MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nagadurga: నిర్మాతకు 15 కండీషన్స్ పెట్టిన నాగదుర్గ.. హీరోయిన్‌గా `ఇడుపుకాయితం` స్టార్ట్

Nagadurga: నిర్మాతకు 15 కండీషన్స్ పెట్టిన నాగదుర్గ.. హీరోయిన్‌గా `ఇడుపుకాయితం` స్టార్ట్

ఫోక్‌ డాన్సర్‌ నాగదుర్గ హీరోయిన్‌గా, ప్రియదర్శి హీరోగా `ఇడుపుకాయితం` మూవీ తెరకెక్కుతోంది. ఇది నేడు ప్రారంభమైంది. అయితే నాగదుర్గ పెట్టిన కండీషన్స్ హాట్ టాపిక్‌గా మారింది. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jun 25 2026, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నాగదుర్గ, ప్రియదర్శి జంటగా ఇడుపు కాయితం మూవీ
Image Credit : Asianet News

నాగదుర్గ, ప్రియదర్శి జంటగా ఇడుపు కాయితం మూవీ

ఫోక్‌ డాన్సర్‌ నాగదుర్గ.. ఫోక్‌ సాంగ్స్ తో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. జానపద పాటల్లో ఆమె చేసే  డాన్సులు చూస్తే ఊగిపోవాల్సిందే. ఎలాంటివారైనా డాన్సులు చేసేలా ఆమె స్టెప్పులుంటాయి. యూట్యూబ్‌లో ఫోక్‌ స్టార్‌గా రాణిస్తోన్న నాగదుర్గ ఇప్పుడు బిగ్‌ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె హీరోయిన్‌గా సినిమా ప్రారంభమైంది. `ఇడుపు కాయితం` పేరుతో గురువారం ప్రారంభమైన ఈ మూవీలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నారు. బన్నీవాసు, తబితా సుకుమార్‌ నిర్మిస్తున్నారు. బన్నీ వాస్‌ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ఈ మూవీ రూపొందుతుంది.  వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నిర్మాతకి నాగదుర్గ 15 కండీషన్స్
Image Credit : Asianet News

నిర్మాతకి నాగదుర్గ 15 కండీషన్స్

ఇందులో నాగదుర్గ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు నిర్మాత బన్నీవాసు. హీరోయిన్‌గా ఆమెని తీసుకోవాలంటే 15 కండీషన్స్ పెట్టిందట. ఒక తెలుగు అమ్మాయి సినిమా చేస్తే ఎలా ఉంటుందో, ఎంత సెలక్టీవ్‌గా ఉంటుందో అర్థమైందని, ఇలా ప్రతి విషయంలో కాన్ఫిడెంట్‌గా, తనకు ఏం కావాలో అంత క్లారిటీగా ఉందని చెప్పాడు బన్నీవాసు. ఆయన మాట్లాడుతూ, నేను సుకుమార్ కలిసి సినిమా నిర్మిస్తుంటే ఎవరైనా హ్యాపీగా వచ్చి చేస్తారనుకున్నా. కానీ నాగదుర్గ మాకు 15 కండీషన్స్ పెట్టింది. తెలుగమ్మాయి ఒక సినిమా చేస్తుంటే ఏం చేయగలను, ఏం చేయలేను అని ఎంత క్లారిటీగా ఉంటుంది అనేది నాగదుర్గతో మాట్లాడిన తర్వాత అర్థమైంది. నాగదుర్గ ఇప్పటికే యూట్యూబ్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె కోసం ఒక స్పెషల్ ట్యూన్ చేయిస్తున్నాం. ఆ డ్యాన్స్ నెంబర్ కు స్క్రీన్స్ చిరిగిపోతాయి` అని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, `ఇడుపు కాయితం"తో ఒక మంచి తెలుగు సినిమా చూడబోతున్నాం. సబ్ టైటిల్స్ తో బిహార్ లో వేసినా అక్కడ ప్రేక్షకులు కూడా చూసే చిత్రమిది. మన అందరి ఇళ్లలో ఒక కామన్ ప్రాబ్లమ్ ఉంటుంది. అది పెళ్లయిన వారికి తెలుసు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అమ్మాయి అయితే వాళ్ల అత్తామామను తీసుకుని థియేటర్ కు వెళ్లండి, అబ్బాయి అయితే అత్తామామను తీసుకుని విడిగా థియేటర్ కు వెళ్లండి. బయటకు వచ్చాక మీ అత్త మీ చేతులు పట్టుకుంటుంది. అల్లుడి చేతులు మామగారు పట్టుకుంటారు. అంతవరకు ఈ కథను చెప్పగలను. జమ్మికుంట నుంచి వచ్చాడు వంశీ. నేను ఆ ఊరు వెళ్లలేదు గానీ ఆయన కథ చెబుతుంటే ఊరు కళ్లముందు కనిపించింది. అంత బాగా కథ చెప్పాడు. ఈ సినిమా కథను మా దగ్గరకు తీసుకొచ్చి మేమంతా కలిసి ఈ మూవీ చేసేలా చేసింది ప్రియదర్శి. ఈ మూవీ ఇక్కడిదాకా వచ్చేందుకు వేణు ఊడుగుల, జగన్, పూజారి నాగేశ్వరరావు హెల్ప్ చేశారు. వాళ్లకు థ్యాంక్స్ చెబుతున్నా` అని అన్నారు.

Related Articles

Related image1
NBK112 Opening: గ్రాండ్‌గా బాలయ్య, కొరటాల మూవీ ఓపెనింగ్‌.. ఎన్బీకే కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌.. పెద్ద రిస్కే
Related image2
OG2: ఓజీ 2 కథ ఇదే, సుజీత్‌కి డేట్స్ ఇచ్చేసిన పవన్‌.. ఈ సారి ఎంత ఊహించుకున్నా తక్కువే
34
శ్రీలతగా కనిపించబోతున్న నాగదుర్గ
Image Credit : Asianet News

శ్రీలతగా కనిపించబోతున్న నాగదుర్గ

హీరోయిన్ నాగదుర్గ మాట్లాడుతూ, `యూట్యూబ్ లో నా పాటలు చూసి విని ఉంటారు. ఇప్పుడు `ఇడుపు కాయితం` అనే అద్భుతమైన మూవీతో మీ ముందుకు హీరోయిన్ గా వస్తున్నాను. ఇండస్ట్రీకి హీరోయిన్ గా రావాలని ఎంతోమంది అమ్మాయిలు కోరుకుంటారు. మీ అందరి సపోర్ట్ తో నాకు ఈ రోజు అవకాశం వచ్చింది. నేను ఈ స్టోరీని నమ్మాను. నన్ను ఈ స్టోరీ నమ్మింది. వంశీ గారు కథ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఈ అవకాశం కల్పించిన బన్నీ వాస్ గారికి, సుకుమార్ గారికి థ్యాంక్స్. వాళ్లను కలిసినప్పుడు నా పాటలు చూస్తాం, అభిమానిస్తాం అని చెప్పారు. టాలెంట్ ఎక్కడున్నా అది చేరుకోవాల్సిన చోటుకి చేరుకుంటుంది, దక్కాల్సిన గుర్తింపు తీసుకొస్తుంది అని అన్నారు. వారి మాటలతో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ కథలో నేను చేస్తున్న శ్రీలత అనే పాత్ర చాలా బరువైంది. నా 25వ బర్త్ డే సుకుమార్ గారి సమక్షంలో జరుపుకోవడం మర్చిపోలేను. ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తూ రచ్చ రచ్చ చేసేస్తారు అని చెప్పగలను` అని తెలిపింది.

44
గర్వంగా చెప్పుకునే మూవీ ఇడుపు కాయితం
Image Credit : Asianet News

గర్వంగా చెప్పుకునే మూవీ ఇడుపు కాయితం

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, `నేను గర్వంగా ఫీలయ్యే రోజు ఇది. మీరు నాపై చూపించిన ప్రేమను ఈ సినిమా ద్వారా తిరిగి మీకు అందించబోతున్నా. ఈ సినిమాలో శ్రీనివాస్ అనే పాత్రలో కనిపించబోతున్నా. ఈ పాత్ర కోసం నేను ఏం చేయాలో అదంతా చేస్తాను. ఇది తెలంగాణ నేపథ్య సినిమా అయి ఉండొచ్చు. తెలంగాణ భాష, యాస, తిండి, బట్ట అంతా కనిపించవచ్చు కానీ గర్వంగా చెప్పగలను ఇది ఒక గ్లోబల్ స్థాయి సినిమా. ఈ సినిమాను మేము జమ్మికుంట, ఇల్లంతకుంట, హైదరాబాద్, సనత్ నగర్ ఎక్కడ చిత్రీకరించినా, ఈ కథ మూలాలు ప్రతి ఇంట్లో ఉంటాయి. ఇది నా ఇంట్లో ఉన్న కథ. వంశీ ఈ కథ చెప్పినప్పుడు ఇది నా కథ అని నమ్మాను. అలాగే మా టీమ్ అంతా నమ్మారు. మాటల్లేవ్‌, సినిమాతో మాట్లాడతాం` అని చెప్పారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishnu Vishal: అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్‌ హీరో.. మూడేళ్లు దాచిన నిజం బట్టబయలు
Recommended image2
Avantika Wedding: గోవాలో ఖుష్బూ కుమార్తె పెళ్లి.. నాగార్జున హంగామా చూశారా, వైరల్ ఫోటోస్
Recommended image3
Vadde Naveen: వడ్డే నవీన్‌ మొదటి భార్య ఎవరో తెలుసా? విడాకుల కారణంగానే హీరోగా కెరీర్‌ క్లోజ్‌, తొక్కేసింది ఎవరు?
Related Stories
Recommended image1
NBK112 Opening: గ్రాండ్‌గా బాలయ్య, కొరటాల మూవీ ఓపెనింగ్‌.. ఎన్బీకే కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌.. పెద్ద రిస్కే
Recommended image2
OG2: ఓజీ 2 కథ ఇదే, సుజీత్‌కి డేట్స్ ఇచ్చేసిన పవన్‌.. ఈ సారి ఎంత ఊహించుకున్నా తక్కువే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved