MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • నాగార్జున, ఎన్టీఆర్ నుంచి సుమ శ్రీముఖి వరకూ.. భారీ రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ యాంకర్స్ ఎవరో తెలుసా?

నాగార్జున, ఎన్టీఆర్ నుంచి సుమ శ్రీముఖి వరకూ.. భారీ రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ యాంకర్స్ ఎవరో తెలుసా?

తెలుగు టెలివిజన్ హిస్టరీలో ఎంతో మంది స్టార్ యాంకర్స్ బుల్లితెరపై అద్భుతాలు చేశారు. చేస్తూనే ఉన్నారు. స్టార్ హీరోలు కూడా హోస్ట్ లు గా మారి సక్సెస్ ఫుల్ గా ప్రోగ్రామ్స్ ను నడిపించారు. వారిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నవారు ఎవరో తెలుసా? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 15 2026, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
కింగ్ నాగార్జున..
Image Credit : Asianet News

కింగ్ నాగార్జున..

తెలుగులో యాంకర్స్ కు కొదవలేదు.. యంగ్ స్టర్స్ తో పాటు.. సుమ లాంటి సీనియర్ యాంకర్లు కూడా ఇప్పటికీ ఫామ్ ను మెయింటేన్ చేస్తున్నారు. మరో వైపు టాలీవుడ్ స్టార్ హీరోలు హోస్ట్ లు గా మారి.. బుల్లితెరపై సందడి చేశారు. కోట్లలో రెమ్యునరేషన్లు కూడా అందుకున్నారు. వారిలో ప్రస్తుతం మనం చెప్పుకోవలసిన మొదటి పేరు కింగ్ నాగార్జునది. ఆయన బిగ్ బాస్ హోస్ట్ గా గత ఏడు సీజన్ల నుంచి కొనసాగుతున్నారు. 

బిగ్ బాస్ 9వ సీజన్ వరకూ ఆయన నడిపించారు. త్వరలో బిగ్ బాస్ 10 కూడా ఆయన హోస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఆయన దాదాపు 30 కోట్లకు పైగా రెమ్యునరేఫన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోను కూడా నాగ్ నడిపించారు. దాని కోసం ఆయన 5 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
మెగాస్టార్ చిరంజీవి
Image Credit : Asianet News

మెగాస్టార్ చిరంజీవి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా హోస్ట్ గా మారి తన ముచ్చట తీర్చుకున్నాడు. ఆయన గతంలో “మీలో ఎవరు కోటీశ్వరుడు” నాలుగో సీజన్‌తో టెలివిజన్ రంగంలోకి హోస్ట్‌గా అడుగుపెట్టారు. ఈ సీజన్‌ కోసం ఆయన దాదాపు 30 కోట్లకు పైగా పారితోషికంగా తీసుకున్నట్లు సమాచారం.

39
బాలయ్య, జగపతి బాబు..
Image Credit : facebook.com/OnlyForBalakrishnaFans

బాలయ్య, జగపతి బాబు..

మరో వైపు వెండితెరపై స్టార్ హీరోలుగా వెలుగు వెలిగిన చాలామంది హోస్ట్ లు గా కూడా సత్తా చాటారు. వారిలో నాగ్, చిరుతో పాటు బాలయ్య, జగపతి బాబు కూడా ఉన్నారు. నందమూరి నటసింహం.. బాలకృష్ణ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ షోతో హోస్ట్ గా హడావిడి చేశారు. ఈ షోన్ ఆయన సక్సెస్ పుల్ గా నడిపించారు. 

సంచలన ఇంటర్వ్యూలు చేసి సక్సెస్ ఫుల్ హోస్ట్ అనిపించుకున్నారు. ఇందుకోసం బాలయ్య ఎపిసోడ్ కు 3 కోట్లకు పైగా వసూలు చేసినట్టు సమాచారం. అందులో నిజం ఎంతో తెలియదు. మరో వైపు జగపతి బాబు కూడా హెస్ట్ గా అదరగొట్టారు. జీలో ఆయన కొత్త షోతో అదరగొట్టారు. ఈ షో కోసం జగపతి బాబు ఎపిసోడ్ కు 50 లక్షల వరకూ తీసుకున్నట్టు తెలుస్తోంది.

49
జూనియర్ ఎన్టీఆర్..
Image Credit : Asianet News

జూనియర్ ఎన్టీఆర్..

యంగ్ టైగర్ Jr NTR కూడా బుల్లి తెరపై సందడి చేశాడు. ఆయన హోస్ట్ గా చేసిన ఫస్ట్ షో బిగ్ బాస్ సీజన్ 1. ఈ షోకి మొదటి యాంకర్ ఆయనే. ఫస్ట్ టైమ్ అయినా.. ఏమాత్రం బెరుకు లేకుండా సీజన్ 1 ను సూపర్ సక్సెస్ చేశాడు. భారీగా రేటింగ్ వచ్చేలా షోన నడిపించారు. మొదటి సీజన్‌కు ఒక్కో ఎపిసోడ్‌కు తారక్ 50 లక్షల వరకూ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ బిగ్ బాస్ తరువాత ఎవరు మీలో కోటీశ్వరులు” షో ను కూడా సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. ఈ ప్రోగ్రామ్ కు ఆయన 7 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

59
సుమ కనకాల
Image Credit : facebook.com/SumaKanakala

సుమ కనకాల

ఇక టాలీవుడ్ లో స్టార్ యాంకర్లు చాలామంది ఉన్నారు. వారిలో సుమ కనకాల అందరికంటే చాలా సీనియర్. సుమ కనకాల దాదాపు 20 ఏళ్లకు పైగా యాంకర్ గా కొనసాగుతోంది. టెలివిజన్ షోలతో పాటు.. ట్రైలర్ ఈవెంట్లు, ప్రీరిలీజ్ ఈవెంట్లను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తోందిసుమ. ప్రీ రిలీజ్ అయితే 10 లక్షల వరకూ సుమ తీసుకుంటున్నట్టు సమాచారం. చిన్న కార్యక్రమాలకు 5 లక్షలకు పైగా తీసుకునే స్టార్ యాంకర్.. టెలివిజన్ షోలలో ఒక్క ఎపిసోడ్ కు 2 లక్షల వరకూ తీసుకుంటుందట.

69
ప్రదీప్ మాచిరాజు..
Image Credit : our own

ప్రదీప్ మాచిరాజు..

సుమ తరువాత అంతటి మాటకారి యాంకర్ ప్రదీప్. సీనియర్ యాంకర్ కూడా.. టెలివిజన్‌లో అత్యంత పాపులర్ హోస్ట్‌ గా కొనసాగుతోన్న ప్రదీప్.. న ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 3 లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. అంతే కాదు ప్రీరిలీజ్ ఈవెంట్స్ కోసం 5 లక్షల వరకూ పారితోషికం తీసుకుంటారని సమాచారం.

79
అనసూయ
Image Credit : youtube/@iDreamCelebrities

అనసూయ

ఇక యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “జబర్దస్త్” తో యాంకర్ గా పరిచయం అయిన అనసూయ.. ఆతరువాత స్టార్ యాంకర్ గా ఎన్నో షోలను నిర్వహించింది. యాంకరింగ్ మానేసి వెండితెరపైకి వచ్చిన అనసూయ.. భారీ బడ్జెట్ సినిమాల్లో అద్భుమైన పాత్రలు చేస్తోంది. షోకు ఆమె ఒక లక్షకు పైగా తీసుకునేదని సమాచారం. సోషల్ మీడియాలో వరుస వివాదాలతో పాపులర్ అవుతోంది అనసూయ.. యాంకరింగ్ ను పూర్తిగా మానేసి సినిమాలపై ఫోకస్ చేసింది.

89
యాంకర్ శ్రీముఖి
Image Credit : Youtube/@Starmaa

యాంకర్ శ్రీముఖి

యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పలేదు.. కంచు కంఠంతో.. చేసిన ప్రతీ షోను సక్సెస్ చేస్తుంటుంది శ్రీముఖి. టెలివిజన్‌లో అత్యంత డిమాండ్ ఉన్న హోస్ట్‌లలో శ్రీముఖి కూడా ఒకరు. ఆమె ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 1 కు పైగా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. “బిగ్ బాస్ తెలుగు 3”లో పాల్గొన్న తరువాత ఆమెకు డిమాండ్ మరింతగా పెరిగింది.

99
సుడిగాలి సుధీర్..
Image Credit : youtube/@aha

సుడిగాలి సుధీర్..

బుల్లితెరపై స్టార్ హీరోలకు ఉన్నంత ఇమేజ్ ఉన్న నటుడు, హోస్ట్ సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుధీర్.. ఆతరువాత హోస్ట్ గా అవతారం ఎత్తాడు. ఒక్కో టెలివిజన్ ఎపిసోడ్ కు 1 లక్షకు పైగా రెమ్యునరేషన్ ను సుధీర్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఒక వైపు హోస్ట్ గా కొనసాగుతూనే.. మరో వైపు హీరోగా సినిమాలు చేస్తున్నాడు సుడిగాలిసుధీర్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Allu Arjun పాట క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టడం ఏ స్టార్ హీరో వల్ల కాదేమో
Recommended image2
రామ్ పోతినేని కి పెళ్లంటే ఇష్టం లేదా..? బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడా? మ్యారేజ్ పై ఎనర్జిటిక్ స్టార్‌ కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved