- Home
- Entertainment
- Jagapathibabu: జగపతిబాబు ఆ హీరోయిన్ కోసం ప్రాణాలే వదిలేద్దామనుకున్నాడా? ఆ రోజు ఏం జరిగిందంటే?
Jagapathibabu: జగపతిబాబు ఆ హీరోయిన్ కోసం ప్రాణాలే వదిలేద్దామనుకున్నాడా? ఆ రోజు ఏం జరిగిందంటే?
జగపతిబాబు ఓ స్టార్ హీరోయిన్‌ని ఎంతగానో ప్రేమించాడట. ఆమె కోసం ప్రాణాలే వదిలేద్దామనుకున్నాడట. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కథేంటో చూద్దాం.

jagapathi babu
జగపతిబాబు ఒకప్పుడు మ్యాన్లీ హీరోగా రాణించారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరించారు. ఆయన ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో అలరించారు. మధ్య మధ్యలో యాక్షన్ చిత్రాలతోనూ మెప్పించారు. తాను అన్ని రకాల మూవీస్ చేయగలను అని నిరూపించుకున్నారు. ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి నెగటివ్ రోల్స్ లో, అలాగే బలమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.
జగపతిబాబుకి హీరోయిన్ సౌందర్య విషయంలో బాగా వార్తలు వచ్చాయి. ఈ స్టార్ హీరోయిన్‌ని బాగా ప్రేమించాడని, ఆమెని మళ్లీ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడనే వార్తలు వినిపిస్తుంటాయి. ఆమని కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది. అలాగే పలువురు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే సౌందర్య 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ హఠాన్మరణం ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కి గురి చేసింది. ఇందులో సౌందర్య సోదరుడు కూడా ఉన్నారు. ఆ సమయంలో జగపతిబాబు బాబు రియాక్షన్ ఏంటి? అనేది అందరిని వెంటాడిన ప్రశ్న.
అయితే జగపతిబాబు సౌందర్య మరణంతో తాను తట్టుకోలేకపోయాడట. గుండె పగిలినంత పని అయ్యిందని, తాను కూడా ప్రాణాలు వదిలేద్దామనుకున్నాడట. ఈ విషయాన్ని జగపతిబాబునే చెప్పినట్టు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
జగపతిబాబు.. సౌందర్య మరణ వార్తని తట్టుకోలేకపోయాడని, ఆయన కూడా చనిపోవడానికి సిద్ధపడ్డాడని తెలిపారు. తనని ప్రేమించి ఎన్నోనిందలు భరించిందని, తన కోసం ఎంతో చేసిందని, అలాంటి సౌందర్య లేకపోతే తాను ఎలా ఉంటాను అని చెప్పి సంచలన నిర్ణయం తీసుకున్నాడని, కానీ ఫ్యామిలీ, భార్య ఒత్తిడి మేరకు తాను వెనక్కి తగ్గాడని రామారావు చెప్పారు.
Actor Jagapathi Babu
అయితే దీనిపై జగపతిబాబు స్పందిస్తూ సౌందర్యని కోల్పోవడం కచ్చితంగా బాధకలిగించే విషయమే. నాకే కాదు, ఇండస్ట్రీలో చాలా మంది బాధపడ్డారు. కానీ తనకు సౌందర్య ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అనే ఆలోచన ఉండేది?
సౌందర్య మదర్, తమ్ముడి భార్య వాళ్లు ఎలా? ఏమైపోతారు అనిపించిందని, వాళ్ల ప్రాపర్టీస్ విషయంలో జరిగిన అన్యాయం ఏంటి? అనే దానిపై తన ఆలోచన వెళ్లిపోయిందన్నారు జగపతిబాబు. రేపు(ఫిబ్రవరి 12)న జగపతిబాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన అరుదైన విషయాలు వైరల్ అవుతున్నాయి.
read more: ఐదు వేలతో స్టార్ట్ చేసి, ఆరు కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగిన హీరోయిన్, ఆమె ఉంటే సినిమా హిట్టే !
also read: Ram Charan New films: రామ్ చరణ్ రెండు ఊహించని కాంబినేషన్స్.. మైథలాజికల్ మూవీ కూడా?