MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nagarjuna: 40 ఏళ్ల ప్రయాణంలో.. ఒకే రోజు రెండు అద్భుతాలు, ఏఎన్నార్ ను తలుచుకుని నాగార్జున ఎమోషనల్

Nagarjuna: 40 ఏళ్ల ప్రయాణంలో.. ఒకే రోజు రెండు అద్భుతాలు, ఏఎన్నార్ ను తలుచుకుని నాగార్జున ఎమోషనల్

టాలీవుడ్ కింగ్ నాగార్జున స్పెషల్ పోస్ట్ చేశారు. ఆయనకు చాలా ప్రత్యేకమైన రోజు గురించి మరింత ప్రత్యేకంగా మాట్లాడారు. ఆరోజు తన జీవితంలో మర్చిపోలేని రెండు విషయాలు జరిగినట్టు ఆయన వెల్లడించారు. ఇంతకీ ఆ స్పెషల్ డేట్ ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 24 2026, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నాగార్జునకు చాలా స్పెషల్ డే..
Image Credit : Facebook/Nagarjuna

నాగార్జునకు చాలా స్పెషల్ డే..

టాలీవుడ్ 'కింగ్' నాగార్జున అక్కినేనికి మే 23వ తేదీ చాలా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఆయన కెరీర్‌లో రెండు ముఖ్యమైన సంఘటనలు ఇదే రోజు జరిగాయి. ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా 'విక్రమ్' విడుదలైంది మే 23నే. అలాగే, ఆయన తండ్రి, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) చివరి సినిమా 'మనం' కూడా ఇదే రోజున థియేటర్లలోకి వచ్చింది. నటుడిగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగార్జున సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టగా, ఆయన కొడుకు నాగ చైతన్య కూడా తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
తనకు మొదటి సినిమా.. తండ్రికి చివరి సినిమా..
Image Credit : Youtube/Annapurna Studios

తనకు మొదటి సినిమా.. తండ్రికి చివరి సినిమా..

1986, మే 23న నాగార్జున హీరోగా పరిచయమైన 'విక్రమ్' సినిమా విడుదలైంది. ఈ సినిమాతోనే ఆయన సినీ ప్రయాణం మొదలైంది. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన నాగార్జున, ఆ తర్వాత 'శివ', 'గీతాంజలి', 'నిన్నే పెళ్లాడతా', 'అన్నమయ్య', 'మన్మథుడు', 'ఊపిరి' వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు. సరిగ్గా నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చిన అదే రోజున.. కొన్ని సంవత్సరాల తర్వాత, తన తండ్రి ఏఎన్ఆర్ చివరి సినిమా 'మనం'ను కూడా విడుదల చేశారు. ఈ రెండు సినిమాలూ ఒకే రోజు విడుదల కావడం నాగార్జునకు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం. ఈ ప్రత్యేకమైన రోజున నాగార్జున తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ఎమోషనల్ లెటర్ రాశారు.

Related Articles

Related image1
Sobhan Babu: నోరు తెరిస్తే డబ్బు, పరమ పీనాసోడు, పక్కా బిజినెస్ మేన్.. శోభన్ బాబుపై స్టార్ నటి షాకింగ్ కామెంట్స్
Related image2
Tabu: మిడ్ నైట 2 గంటలకు టాలీవుడ్ స్టార్ హీరోకి టబు ఫోన్, కారణం తెలిస్తే షాక్ అవుతారు
35
నాగార్జున ఎమోషనల్ పోస్ట్
Image Credit : Asianet News

నాగార్జున ఎమోషనల్ పోస్ట్

నాగార్జున తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో అభిమానులకు ఓ లేటర్ రాశారు. 'మనం' సినిమాను గుర్తుచేసుకుంటూ, 'మే 23 నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. నా తండ్రి, లెజెండ్ ఏఎన్ఆర్ గారి చివరి చిత్రం 'మనం'ను నిర్మించి, విడుదల చేసే గౌరవం నాకు దక్కింది ఈరోజే. ఆ సినిమాలో మా నాన్న, నా కొడుకులతో కలిసి నటించే అదృష్టం కూడా కలిగింది' అని రాశారు.'

45
అభిమానులందరికీ కృతజ్ఞతలు
Image Credit : Asianet News

అభిమానులందరికీ కృతజ్ఞతలు

అలాగే, చాలా ఏళ్ల క్రితం ఇదే మే 23న నా మొదటి సినిమా 'విక్రమ్' కూడా విడుదలైంది. మిమ్మల్ని అందరినీ అలరించడానికి, మీ ప్రేమను, ఆశీర్వాదాలను పొందడానికి నాకు అవకాశం దొరికింది. ఇన్నేళ్లుగా నాకు అండగా నిలిచిన అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి మరెన్నో మే 23లు వస్తాయని ఆశిస్తున్నాను' అని నాగార్జున అన్నారు.

55
నాగ చైతన్య అభినందనలు
Image Credit : social media

నాగ చైతన్య అభినందనలు

సినిమా ఇండస్ట్రీలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న తండ్రి నాగార్జునకు, ఆయన కొడుకు, నటుడు నాగ చైతన్య కూడా అభినందనలు తెలిపారు. 'విక్రమ్' సినిమా నుంచి ఇప్పటివరకు, మీరు వేసిన ప్రతి అడుగులోనూ ధైర్యం ఉంది. ఎన్నో కొత్త ట్రెండ్స్ సృష్టించారు. నాకు మాత్రమే కాదు, ఎంతోమంది నిర్మాతలకు, రాబోయే తరాలకు మీరే స్ఫూర్తి. థ్యాంక్యూ కింగ్ నాగార్జున' అని చైతన్య తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'క్లాసిక్ చిత్రం 'మనం'కు 12 ఏళ్లు. ఏఎన్ఆర్ గారు మనతోనే జీవించి ఉన్నారు. ఈ సినిమాలో భాగమైనందుకు నేను అదృష్టవంతుడిని. మే 23 ఎప్పటికీ ప్రత్యేకమైన రోజే' అని ఆయన రాసుకొచ్చారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: రష్మిక మందన్న లో ఈ టాలెంట్ కూడా ఉందా? విజయ్ కట్టిన తాళిలో సీక్రెట్ ఏంటో తెలుసా?
Recommended image2
Sobhan Babu: నోరు తెరిస్తే డబ్బు, పరమ పీనాసోడు, పక్కా బిజినెస్ మేన్.. శోభన్ బాబుపై స్టార్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
అప్ప‌ట్లో ఏదో పిచ్చి సినిమా అనుకున్నాం కానీ.. ఇంత అర్థం ఉందా.? జీవితాన్ని మార్చే మెసేజ్
Related Stories
Recommended image1
Sobhan Babu: నోరు తెరిస్తే డబ్బు, పరమ పీనాసోడు, పక్కా బిజినెస్ మేన్.. శోభన్ బాబుపై స్టార్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Tabu: మిడ్ నైట 2 గంటలకు టాలీవుడ్ స్టార్ హీరోకి టబు ఫోన్, కారణం తెలిస్తే షాక్ అవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved