- Home
- Entertainment
- బాలకృష్ణతో సెట్ చేద్దాం అంటే భయంగా ఉంది.. సూపర్ స్టార్ కృష్ణ ఫ్లాప్ మూవీపై నాగార్జున సెటైర్
బాలకృష్ణతో సెట్ చేద్దాం అంటే భయంగా ఉంది.. సూపర్ స్టార్ కృష్ణ ఫ్లాప్ మూవీపై నాగార్జున సెటైర్
తెలుగులో కొన్ని క్లాసిక్ మూవీస్ కి రీమేక్స్ చేయడం గురించి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ ఫ్లాప్ మూవీపై సెటైర్లు వేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ గురించి కూడా మాట్లాడారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Nagarjuna
క్లాసిక్ సినిమాలకు రీమేక్స్ చేయాలని, సీక్వెల్స్ చేయాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ క్లాసిక్ సినిమాలని టచ్ చేయకూడదు, వాటిని చెడగొట్టకూడదు అని భావించే వారు కూడా ఉంటారు. నాగార్జునకి కూడా ఇలాంటి సందిగ్ద పరిస్థితి ఎదురైంది. అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్ కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. వారిద్దరూ కలసి నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోయాయి.
చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను
అలాంటి వాటిలో గుండమ్మ కథ ఒకటి. ఏఎన్నార్, ఎన్టీఆర్ లాగా మీరు, బాలకృష్ణ కలసి ఎందుకు నటించకూడదు అని ఓ ఇంటర్వ్యూలో నాగార్జునకి ప్రశ్న ఎదురైంది. నాగార్జున బదులిస్తూ.. బాలయ్యతో నటించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను. బాలయ్య, నేను తరచుగా మాట్లాడుకుంటుంటాం. మేమిద్దరం కలసి ఒక సినిమా చేయాలని చర్చ కూడా జరిగింది.
సీడీ కూడా పంపించారు
ఆ మధ్యన బాలయ్య నాకు చుప్ కే చుప్ కే మూవీ సీడీ కూడా పంపించారు. ఒకసారి చూడు.. ఈ మూవీ మనిద్దరం కలసి చేసే బావుంటుంది అని చెప్పాడు. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత దాని గురించి చర్చ రాలేదు. గుండమ్మ కథ సినిమా మాత్రం జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య చేయాలని అనుకుంటున్నారు. నేను బాలయ్య కలసి చేద్దాం అంటే ధైర్యం సరిపోవడం లేదు.
సూపర్ స్టార్ కృష్ణ మూవీపై సెటైర్లు
కొన్ని క్లాసిక్ మూవీస్ ని టచ్ చేయకపోవడమే మంచింది. గుండమ్మ కథ ఎలాంటి సినిమానో తారక్, చైతూకి తెలియదు. దేవదాసు రీమేక్ ఏమైందో తెలుసు కదా అంటూ నాగార్జున సూపర్ స్టార్ కృష్ణ మూవీపై సెటైర్లు వేశారు. ఏఎన్నార్ కెరీర్ లో అద్భుతమైన చిత్రాలలో దేవదాసు ఒకటి. ఆ చిత్రాన్ని కృష్ణ రీమేక్ చేశారు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. అదే విషయాన్ని నాగార్జున పరోక్షంగా ప్రస్తావించారు.
విభేదాలు తలెత్తినట్లు వార్తలు
అప్పట్లో బాలకృష్ణ, నాగార్జున స్నేహంగా ఉండేవారు. కానీ కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. చైతు తారక్ గుండమ్మ కథ రీమేక్ లో నటిస్తున్నారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు.

