదరుడు వెంకట్ అనుకున్నారట. కానీ నాగార్జున, వెంకట్ లకు అనుభవం లేదని ఏ హీరో ముందుకు రాలేదు. దీనితో నువ్వే హీరోగా నటించు అని నాగార్జున సోదరుడు వెంకట్ అన్నారట. ఈ విషయాన్ని ఏఎన్నార్ కి చెబితే ఆయన సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నట్లు నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

Also Read: టాలీవుడ్ స్టార్ హీరోల మేనల్లుళ్లు చాలా రిచ్ గురూ..వాళ్ళిద్దరి ఆస్తి గురించి తెలిస్తే మైండ్ పోతుంది

36

ఏఎన్నార్ కొడుకువి కాబట్టి జనాలు నీ సినిమా ఎగబడి చూస్తారు అనుకోవద్దు అని ఏఎన్నార్ హెచ్చరించారట. నాగార్జున సినిమాలు చేయడం మొదలు పెట్టారు. సినిమాలు హిట్స్ అవుతున్నాయి కానీ ఒక్క చిత్రంలో కూడా తనకి మంచి పేరు రావడం లేదు. 

Also Read: ఇండియాలో ఉండొద్దు, వెళ్ళిపో..కొడుకు చేసిన పనికి పెద్ద రచ్చ చేసిన హరికృష్ణ, ఇద్దరి మధ్య మాటల్లేవ్

46

శ్రీదేవితో కలసి నటించిన ఆఖరి పోరాటం చిత్రం పెద్ద హిట్ అయింది. ఒక్కరు కూడా నా గురించి మాట్లాడక పోగా తిరిగి అవమానకరమైన కామెంట్స్ వినిపించాయి. అందులో నాగార్జునది ఏమి లేదు.. అది శ్రీదేవి క్రేజ్.. ఆమె సినిమా అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారట. ఇది ఆఖరి పోరాటం కాదు శ్రీదేవి పోరాటం అని అన్నారట. అంతకు ముందు నటించిన చిత్రాల్లో కూడా హీరోయిన్లకు పేరు వచ్చింది కానీ తనకి ఎలాంటి గుర్తింపు రాలేదని నాగార్జున బాధపడ్డారు. ఇకనైనా నా పంథా మార్చుకోవాలి అని నాగ్ డిసైడ్ అయ్యారట. 

56

తనకు గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలు చేయాలని కసితో ప్రయత్నాలు మొదలు పెట్టారు. అప్పడే నాగార్జున మణిరత్నం గురించి విన్నారు. ఎలాగైనా ఆయనతో సినిమా చేయాలని చెన్నై వెళ్లారట. పోయెస్ గార్డెన్ లో జయలలిత ఇంటి పక్కనే మణిరత్నం ఇల్లు. ఆయన్ని వెళ్లి కలసి మీతో సినిమా చేయాలి అని అడిగా. నాకు కుదరదు.. నేను తెలుగు సినిమాలు చేయలేను అని అన్నారు.

66

నేను వదల్లేదు. ప్రతి రోజు ఉదయం 7 గంటలకు ఆయన ఇంటి గేటు దగ్గర ఎదురుచూసేవాడిని. ఆ టైంకి ఆయన మార్నింగ్ వాక్ కి వెళ్లేవారు. పది రోజులు కనిపిస్తూనే ఉన్నా. నా డెడికేషన్ ఆయనకి నచ్చింది. ఒకే నీతో సినిమా చేస్తా. నెల తర్వాత నిన్ను కలుస్తా అని చెప్పారు. అప్పుడే గీతాంజలి కథ వినిపించారు. సరిగ్గా 32 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ అని నాగార్జున తెలిపారు. నా నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత శివ చిత్రం.. ఆ మూవీ చేసిన సంచలనం ఏంటో అందరికి తెలుసు.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Recommended image2
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Recommended image3
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved