టాలీవుడ్ స్టార్ హీరోల మేనల్లుళ్లు చాలా రిచ్ గురూ..వాళ్ళిద్దరి ఆస్తి గురించి తెలిస్తే మైండ్ పోతుంది
టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రమే కాదు వారి మేనల్లుళ్లు కూడా వందల కోట్లకి అధిపతులే. ఈ వివరాలు చూస్తే అది ఎలాగో అర్థం అవుతుంది.
టాలీవుడ్ గుర్తింపు ఉన్న హీరోలుగా ఎదిగితే చాలు.. కోట్లల్లో రెమ్యునరేషన్ వస్తుంది. తక్కువ సమయంలోనే బాగా ఆస్తులు సంపాదించవచ్చు. కానీ వందలు, వేల కోట్ల ఆస్తికి అధిపతి కావాలంటే స్వయం సంపాదనతో పాటు.. బ్యాగ్రౌండ్ కూడా ఉండాలి. టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రమే కాదు వారి మేనల్లుళ్లు కూడా వందల కోట్లకి అధిపతులే. ఈ వివరాలు చూస్తే అది ఎలాగో అర్థం అవుతుంది.
సాయి ధరమ్ తేజ్ : మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతో ఎదురుదెబ్బ తిగిలింది. కానీ ఆ తర్వాత సుప్రీం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సూపర్ హిట్స్ దక్కాయి. దీనితో సాయి ధరమ్ తేజ్ కి నిర్మాతలు మంచి రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఎగబడ్డారు. సాయిధరమ్ తేజ్ కి సినిమాల ద్వారా వచ్చిన డబ్బు సొంత ఇల్లు, రెండు లగ్జరీ కార్లు కలిపి మొత్తం 75 కోట్ల ఆస్తి ఉంది. అది కాకుండా వల్ల విజయ దుర్గకి చిరంజీవి కోకా పేటలో వందల కోట్ల విలువ చేసే ల్యాండ్ రాసిచ్చారు. సో సాయిధరమ్ తేజ్ వందల కోట్లకి అధిపతి అని చెప్పొచ్చు.
సుమంత్ : అక్కినేని కుటుంబానికి చెందిన సుమంత్ నాగార్జునకి స్వయానా మేనల్లుడు. ఏఎన్నార్ పెద్ద కుమార్తె కొడుకు సుమంత్. హీరోగా కొంతకాలం సుమంత్ రాణించారు. సత్యం, గౌరి లాంటి చిత్రాలు సుమంత్ కి హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. సుమంత్ తల్లి దండ్రులు యుఎస్ లో సెటిల్ అయ్యారు. కానీ సుమంత్ మాత్రం ఇండియాలో తన తాతగారు ఏఎన్నార్ దగ్గరే పెరిగారు. సుమంత్ కి తన తల్లిందండ్రుల నుంచి కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఇది కాకుండా ఏఎన్నార్ బంజారా హిల్స్ లో 100 కోట్ల విలువైన ప్రాపర్టీని సుమంత్ కి రాసిచ్చారట. సుమంత్ తన దగ్గరే పెరిగాడు కాబట్టి ఏఎన్నార్ ఆ ప్రాపర్టీని ఇచ్చారట. ఏఎన్నార్ మరణించక ముందే దాని విలువ 100 కోట్లు.. ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుందని అంచనా.
నాగ చైతన్య : అక్కినేని నాగ చైతన్య నాగార్జునకి వారసుడు అయినప్పటికీ విక్టరీ వెంకటేష్ కి మేనల్లుడు. టాలీవుడ్ లో అత్యంత ధనవంతుడు అంటే అంతా నాగార్జున పేరే చెబుతారు. ఆయన ఆస్తి విలువ 5 వేల కోట్ల పైనే ఉంటుందని సమాచారం. నాగార్జున సినిమాలతో పాటు వివిధ వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నారు. నాగార్జున నుంచి నాగ చైతన్యకి సగం ఆస్తి వస్తుంది. ఇక చైతు తల్లి దగ్గుబాటి లక్ష్మి నుంచి అతడికి కొన్ని వందల కోట్ల ఆస్తులు వస్తాయట. రామానాయుడు తన కూతురి కోసం అప్పట్లోనే భారీ ఆస్తులు రాసిచ్చారట. అవే ఇప్పుడు చైతూకి వారసత్వంగా వస్తాయి. ఎటు చూసినా చైతు టాలీవుడ్ అత్యంత ధనవంతుడైన మేనల్లుడు.
అల్లు అర్జున్ : అల్లు అరవింద్ వారసుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ప్రస్తుతం బన్నీ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. పుష్ప 2 హిట్ అయితే ఆ లెక్క ఇంకా పెరుగుతుంది. అల్లు అర్జున్ తనకు సంపాదించిన, తండ్రి నుంచి వచ్చిన ఆస్తుల విలువ 600 కోట్లకి పైగా ఉంటుందని టాక్. పాన్ ఇండియా స్టార్ గా ఇంకా బాగా రాణిస్తే త్వరలోనే బన్నీ వేలకోట్ల ఆస్తి ఉన్న హీరోల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం.