Naga Chaitanya: బోయపాటి డైరెక్షన్‌లో నాగ చైతన్య? అక్కినేని హీరో తప్పులో కాలేస్తున్నారా?
Naga Chaitanya-Boyapati Srinu: నాగచైతన్య `తండేల్` సక్సెస్ అనంతరం ఇప్పుడు మరో మాస్ మూవీ చేయబోతున్నారట. బోయపాటి శ్రీనుతో కలిసి నెక్ట్స్ మూవీ చేయబోతున్నారనే వార్త వినిపిస్తుంది.

అక్కినేని నాగచైతన్య ఇటీవలే `తండేల్`తో మళ్లీ పుంజుకున్నారు. ఈ మూవీ సక్సెస్ టాక్ చైతూని వరుస ఫ్లాపుల నుంచి గట్టెక్కించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చైతూ నెక్ట్స్ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చైతూ నెక్ట్స్ మాస్, యాక్షన్ మూవీ చేయబోతున్నారట. ఓ మాస్, స్టార్ డైరెక్టర్‌తో మూవీ చేయబోతున్నారట. అది ఎవరో కాదు బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే కావడం విశేషం.

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పుకారు వైరల్ అవుతుంది. గీతా ఆర్ట్స్ లోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే చైతూ ఇప్పటి వరకు చూడని మాస్ యాంగిల్‌లో, యాక్షన్ ప్రధానంగా ఈ మూవీ ఉండబోతుందట. సింపుల్‌గా చెప్పాలంటే బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పొచ్చు.
ఈ లెక్కన చైతూ తాను మాస్ హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది. ఏ హీరో అయినా ఓస్థాయికి వచ్చాక మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. అదే ఇమేజ్‌ని పెంచుతుంది. మార్కెట్‌ని పెంచుతుంది. ఎక్కువ కాలం సస్పెయిన్ అవ్వడానికి ఉంటుంది.
అందులో భాగంగా నాగచైతన్య.. బోయపాటితో మూవీ చేసేందుకు ఓకే చేశారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ కాంబో నిజంగానే క్రేజీగా ఉండబోతుంది. చైతూని బోయపాటి చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
అదే సమయంలో నెటిజన్లు మాత్రం చైతూ కిది కరెక్ట్ ఛాయిస్ కాదంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు నాగచైతన్య హిట్లు కొట్టింది లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ మూవీస్ మాత్రమే. యాక్షన్ మూవీస్ చేసిన ప్రతిసారి తేడా కొట్టింది.
అక్కినేని హీరోల బలమే లవ్, ఫ్యామిలీ. కానీ అది కాకుండా యాక్షన్ అంటూ చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. చైతూ విషయంలో కూడా గతంలో అదే జరిగింది. కానీ మళ్లీ అదే తప్పుచేస్తున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. చైతూ మళ్లీ తప్పులో కాలేస్తున్నాడా అంటున్నారు.
అయితే ఇది బోయపాటి విషయంలోనూ ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన బాలయ్యతో తీసిన సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయి. ఇద్దరికీ ఆ వేవ్ లెంన్త్ కుదురుతుంది. కానీ ఇతర హీరోలతో చేసిన సినిమాలు మాత్రం వర్కౌట్ కాలేదు. ఒక్క అల్లు అర్జున్‌తో తప్ప. అది కూడా యావరేజ్‌గానే ఆడింది.
ఆ తర్వాత బాలయ్య కాకుండా ఇతర హీరోలతో చేసిన సినిమాలు బోల్తా కొట్టాయి. ఈ లెక్కన కూడా చైతూ, బోయపాటి కాంబో రిస్క్ తో కూడుకున్నదని అక్కినేని ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? అయితే ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
నాగచైతన్య ఇటీవలే `తండేల్` మూవీతో విజయాన్ని అందుకున్నారు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబడుతుంది. సోమవారం నుంచి కలెక్షన్లు పడిపోయినట్టు కనిపిస్తుంది. కానీ నిర్మాతలకు సేఫ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఈ మూవీకి సుమారు రూ.90కోట్లు ఖర్చు చేశారట.
సినిమాని రెండు ఏరియాలు తప్పితే మిగిలిన చోట్ల సొంతంగా రిలీజ్ చేశారు అల్లు అరవింద్, బన్నీవాసు. ప్రస్తుతం ఇది అరవై కోట్ల కలెక్షన్లు దాటిందని టీమ్ చెబుతుంది. అయితే ఒరిజిల్‌గా పది కోట్లు వరకు తక్కువగానే ఉంటాయని సమాచారం.
ఏదేమైనా ఇప్పటి వరకు సుమారు ముప్పై కోట్ల షేర్ వచ్చింది. సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ సుమారు రూ. 60కోట్లకు అమ్మినట్టు సమాచారం. ఈ రకంగా నిర్మాతలు సేఫ్ అవుతారని చెప్పొచ్చు.
read more: Thandel: ‘తండేల్’ సోమవారం పరీక్ష పాసైందా? , కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?
also read: `మెగా`బంధం తెంచుకున్నట్టేనా? రామ్ చరణ్ విషయంలో మరోసారి దొరికిపోయిన అల్లు అరవింద్

