MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హ్యాపీడేస్ సీక్వెల్ కు రంగం సిద్దం చేస్తోన్న శేఖర్ కమ్ముల.. పార్ట్ 2లో హీరోలు ఎవరంటే?

హ్యాపీడేస్ సీక్వెల్ కు రంగం సిద్దం చేస్తోన్న శేఖర్ కమ్ముల.. పార్ట్ 2లో హీరోలు ఎవరంటే?

దాదాపు 20 ఏళ్ల క్రితం యూత్ ను ఉర్రూతలూగించిన సినిమా హ్యాపీడేస్... ఈ సినిమా ఇప్పటికీ టీవీల్లో వస్తే వదలకుండా చూస్తుంటారు. అటువంటి సినిమాకు సీక్వెల్ వస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం అదే పనుల్లో ఉన్నాడట శేఖర్ కమ్ముల. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 06 2026, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూత్ పై గట్టి ప్రభావం చూపించిన సినిమా?
Image Credit : Prime Videos

యూత్ పై గట్టి ప్రభావం చూపించిన సినిమా?

కొన్ని సినిమాలు ఆడియన్స్ మనసులపై ప్రభావం చూపిస్తుంటాయి.. ప్రేక్షకుల జీవితాలను ప్రతిభింబిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో కథ, పాత్రలు, భావోద్వేగాలు ప్రేక్షకుల ఆలోచనలను కూడా మార్చేస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటి దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్. 2007 సంవత్సరంలో పూర్తిగా కొత్తవాళ్లతో రూపొందిన ఈ సినిమా రఅప్పట్లో ఒక సంచలనాన్ని సృష్టించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంచలన విజయంతో ఆశ్చర్చపరిచిన సినిమా?
Image Credit : Prime Videos

సంచలన విజయంతో ఆశ్చర్చపరిచిన సినిమా?

ఈ సినిమా విడుదలైన మొదటి వారం రోజుల వరకు థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులు కనిపించలేదు. కాని ఆ తరువాత ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో.. థియేటర్లకు స్టూడెంట్స్ క్యూ కట్టారు. వారం రోజులు డల్ గా ఉన్న థియేటర్ల పరిస్థితి చెందడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మాటామాటా ప్రచారం పెరగడంతో సినిమా వసూళ్లు ఊహించని స్థాయిలో నమోదయ్యాయి. పూర్తిగా కొత్త నటీనటులతో రూపొందిన చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇంతటి విజయాన్ని సాధించగలదా అని ట్రేడ్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయారు.

35
ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంతో
Image Credit : our own

ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంతో

ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో యువతలో మంచి స్పందన పొందింది. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత చాలా మంది యువకులకు బీటెక్ చదవాలనే ఆసక్తి కలిగిందని అప్పట్లో చెప్పుకునేవారు. అందుకే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.ఇలాంటి విజయాన్ని మరోసారి తెరపై చూడాలని శేఖర్ కమ్ముల అభిమానులు చాలా కాలంగా ఆశపడుతున్నారు. ఇప్పుడు వారి కోరిక నెరవేరే అవకాశం ఉందని సమాచారం.

45
హ్యాపీ డేస్ సినిమాకు సీక్వెల్ రాబోతోందా?
Image Credit : Asianet News

హ్యాపీ డేస్ సినిమాకు సీక్వెల్ రాబోతోందా?

రీసెంట్ గా భారీ విజయాన్ని సాధించిన కుబేర సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తదుపరి ప్రాజెక్ట్ ఏమిటన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఆ సస్పెన్స్ కి తెరపడినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఆయన హ్యాపీ డేస్ 2 కథపై పని చేస్తున్నారన్న వార్త వైరల్ అవుతోంది. ఈసారి కథ నేటి తరం జెన్ జీ యువతను కేంద్రంగా చేసుకుని ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీల్లో యువత జీవన విధానం ఎలా ఉంది, వారి అలవాట్లు, స్నేహాలు, చిన్న చిన్న గొడవలు వంటి అంశాలను దగ్గరుండి పరిశీలించి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

55
హ్యాపీడేస్ సీక్వెల్ లో హీరో ఎవరు?
Image Credit : youtube print shot/ABN Telugu

హ్యాపీడేస్ సీక్వెల్ లో హీరో ఎవరు?

సమాచారం ప్రకారం ఈ స్క్రిప్ట్ ప్రస్తుతం చివరి దశలో ఉందని చెబుతున్నారు. త్వరలోనే కథ పూర్తిచేసి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈఅయితే మొదటి భాగమైన హ్యాపీ డేస్ పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కింది. కానీ ఈసారి మాత్రం యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఇద్దరు హీరోలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే ఆ హీరోలు ఎవరు అన్న విషయం ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంచారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Recommended image2
Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్
Recommended image3
Indian 3: రెండోది అట్టర్ ఫ్లాప్, అయినా మూడోది మొదలు పెట్టిన శంకర్.. వార్ మోడ్‌లో 'భారతీయుడు 3' షురూ
Related Stories
Recommended image1
100 కోట్ల ఆస్తులు, 70 కోట్ల ఇల్లు, తల్లి లేడీ సూపర్ స్టార్, తండ్రి, తాత, బాబాయ్ అంతా స్టార్లే.. ఎవరా బ్యూటీ ?
Recommended image2
Trisha Home Tour : చెన్నై, హైదరాబాద్‌లో ఇంద్రభవనాల్లాంటి త్రిష ఇళ్లను చూశారా? ఎలా ఉంటాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved