- Home
- Entertainment
- నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుంది, నేను మాత్రం ఇన్ వాల్వ్ కాను.. కూతురిపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుంది, నేను మాత్రం ఇన్ వాల్వ్ కాను.. కూతురిపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మెగా డాటర్ నిహారిక రెండో పెళ్లిపై మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి విషయంలో తాము ఇన్ వాల్వ్ కాము అని తెలిపారు.

నిలవలేకపోయిన నిహారిక ఫస్ట్ మ్యారేజ్
మెగా డాటర్ నిహారిక ఇప్పటికే ఒక పెళ్లి చేసుకుని విడిపోయింది. చైతన్య జొన్నలగడ్డతో ఐదేళ్ల క్రితం ఆమె వివాహం జరిగిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్లు కలిసి ఉన్నారు.
ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అనంతరం విడిపోయారు. కోర్ట్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్టు వెల్లడించారు.
ఆ తర్వాత కూడా తమ డిగ్నిటీని మెయింటేన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒకరి గురించి మరొకరు ఎలాంటి నెగటివ్ కామెంట్ చేయలేదు. ఇది వారి హుందాతనాన్ని వెల్లడిస్తోంది.
నిహారిక రెండో పెళ్లిపై నాగబాబు వ్యాఖ్యలు
ఈ క్రమంలో ఇప్పుడు నిహారిక పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక ఇప్పుడు మరొకరితో ప్రేమలో ఉన్నారని, పెళ్లికి రెడీ అవుతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఈ వార్తలు వినిపించినా, ఇప్పుడు మరోసారి గుప్పుమంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు నిహారిక పెళ్లిపై తండ్రి నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు మొదటి పెళ్లి విషయంలోనే తాము పొరపాటు చేసినట్టు తెలిపారు.
పెళ్లి విషయంలో వరుణ్ తేజ్ జడ్జ్ మెంట్ రైట్
కూతురు నిహారిక, తాను చాలా మాట్లాడుకుంటామని, పిల్లల కెరీర్ విషయాల్లో తాను తలదూర్చను అని, పిల్లల విజయాలు, పరాజయాల గురించి తనకు అవసరం లేదని, వాళ్ల సంతోషమే తనకు ముఖ్యమని చెప్పారు నాగబాబు.
వాళ్లు సంతోషంగా ఉంటే అది తనకు సంతృప్తినిస్తుందని, వాళ్లు హ్యాపీగా లేకపోతే ఎన్ని కోట్లు ఉన్నా వృథానే అని చెప్పారు. వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుంటానని తన వద్దకు వచ్చి అడిగినప్పుడు ఆమెతో నువ్వు సంతోషంగా ఉంటావా? భావిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావు కదా? అని అడిగినట్టు తెలిపారు నాగబాబు.
వరుణ్ తేజ్ తాను హ్యాపీగా ఉంటానని చెప్పడం వల్లనే ఆ పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలిపారు. గ్రాండ్‌గా నిర్వహించామని, పెళ్లి విషయంలో వరుణ్ జడ్జ్ మెంట్ కరెక్ట్ అయ్యిందని, ఇప్పుడు ఇద్దరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు నాగబాబు.
నిహారిక విడాకులు ఆపే ప్రయత్నం చేయలేదు
అయితే ఈ సందర్భంగా మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగబాబు. నిహారిక మ్యారేజ్ విషయంలో మాత్రం తన జడ్జ్ మెంట్ తప్పయ్యిందన్నారు. ఆ పెళ్లి మేం చేసిన తప్పు అని, మేం సరిగా జడ్జ్ మెంట్ చేయలేకపోయామని, అలా అని తనకిష్టం లేని పెళ్లి చేయలేదన్నారు.
నిహారిక ఓకే అన్నాకనే ముందుకెళ్లామన్నారు. కాకపోతే ఆమెకి, అతనికి సింక్ కాలేదని చెప్పారు. ఆ తర్వాత పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్టు చెప్పారు.
అంతేకాదు ఈ సందర్బంగా మరో విషయం చెప్పారు నాగబాబు. నిహారిక, చైతన్య కలిసి ఉండాలని తాము ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. ఇష్టం లేదన్నారు, సరేనని చెప్పాను.
నిహారిక రెండో పెళ్లి ఆమె ఇష్టం, నేను ఇన్ వాల్వ్ కాను
నిహారిక ఇప్పుడు నిర్మాతగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. క్రియేటివ్ సైడ్ ఆమె యాక్టివ్‌గా ఉంటోంది. కొంత కాలం పోయాక మంచి అబ్బాయిని చూసి నిహారిక పెళ్లి చేసుకుంటుందని చెప్పుకొచ్చారు.
అయితే ఈ సారి నిహారిక పెళ్లి విషయంలో తమ ప్రమేయం ఉండదని, కొన్నాళ్లకి ఆమె ఓ అబ్బాయిని చూసుకుంటుందని, అతన్ని పెళ్లి చేసుకుంటుందని, ఆ విషయంలో తాము మాత్రం ఇన్ వాల్వ్ అవ్వము అని తెలిపారు నాగబాబు.
ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ లెక్కన ఇప్పుడు నిహారిక పెళ్లి ఆమె చేతుల్లోనే ఉంది, ఎలాంటి వాడిని చేసుకోవాలో కూడా తన చేతులోనే ఉందని చెప్పొచ్చు. నిహారిక ప్రస్తుతం సంగీత్ శోభన్ హీరోగా ఓ మూవీని నిర్మిస్తున్నారు. నేటి నుంచే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనట్టు సమాచారం.

