MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • NBK112 Opening: గ్రాండ్‌గా బాలయ్య, కొరటాల మూవీ ఓపెనింగ్‌.. ఎన్బీకే కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌.. పెద్ద రిస్కే

NBK112 Opening: గ్రాండ్‌గా బాలయ్య, కొరటాల మూవీ ఓపెనింగ్‌.. ఎన్బీకే కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌.. పెద్ద రిస్కే

NBK112 Opening: నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీకి సంబంధించిన ఓపెనింగ్‌ గ్రాండ్‌ గా జరిగింది. నారా లోకేష్‌ దీనికి క్లాప్‌ నివ్వడం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 25 2026, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య సినిమా
Image Credit : Asianet News

కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య సినిమా

బాలకృష్ణ మరోసారి సినిమాల స్పీడ్‌ పెంచాడు. ఒక మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే మరో సినిమాని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఆయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఎన్బీకే 111 సినిమా చేస్తున్నారు. ఇందులో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా సాగబోతుందట. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమాని స్టార్ట్ చేశారు బాలయ్య. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గ్రాండ్‌గా ఎన్బీకే 112 మూవీ ఓపెనింగ్‌
Image Credit : Asianet News

గ్రాండ్‌గా ఎన్బీకే 112 మూవీ ఓపెనింగ్‌

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా నేడు గురువారం అమరావతిలో ప్రారంభమైంది. మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా ఈ మూవీ ప్రారంభం కావడం విశేషం. ఆయన క్లాప్‌ ఇవ్వగా, దర్శకుడు గోపీచంద్‌ మలినేని స్క్రిప్ట్ అందించారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కావడం విశేషం. ఈ మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ని ఆగస్ట్ లో ప్రారంభించనున్నట్టు నిర్మాత సుధాకర్‌ చెరుకూరి వెల్లడించారు. సుధాకర్‌ మిక్కిలినేనితో కలిసి ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు.

36
యాక్షన్‌, సామాజిక అంశాల మేళవింపుగా ఎన్బీకే 112 మూవీ
Image Credit : Asianet News

యాక్షన్‌, సామాజిక అంశాల మేళవింపుగా ఎన్బీకే 112 మూవీ

ఈ మూవీ బాలయ్య మార్క్ మాస్‌, కమర్షియల్‌ ఎలిమెంట్లతో ఉంటుందట. అదే సమయంలో యాక్షన్‌ ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది. దీనికితోడు కొరటాల మార్క్ సెన్సిబులిటీస్‌, సామాజిక అంశాలు కూడా ఉంటాయని, యాక్షన్‌, సోషల్‌ ఎలిమెంట్లని మేళవింపుగా దీన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు.

46
భారీ బడ్జెట్‌తో బాలయ్య మూవీ
Image Credit : Asianet News

భారీ బడ్జెట్‌తో బాలయ్య మూవీ

ఈ సందర్భంగా సినిమా బడ్జెట్‌ వివరాలు షాకిస్తున్నాయి. దీన్ని సుమారు రూ.150 నుంచి రూ.200కోట్ల బడ్జెట్‌తో నిర్మించబోతున్నారట. ఇది బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌ కావడం విశేషం. ఆయనపై వంద కోట్లకు మించి బడ్జెట్‌ పెట్టేందుకు మేకర్స్ వెనకడుగు వేస్తున్నారు. గోపీచంద్‌ మలినేని మూవీని అలానే మారిపోయింది. దీనికి సుమారు రెండు వందల కోట్ల వరకు బడ్జెట్‌ అనుకున్నారు. కానీ రికవరీ కష్టం అని చెప్పి కథలో మార్పులు చేశారు. హిస్టారికల్‌ ఎలిమెంట్లని తీసేసి మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లో సినిమాని తీస్తున్నారు. మరి ఇప్పుడు కొరటాల శివ మూవీని రెండువందల కోట్ల బడ్జెట్‌తో అంటే పెద్ద రిస్కే అని చెప్పొచ్చు.

56
బాలకృష్ణపై భారీ రిస్క్
Image Credit : Asianet News

బాలకృష్ణపై భారీ రిస్క్

బాలయ్య మార్కెట్‌ లిమిటెడ్‌గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఆయన సినిమాలు బాగా ఆడతాయి. పాన్‌ ఇండియా మార్కెట్‌లేదు. దీంతో ఆయన నటించిన సినిమాలు ఎంత పెద్ద హిట్‌ అయినా కలెక్షన్లు రూ.150కోట్లు దాటడం లేదు. దీంతో బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు ఆలోచిస్తున్నారు. కానీ కొరటాల శివతో సినిమా విషయంలో నిర్మాతలు డేర్‌ చేస్తున్నారు. అదే సమయంలో దీన్ని ప్రాపర్‌ పాన్‌ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్‌లో దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.

66
బాలయ్య ఓపెనింగ్‌లో సెలబ్రిటీల సందడి
Image Credit : Asianet News

బాలయ్య ఓపెనింగ్‌లో సెలబ్రిటీల సందడి

ఇదిలా ఉంటే బాలయ్య, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఓపెనింగ్‌కి భారీగా సెలబ్రిటీలు పాల్గొన్నారు. నిర్మాత సురేష్‌ బాబు, దర్శకుడు గోపీచంద్‌ మలినేని, సాహు గారపాటి, వెంకట్‌ సతీష్‌ కిలారు, అలాగే బాలయ్య రెండో కూతురు తేజస్విని వంటి చాలా మంది సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ఈ మూవీని ఎక్కువ భాగం ఏపీలోనే చిత్రీకరించబోతున్నారట.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
నారా లోకేష్
తెలుగు సినిమా
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Related Stories
Recommended image1
India Top 10 Heroines: సాయిపల్లవి, శ్రీలీలకు షాక్‌.. సమంత, త్రిష దూకుడు.. రష్మిక, నయనతార, కాజల్ స్థానాలు ఇవే
Recommended image2
Peddi 21 Days Collections: సమంత దెబ్బకి పెద్ది కుదేలు, 21 రోజుల్లో వచ్చింది ఇంతే.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved