ఇండియాలో ఉండొద్దు, వెళ్ళిపో..కొడుకు చేసిన పనికి పెద్ద రచ్చ చేసిన హరికృష్ణ, ఇద్దరి మధ్య మాటల్లేవ్
నందమూరి హరికృష్ణ సినిమాల్లో రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించిన హరికృష్ణ సినిమాల్లో గంభీరమైన పాత్రలు చేశారు.
NTR
నందమూరి హరికృష్ణ సినిమాల్లో రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించిన హరికృష్ణ సినిమాల్లో గంభీరమైన పాత్రలు చేశారు. హరికృష్ణ నటించిన సీతయ్య, లాహిరి లాహిరి లాహిరిలో లాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.
లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం విషయంలో హరికృష్ణకి ఆయన తనయుడు నందమూరి కళ్యాణ్ రామ్ కి మధ్య పెద్ద గొడవే జరిగిందట. కళ్యాణ్ రామ్ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. అప్పుడే నేను కోయంబత్తూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాను. వైవిఎస్ చౌదరి మా ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్. ఒకసారి ఆయన్ని కలిశాను. నా దగ్గర ఒక కథ ఉంది బాబు వింటారా అని అడిగారు. ఒకే వింటాను అని చెబితే.. లాహిరి లాహిరి లాహిరిలో చిత్ర కథ చెప్పారు. ఇది నాన్నగారి కోసం రాశాను అని అన్నారు.
నాన్నని ఎలాగైనా ఒప్పించాలి అని అడిగారు. అప్పటి నుంచి నాన్న వెంట పడ్డాను. ఆ సమాయంతో నాన్న సినిమాలు చేసే మూడ్ లో లేరు. కథపై కూడా నాన్నకి అనుమానాలు ఉన్నాయి. పైగా వైవిఎస్ చౌదరే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని అంటున్నారు. దీనితో ఆయన అంత డబ్బు పెట్టుకోగలరా అనే అనుమానం కూడా ఉండేది. కానీ నేను నాన్నని వదల్లేదు. మీరు ఈ సినిమా చేయాల్సిందే అని కూర్చున్నా.
నాన్న ఒప్పుకోవడం లేదు. ఒకరోజు వైవీఎస్ చౌదరి మీద మీకు డౌట్ కదా.. ఈ చిత్రాన్ని నేనే నిర్మిస్తాను అని చెప్పా. నాన్న ఒక్కరిగా భయపడ్డాడు. వీడెంటి అప్పుడే ఇంత పెద్ద డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ఎక్కడ అనవసరంగా ఇరుక్కుపోతాడో అని నాన్న భయపడ్డారు. కొన్ని రోజులు మేమిద్దరం మాట్లాడుకోలేదు. ఇద్దరం కొన్ని రోజులు అలాగే ఉన్నాం. ఒకరోజు నాన్నే వచ్చి ఓకె నేను సినిమా చేస్తాను. కానీ ఒక కండిషన్.. నువ్వు ఇండియాలో ఉండకూడదు. యుఎస్ వెళ్లి చదువు పూర్తి చేయాలి అని అన్నారు.
ఆ విధంగా నేను యుఎస్ వెళ్లి ఎమ్ ఎస్ పూర్తి చేశాను. కొన్ని రోజులు జాబ్ కూడా చేశాను. నేను బాగా చదువుకోవాలనేది నాన్న కోరిక. కానీ నాకు యుఎస్ లో ఉండడం ఇష్టం లేదు. ఒకరోజు జానకి రామ్ అన్నయ్య ఫోన్ చేసి నీకు సినిమాలు అంటే ఇష్టం కదా.. ఎందుకు నటించకూడదు అని అడిగారు. వెంటనే ఇండియా వచ్చి సినిమాల్లోకి వస్తాను నాన్న అని చెప్పా. చదువు పూర్తయింది కాబట్టి నాన్న కూడా ఒప్పుకున్నారు అని కళ్యాణ్ రామ్ తెలిపారు.
కానీ నాన్న ఒక మాట చెప్పారు. సినిమాలు అంటే యుఎస్ వెళ్లి జాబ్ తెచ్చుకున్నంత ఈజీగా ఉండదు. చాలా కష్టపడాలి అని చెప్పారు. ఆ విధంగా రామోజీరావు గారి నిర్మాణంలో తొలి చూపులోనే అనే చిత్రంతో హీరోగా కళ్యాణ్ రామ్ పరిచయం అయ్యాడు. అయితే అతనొక్కడే చిత్రంతో కళ్యాణ్ రామ్ కి ఫస్ట్ సక్సెస్ లభించింది.