రామ్ చరణ్ ఎంగేజ్మెంట్ కి వెళ్ళడానికి భయపడిన నాగార్జున.. ఎందుకో తెలుసా ?
రామ్ చరణ్ ఎంగేజ్మెంట్ కి వెళ్ళడానికి తాను భయపడినట్లు నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నాగార్జున ఎందుకు అలా అన్నారో ఇప్పుడు చూద్దాం.

ఆరుపదుల వయసులో హ్యాండ్సమ్ లుక్ లో నాగార్జున
అక్కినేని నాగార్జునని అభిమానులు ముద్దుగా మన్మథుడు అని పిలుస్తుంటారు. ఇండియన్ సినిమాలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో నాగార్జున ఒకరు. ఆరుపదుల వయసులో కూడా ఆయన యంగ్ లుక్ మెయింటైన్ చేస్తూ కుర్రాళ్ళకి పోటీ ఇస్తున్నారు. అలాంటి నాగార్జున ఒక సందర్భంలో తన లుక్స్ విషయంలో భయపడ్డారట.
గ్రీకు వీరుడు చిత్రం కోసం సరికొత్త లుక్
2012లో నాగార్జున నటించిన షిరిడి సాయి చిత్రం రిలీజ్ అయింది. ఆ మూవీలో నాగార్జున ఆ పాత్రకి తగ్గట్లుగా కనిపించారు. షిరిడి సాయి మూవీ తర్వాత నాగార్జున డైరెక్టర్ దశరథ్ కాంబినేషన్ లో గ్రీకు వీరుడు చిత్రం ప్రారంభం అయింది. ఆ మూవీలో నాగార్జునని డిఫరెంట్ గా, స్టైలిష్ లుక్ లో ప్రజెంట్ చేయాలని డైరెక్టర్ దశరథ్ భావించారు. దీనికోసం నాగార్జునకి హెయిర్ స్పైక్స్ పెట్టారు. ఆ టైంలో టాలీవుడ్ లో అది సరికొత్త లుక్.
ఇంట్లో వాళ్ళకి నచ్చింది
షిరిడి సాయి చిత్రంలో గుబురు గడ్డంతో కనిపించిన నాగార్జున గ్రీకువీరుడు మూవీ కోసం అల్ట్రా స్టైలిష్ గా మారిపోయారు. ఆ చిత్రం కోసం నాగార్జున సరికొత్త హెయిర్ స్టైల్, బియర్డ్ లుక్ లో కనిపించడం బాగా చర్చనీయాంశం అయింది. ఆ లుక్ లోకి మారిపోగానే నాగార్జునకి టెన్షన్ మొదలైందట. ఈ తరహా లుక్ టాలీవుడ్ లో అదే తొలిసారి. దీంతో చూసే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే టెన్షన్ నాగార్జునకు ఉండేదట.
ఇంటికి వెళ్ళగానే నాగచైతన్య, అఖిల్ ఇద్దరికీ నా లుక్ నచ్చింది. చాలా స్టైలిష్ గా ఉన్నారు నాన్న అని చెప్పారు. వెంటనే నేను రామ్ చరణ్ ఎంగేజ్మెంట్ కి హాజరు కావాలి. అక్కడికి సెలబ్రిటీలు అంతా వస్తారు. ఇంట్లో వాళ్లకి నా లుక్ నచ్చింది.. మరి బయట వాళ్లకు నచ్చుతుందా అని నాగార్జున సందేహ పడ్డారట. ఈ లుక్ లో నన్ను ఎంగేజ్మెంట్ కి వచ్చిన గెస్ట్ లు చూసి ఏమనుకుంటారో అని భయపడినట్లు నాగార్జున తెలిపారు.
రామ్ చరణ్ ఆశ్చర్యపోయాడు
రామ్ చరణ్ ఎంగేజ్మెంట్ లో నా లుక్ అందరికీ నచ్చింది. రామ్ చరణ్ అయితే.. ఏంటి ఇంత స్టైలిష్ గా మారిపోయారు అని ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తన లుక్ పై కాన్ఫిడెన్స్ వచ్చిందని నాగార్జున తెలిపారు. కానీ గ్రీకు వీరుడు చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ మూవీలో నాగార్జునకి హీరోయిన్ గా నయనతార నటించింది.
నాగార్జున తదుపరి చిత్రాలు
ప్రస్తుతం నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ కుబేర శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగార్జున వైవిధ్యమైన పాత్రలో నటించారు. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతల నేపథ్యంలో సిస్టన్ ని ప్రశ్నించేలా ఈ చిత్రం ఉండబోతోంది. ధనుష్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక రష్మిక మందన్న కీలక పాత్రలో మెరిసింది. ఈ మూవీపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది. నాగార్జున సోలో హీరోగా తదుపరి చిత్రం ఇంకా ఖరారు కాలేదు. మరోవైపు నాగార్జున రజనీకాంత్ కూలి చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారు. త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి హోస్ట్ గా కూడా చేయబోతున్నారు.