- Home
- Entertainment
- కోడలు శోభితాకి `తండేల్` సక్సెస్ క్రెడిట్ ఇచ్చిన నాగార్జున.. నాగ చైతన్యపై ఎమోషనల్ కామెంట్స్
కోడలు శోభితాకి `తండేల్` సక్సెస్ క్రెడిట్ ఇచ్చిన నాగార్జున.. నాగ చైతన్యపై ఎమోషనల్ కామెంట్స్
Nagarjuna: నాగార్జునలో సంతోషం కట్టలు తెంచుకుంది. నాగచైతన్యకి `తండేల్` రూపంలో చాలా రోజుల తర్వాత హిట్ రావడంతో ఆ సక్సెస్ క్రెడిట్‌ని తన కోడలు శోభితాకి ఇవ్వడం విశేషం.

Nagarjuna: నాగచైతన్యకి చాలా రోజుల తర్వాత సక్సెస్ పడింది. సాయిపల్లవితో కలిసి ఆయన నటించిన `తండేల్` మూవీ విజయవంతంగా రన్ అవుతున్న విషయం తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీని అల్లు అరవింద్, బన్నీవాసు నిర్మించారు.
గత శుక్రవారం విడుదలైన ఈ మూవీ భారీ కలెక్షన్లతో రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా `తండేల్ లవ్ సునామీ సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. దీనికి నాగార్జున గెస్ట్ గా వచ్చారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ `తండేల్` మూవీ సక్సెస్ క్రెడిట్‌ని కొత్త కోడలు శోభితకు ఇవ్వడం విశేషం. శోభితా తన ఇంటికి కోడలుగా వచ్చిన వేళా విశేషం నాగచైతన్యకి `తండేల్` రూపంలో సక్సెస్ వచ్చిందని చెప్పడం విశేషం. ఇంకా నాగ్ మాట్లాడుతూ, సక్సెస్ మీట్ కి వచ్చి చాలా రోజులౌతుంది. చాలా సంతోషంగా వుంది.
అరవింద్ కథ విని చందూ మొండేటితో తీద్దామన్నా వేళావిశేషం, దేవిశ్రీ మ్యూజిక్, బన్నీవాసు టీంని సెట్ చేసిన వేళా విశేషం, నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకున్న వేళావిశేషం.. ఇవన్నీ బావున్నాయి. ‘తండేల్’ సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది.
also read: Naga Chaitanya: బోయపాటి డైరెక్షన్‌లో నాగ చైతన్య? అక్కినేని హీరో తప్పులో కాలేస్తున్నారా?
ఫిబ్రవరి 7న సినిమా రిలీజ్ అయినప్పుడు ఢిల్లీలో వెళ్లాం. ప్రధాని మోడీ గారిని కలిశాం. అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు. చైతు ఫోన్ చుద్దామంటే తను త్వరగా బయటికివెళ్ళాడు. బయటకి రాగానే కంగ్రాట్స్ డాడీ అని ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫ్యాన్స్ నుంచి వరుసగా కంగ్రాట్స్ మెసేజ్ లు వచ్చాయి.
అప్పుడు అర్ధమైయింది మా కన్నా మా శ్రేయోభిలాషులు ఎంత ఆనందం పడుతున్నారో అని. అందుకే అన్నాను చాలా రోజులైయింది సక్సెస్ మీట్ కి వచ్చి అని. అరవింద్ కథ విని దాన్ని లవ్ స్టొరీగా చేసి అద్భుతమైన టీం ని సెట్ చేసి సినిమాని చేయడం అంత ఈజీ కాదు. కానీ అరవింద్ గారు చేశారు. థాంక్ యూ సో మచ్.
read more: Thandel: ‘తండేల్’ సోమవారం పరీక్ష పాసైందా? , కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?
ఇండియాలో ఫస్ట్ 100 కోట్ల క్లబ్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు. గజనీ సినిమాతో ఆ రికార్డ్ అందుకున్నారు. 100 పెర్సెంట్ లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఇప్పుడు తండేల్.. మూడు సూపర్ హిట్లు.. ఒకటికి మించి ఒకటి ఇచ్చిన అరవింద్ గారికి థాంక్ యూ.
బన్నీవాసు గారు అందరినీ కన్విన్స్ చేసి సినిమాని అద్భుతంగా మలిచి రిలీజ్ చేయడంలో ఆయన సపోర్ట్ చాలా గొప్పది. చందు అంటే నాకు చాలా ఇష్టం. చైతులో నటుడ్ని బయటికి తీసుకొచ్చాడు. ఇందులో లాస్ట్ బిట్ సోల్ అఫ్ ది ఫిల్మ్.
అదే కాదు ప్రతిసన్నీవేశం అద్భుతంగా మలిచాడు. వి లవ్ యూ చందు. దేవి నా ఫేవరేట్. బుజ్జితల్లి సాంగ్ అవుట్ స్టాండింగ్ హిట్. మై రాక్ స్టార్. సాయి పల్లవి గురించి ఎంతచెప్పినా తక్కువే. ఆమెలో ఇన్నోసెన్స్ బుజ్జితల్లిలో కనిపించింది. సినిమాలో పని చేసిన అందరికీ కంగ్రాట్స్.
చైతు రెండేళ్ళు ఈ క్యారెక్టర్ కోసమే డెడికెటడ్ గా వున్నాడు. చాలా ట్రాన్స్ఫర్ అయ్యాడు. షూటింగ్ ఎక్కడ చేస్తున్నారు అంటే సముద్రంలో అని చెప్పాడు. ఎలా వుంది అంటే .. చాలా కష్టంగా వుంది. మత్స్యకారులు ఎంతకష్టపడుతున్నారో ఇప్పుడు అర్ధమైయింది. నాకు ఇంకా ఇన్స్ ప్రేషన్ వచ్చింది'అన్నాడు.
వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చైతన్య మొహంలో నవ్వు చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సినిమా అంతా ఆ లుక్, నడక, క్యారెక్టర్ ని మెంటైన్ చేసి చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. ఫోన్ కాల్ సీన్, బోట్ సీన్, జైలు సీక్వెన్స్ ఇలా చాలా సీన్స్ లో తన నటన ఎంతగానో ఆకట్టుకుంది.
ఇందులో చైతన్యని చూస్తుంటే నాన్నగారు గుర్తుకు వచ్చారు. అక్కినేని అభిమానులకి థాంక్ యూ. 2025లో ఇది ముహూర్తం. వస్తున్నాం కొడుతున్నాం` అని తెలిపారు నాగార్జున. ఈ కార్యక్రమంలో టీమ్ అంతా పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.
read more: Dilraju Decision: `గేమ్ ఛేంజర్` పరాజయం ఎఫెక్ట్.. స్టార్ హీరోలకు షాకిచ్చేలా దిల్ రాజు నిర్ణయం ?
also read: Jagapathibabu: జగపతిబాబు ఆ హీరోయిన్ కోసం ప్రాణాలే వదిలేద్దామనుకున్నాడా? ఆ రోజు ఏం జరిగిందంటే?