MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tollywood Heroines: శ్రీనిధి నుంచి ఆషిక వరకు.. టాలీవుడ్ లో కన్నడ బ్యూటీల హవా

Tollywood Heroines: శ్రీనిధి నుంచి ఆషిక వరకు.. టాలీవుడ్ లో కన్నడ బ్యూటీల హవా

రష్మిక మందన్న తర్వాత తెలుగు సినిమాల్లో కన్నడ నటీమణుల సందడి పెరుగుతోంది. ఆషిక రంగనాథ్, శ్రీనిధి శెట్టి, రుక్మిణి వసంత్, నేహా శెట్టి, కృతి శెట్టి తమ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 25 2026, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Srinidhi Shetty
Image Credit : Asianet News

Srinidhi Shetty

తెలుగు సినిమా పరిశ్రమలో ఇతర భాషల నటీమణులకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న హీరోయిన్లు తమ అందం, నటనతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న అగ్ర కథానాయికగా ఎదగగా, ఇప్పుడు ఆషిక రంగనాథ్, శ్రీనిధి శెట్టి, రుక్మిణి వసంత్ వంటి నటీమణులు తెలుగు సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. మరోవైపు నేహా శెట్టి, కృతి శెట్టి కూడా తమ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. కన్నడ నేపథ్యం ఉన్న ఈ హీరోయిన్లు నటించిన సినిమాలు, టాలీవుడ్‌లో వారికి వచ్చిన గుర్తింపు గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆషిక రంగనాథ్
Image Credit : Instagraam/ashika_rangnath

ఆషిక రంగనాథ్

కన్నడ చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న ఆషిక రంగనాథ్ తెలుగు ప్రేక్షకులకు ‘అమిగోస్’, ‘నా సామిరంగ’ సినిమాలతో పరిచయమయ్యారు. నాగార్జునతో కలిసి నటించిన ‘నా సామిరంగ’లో తన పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’తో పాటు మరికొన్ని తెలుగు ప్రాజెక్టులతోనూ ఆమె పేరు వినిపిస్తోంది.

36
శ్రీనిధి శెట్టి
Image Credit : Instagram, Facebook

శ్రీనిధి శెట్టి

‘కేజీఎఫ్’ సినిమాల్లో రీనా పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి తెలుగు సినిమాల్లోనూ తన ప్రయాణాన్ని విస్తరిస్తున్నారు. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తర్వాత ‘కోబ్రా’, ‘హిట్: ది థర్డ్ కేస్’ వంటి చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం వెంకటేష్ సరసన ఆదర్శ కుటుంబం చిత్రంలో నటించింది. ఈ మూవీ అక్టోబర్ 30న రిలీజ్ కి రెడీ అవుతోంది.

46
రుక్మిణి వసంత్
Image Credit : Asianet News

రుక్మిణి వసంత్

‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమాలతో ప్రశంసలు అందుకున్న రుక్మిణి వసంత్ కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. తెలుగులో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో కనిపించిన ఆమెకు, ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో అవకాశం దక్కింది. ఈ ప్రాజెక్టుతో తెలుగు ప్రేక్షకుల్లో ఆమెపై ఆసక్తి మరింత పెరిగింది.

56
కృతి శెట్టి
Image Credit : Instagram/@krithi.shetty_official

కృతి శెట్టి

‘ఉప్పెన’ సినిమాతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’, ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘కస్టడీ’, ‘మనమే’ వంటి చిత్రాల్లో నటించారు. తెలుగు సినిమాలతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంటూ ఇతర భాషల ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

66
నేహా శెట్టి
Image Credit : Neha Shetty/instagram

నేహా శెట్టి

‘డీజే టిల్లు’ సినిమాలో రాధిక పాత్రతో నేహా శెట్టి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పాత్రకు వచ్చిన ఆదరణతో ‘టిల్లు స్క్వేర్‌’లోనూ రాధికగా కనిపించారు. ‘మెహబూబా’, ‘గల్లీ రౌడీ’, ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి సినిమాలు ఆమె తెలుగు కెరీర్‌లో భాగంగా నిలిచాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఏడో వారం డబుల్‌ ఎలిమినేషన్‌, దక్షితోపాటు షాలిని ఎలిమినేట్‌.. కారణం ఇదే
Recommended image2
Sai Pallavi: రావణుడిగా నటించాలంటే దమ్ము కావాలి.. యశ్‌పై సాయి పల్లవి ప్రశంసలు!
Recommended image3
OTT Movies: ఇండియావైడ్‌గా నెట్‌ ఫ్లిక్స్ లో దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు.. టాప్‌ 10 మూవీస్‌
Related Stories
Recommended image1
Nagarjuna: తొలి సినిమా తర్వాత నేను పనికిరాను అని తేల్చేశారు, చైతూ పరిస్థితి ఏంటంటే.. నాగార్జున కామెంట్స్
Recommended image2
Naresh: క్లాసిక్ మూవీలో ఛాన్స్, డైరెక్టర్ రిజెక్ట్ చేయడంతో ఏడ్చేసిన నరేష్.. కృష్ణ ఏం చేశారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved