- Home
- Entertainment
- కెప్టెన్ కాగానే కళ్ళు నెత్తికెక్కాయా, పాతాళానికి వెళ్ళిపోతావ్.. తనూజపై నాగార్జున ఫైర్
కెప్టెన్ కాగానే కళ్ళు నెత్తికెక్కాయా, పాతాళానికి వెళ్ళిపోతావ్.. తనూజపై నాగార్జున ఫైర్
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 లో నాగార్జున శనివారం రోజు తనూజకి ఒక రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. నాగార్జున ఆమెని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

నాగార్జున ఎంట్రీ
శనివారం రాగానే బిగ్ బాస్ షోలో నాగార్జున కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకుతుంటారు. ఆ వారం చేసిన తప్పుల విషయంలో వార్నింగ్ ఇస్తుంటారు. దీనికి కంటెస్టెంట్లు వివరణ ఇచ్చుకోవడం, ఇంటెన్షనల్ గా చేయలేదని చెప్పడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో పెర్ఫార్మెన్స్ పరంగా తనూజ టాప్ 5 లో ఉంటుందని ఆమె అభిమానులు అంటున్నారు. చాలా మంది ఆమె టాప్ 3లో ఉండడం గ్యారెంటీ అని కూడా చెబుతున్నారు.
తనూజపై నెగిటివిటీ
అయితే తనూజ బిహేవియర్ విషయంలో కొంత మేరకు ఆమెపై విమర్శలు ఉన్నాయి. ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం, చిన్న విషయాలలో కూడా లాజిక్స్ మాట్లాడి పై చేయి సాధించాలని ప్రయత్నించడం లాంటి అంశాలు ఆమెపై నెగిటివిటీ పెరిగేలా చేస్తున్నాయి.
దివ్య వర్సెస్ తనూజ
తాజాగా శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్ లో నాగార్జున తనూజని గట్టిగా టార్గెట్ చేశారు. ప్రోమోలో నాగార్జున ఆమెపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో తనూజ, దివ్య మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ సాగుతోంది. అసలు వీరిద్దరి గొడవలో తప్పు ఎవరిది అని నాగార్జున.. భరణి, ఇమ్మాన్యుయేల్ లాంటి కంటెస్టెంట్లని అడిగి వారి అభిప్రాయం తీసుకుంటున్నారు.
తనూజదే తప్పు
భరణి మొహమాటం లేకుండా ఈ వివాదంలో తనూజదే తప్పు అని చెబుతున్నారు. ఇమ్మాన్యుయేల్ మాత్రం దివ్యది తప్పు అని భావిస్తున్నట్లు తెలిపాడు. పవన్ మాట్లాడుతూ ఈ గొడవ మొదలు కావడానికి కారణం తనూజ అని తెలిపారు. దివ్య స్టాండ్ తీసుకోవడం తప్పు కాదు అని, కానీ అనవసరంగా కొన్ని మాటలు అనేసింది అని ఇమ్మాన్యుయేల్ అభిప్రాయపడ్డాడు.
కళ్ళు నెత్తికెక్కాయా ?
నాగార్జున మాట్లాడుతూ తనూజకి ఒక రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. కెప్టెన్ అవ్వగానే నీకు కళ్ళు నెత్తికెక్కాయా ? అని ప్రశ్నించారు. అసలు మీ ఇద్దరి గొడవలో భరణిని ఎందుకు లాగారు అని అడిగారు. ఒక్క తప్పు చాలు తనూజ.. పాతాళానికి వెళ్ళిపోతావ్ అంటూ నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

