- Home
- Entertainment
- Rajamouli: రాజమౌళి స్టామినా ఆ ఇంటర్వెల్ సీన్ తో తెలిసింది.. ఒక్కొక్కరికీ మైండ్ పోయింది, రాజీవ్ కనకాల
Rajamouli: రాజమౌళి స్టామినా ఆ ఇంటర్వెల్ సీన్ తో తెలిసింది.. ఒక్కొక్కరికీ మైండ్ పోయింది, రాజీవ్ కనకాల
దర్శకధీరుడు రాజమౌళి గురించి నటుడు రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి తెరకెక్కించిన ఓ మూవీ ఇంటర్వెల్ సీన్ చూసి ఇండస్ట్రీలో చాలా మందికి మైండ్ బ్లాక్ అయింది అని తెలిపారు.

రాజమౌళి
దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులని మెప్పిస్తూ సినిమాలు చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి మూవీతో రాజమౌళి ఏకంగా హాలీవుడ్ మార్కెట్ పైనే గురిపెట్టారు.
రాజమౌళి సినిమాల్లో రాజీవ్ కనకాల
నటుడు రాజీవ్ కనకాలకు రాజమౌళితో మంచి అనుబంధం ఉంది. రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ 1, విక్రమార్కుడు , యమదొంగ, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాల్లో రాజీవ్ కనకాల నటించారు. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి మూవీ గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అది రాజమౌళి కి మాత్రమే సాధ్యం
యాక్షన్ సీన్లు ఏ దర్శకుడైనా చేయగలరు. కానీ అందులో అద్భుతమైన ఎమోషన్ రాబట్టడం రాజమోళికి మాత్రమే సాధ్యం. ఎన్ని గ్రాఫిక్స్ లు చేసినా, భారీ సెట్టింగ్స్ చూపించినా రాజమౌళి ఆ ఎమోషన్ ని మాత్రం వదలరు. అదే ఆయన బలం. ఛత్రపతి సినిమాని సుదర్శన్ తో థియేటర్ లో అనుకుంటా.. ప్రీవ్యూ షో ఇండస్ట్రీలో వాళ్ళం వెళ్లి చూశాం. ఆ ఇంటర్వెల్ ఫైట్ చూసి ఒకొక్కరికీ మైండ్ బ్లాక్ అయింది.
ఇంటర్వెల్ సీన్ కి మైండ్ బ్లాక్ అయింది
బాబోయ్ ఈయన ఏంటి ఇలా తీసేశాడు అంటూ ఇంటర్వెల్ లో అందరూ గుప్పు గుప్పు మాతో సిగరెట్లు కాల్చేస్తున్నారు. చాలా సేపు ఆ ఎమోషన్ నుంచి ఎవ్వరూ బయటకు రాలేకపోయారు. రాజమౌళి తన సినిమాతో సృష్టించే ఇంపాక్ట్ అలాంటిది అని రాజీవ్ కనకాల తెలిపారు.
రాజమౌళి మహాభారతం
రాజమౌళి అల్టిమేట్ గోల్ మహాభారతం తీయడమే అని రాజీవ్ కనకాల అన్నారు. కొన్నిసార్లు మహాభారతం గురించి ఆయన చెప్పారు. రాజమౌళి మహాభారతం చేస్తే అందులో ఇండస్టీలో ఉన్న నటులంతా ఉండే అవకాశం ఉంది. ఆ రోజు కోసం వెయిటింగ్ అని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.





