- Home
- Entertainment
- మాల్దీవుల్లో కాజల్ బర్త్ డే సెలెబ్రేషన్స్..బీచ్ లో బికినీలో మెరిసిన నటి, వైరల్ ఫోటోస్
మాల్దీవుల్లో కాజల్ బర్త్ డే సెలెబ్రేషన్స్..బీచ్ లో బికినీలో మెరిసిన నటి, వైరల్ ఫోటోస్
తాజాగా మాల్దీవుల్లో కుటుంబంతో కలిసి కాజల్ అగర్వాల్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపింది.

కాజల్ అగర్వాల్ బర్త్ డే సెలెబ్రేషన్స్
ఇటీవల స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జన్మదిన వేడుకలు జరిగాయి. జూన్ 19న కాజల్ తన 40వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంది. తన పుట్టినరోజు సందర్భంగా మాల్దీవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేసింది. అక్కడే బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. కాజల్ బర్త్ డే సందర్భంగా సెలెబ్రిటీలు, అభిమానులు, స్నేహితులు ఆమెకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాజల్ తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కృతజ్ఞతలు తెలిపిన కాజల్
తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కాజల్ ఇలా పేర్కొన్నారు: “మీ ప్రేమతో నా హృదయం నిండిపోయింది. నా పుట్టిన రోజును వెలుగులా మార్చిన నా మిత్రులు, అభిమానులు, కుటుంబానికి ధన్యవాదాలు. నా దైవం, నన్ను ప్రేమించే వారు చుట్టూ ఉండగా ఎప్పుడూ నా హృదయం ఆనందంతోనే ఉంటుంది.” అని తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు.
ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో కాజల్
ఈ సందేశం ద్వారా కాజల్ అగర్వాల్ తన పుట్టినరోజు రోజున ప్రేమతో శుభాకాంక్షలు చెప్పిన వారికి ఎమోషనల్ గా కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త గౌతమ్ కిచ్లూ, కొడుకు నీల్ తో కలిసి మాల్దీవుల్లో ఆమె బర్త్ డే సంబరాలు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతున్నాయి. కాజల్ తన బర్త్ డే సెలబ్రేషన్స్, మాల్దీవుల వెకేషన్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాజల్ తో పాటు ఆమె సోదరి నిషా అగర్వాల్ కూడా ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది.
బికినీ ఫోటోస్ వైరల్
మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ బికినీ ధరించి కాజల్ అగర్వాల్ కనిపించింది. కాజల్ బికినీ ఫోటోలు నెట్టింట ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. నిషా అగర్వాల్ కూడా బికినీలో మెరిసింది.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతున్న "కన్నప్ప" చిత్రంలో పార్వతి దేవి పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర ద్వారా ఆమె మరోసారి వెండితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోనున్నారు. మహాశివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించారు.
టాలీవుడ్ లో అగ్ర నటిగా..
ఒకప్పుడు కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా, మోస్ట్ సక్సెస్ ఫుల్ నటిగా కొనసాగింది. వివాహం తర్వాత ఆమెకి అవకాశాలు నెమ్మదిగా తగ్గుతూ వచ్చాయి.
కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కాజల్ తన కెరీర్ లో మహేష్, ఎన్టీఆర్, పవన్, రాంచరణ్, నాగ చైతన్య, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలతో నటించింది.
కాజల్ సూపర్ హిట్ చిత్రాలు
కాజల్ 2007లో లక్ష్మీ కళ్యాణం చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చందమామ చిత్రంలో నటించింది. 2009లో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ కి జోడిగా మగధీర చిత్రంలో నటించడంతో కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత కాజల్ వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. డార్లింగ్, బృందావనం, మిస్టర్ ఫర్ఫెక్ట్, బిజినెస్ మాన్, తుపాకీ, నాయక్, బాద్షా, టెంపర్, ఖైదీ నెంబర్ 150 ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. "కన్నప్ప" సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కాజల్ సన్నద్ధమవుతున్నారు.