బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ అయిన నాగార్జున, ఆసినిమా చేసుంటే..?
కింగ్ నాగార్జును మంచి మంచి హిట్ సినిమాలను అప్పట్లోనే మిస్ అయ్యాడట. అవి కనుక చేసి ఉంటే నాగ్ హీరోగా మెగాస్టార్ రేంజ్ లో ఉండేవాట. ఆయన కెరీర్ లో మిస్ అయిన భారీ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా..?

Stars married twice
టాలీవుడ్ మన్మధుడు.. కింగ్ నాగార్జున సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన మాత్రమే కాదు ఆయన తనయులిద్దరు మంచి సినిమా కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు ఈక్రమంలో నాగార్జున బిగ్ బాస్ తో పాటు.. కొన్ని సినిమాలో లీడ్ పాత్రలు చేస్తూ.. కాస్త ఇమేజ్ ను కాపాడుకుంటున్నారు. నిజానికి సోగ్గాడే చిన్ని నాయన సినిమా తరువాత నాగార్జునకు హిట్ పడింది లేదు. ఈక్రమంలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి.
Also Read: స్టార్ కామెడియన్ - అనిల్ రావిపూడి బెస్ట్ ఫ్రెండ్, కాని ఒక్క సినిమాలో కూడా కనిపించలే, కారణం..?
ఇక నాగార్జున ఇద్దరు వారసులు కూడా ఇలానే హిట్ కోసం ఎదురు చూస్తుండగా.. నాగచైతన్య మాత్రం తండేల్ మూవీతో రాబోతున్నాడు. ఇక నాగార్జున మాత్రం ప్రస్తుతం ఓ రెండు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తున్నాడు. రజినీకాంత్ కూలి సినిమాతోపాటు ధనుష్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే చాలామంది స్టార్స్ లాగానే కింగ్ నాగార్జున కూడా ఒకప్పుడు హిట్ సినిమాలను మిస్ అయ్యాడట. అది కూడా బ్లాక్ బస్టర్ సినిమా కథను రిజెక్ట్ చేసి .. ఆతరువాత బాధపట్టాడట.
ఆసినిమా మరేదో కాదు కలిసుందాం రా. వెంకటేష్ హీరోగా సిమ్రన్ హీరోయిన్ గా నటించిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు 25 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అప్పట్లో ఈ కలెక్షన్.. ఇప్పుడు 700 కోట్లకు సమానం. ఈలెక్కన చూసుకుంటే కలిసుందాం రా సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయినట్టే. అయితే ఈ హిట్ సినిమా కథను నాగ్ వదులుకున్నాడట.
అప్పట్లో రొమాంటిక్ మూవీస్ చేస్తూ వచ్చిన నాగ్.. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో వద్దు అనుకున్నాడని టాక్. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని. నిజంగా నాగార్జున అప్పుడు ఈ సినిమా చేసి ఉంటే బాగుండేది అంటున్నారు ఫ్యాన్స్. ఇలా కొన్ని మరికొన్నిబ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన మిస్అయ్యాడని టాక్. అవి కనుక చేసుంటే మెగాస్టార్ రేంజ్ లో ఎదిగేవాడు అంటున్నారు సినీ జనాలు. సినిమాలతో పాటు బిజినెస్ పై గట్టిగా దృష్టి పెట్టిన నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు పలు బిజినెస్ లను చూసుకుంటున్నాడు.