- Home
- Entertainment
- నన్ను క్రిమినల్ లాగా చూస్తున్నారు.. సమంతతో విడాకులపై నాగచైతన్య సంచలన స్టేట్‌మెంట్
నన్ను క్రిమినల్ లాగా చూస్తున్నారు.. సమంతతో విడాకులపై నాగచైతన్య సంచలన స్టేట్‌మెంట్
Naga Chaitanya on Divorce: నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని దాదాపు ఐదేళ్లు అవుతుంది. దీనిపై మరోసారి స్పందించారు నాగచైతన్య. తాజాగా ఆయన సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు.

naga Chaitanya, Samantha
Naga Chaitanya on Divorce: నాగచైతన్య, సమంత ఏడేళ్లు ప్రేమించుకున్నారు. నాలుగేళ్లు కలిసి ఉన్నారు. ఐదేళ్ల క్రితం విడిపోయారు. పెళ్లి చేసుకున్న డేట్‌కి నాలుగు రోజుల ముందే తమ డైవర్స్ ని ప్రకటించారు. ఇద్దరు పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే వీరి డైవర్స్ ఏదో రూపంలో టాపిక్‌గా మారుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంది.
Naga Chaitanya on Divorce
సమంతతో విడాకులపై పలు సందర్భాల్లో నాగ చైతన్య స్పందించారు. ఇద్దరం కలిసే నిర్ణయం తీసుకున్నామని, నిర్ణయం విషయంలో హ్యాపీగానే ఉన్నామని, ఇప్పుడు కూడా ఎవరి లైఫ్‌లో వాళ్లు సంతోషంగా ఉన్నట్టుగానే తెలిపారు చైతూ.
అప్పట్లో ఆయన మాటలు వైరల్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు మరోసారి డైవర్స్ పై రియాక్ట్ అయ్యారు చైతూ. విడాకుల మ్యాటర్‌పై ఆయన షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎందుకు క్రిమినల్‌లాగా చూస్తున్నారు. ఎందుకు పదే పదే తమపై వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు.
Naga Chaitanya on Divorce with Samantha
ఓ యూట్యూబ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ, నా లైఫ్ లో ఏదైతే జరిగిందో, అది చాలా మంది లైఫ్‌లో జరుగుతుంది. అది కేవలం నా ఒక్కడి జీవితంలో జరిగింది కాదు, కానీ నన్ను ఎందుకు ఓ క్రిమినల్ లాగా ట్రీట్ చేస్తున్నారు. నేనే చేయరాని పెద్ద తప్పు చేసినట్టు చూస్తున్నారు. మ్యారేజ్ విషయంలో కొందరిని డిజప్పాయింట్ చేసిందుకు ఆ విషయంలో నేను సారీ చెబుతున్నాను.
naga Chaitanya
ఒక రిలేషన్ షిప్‌ని బ్రేక్ చేయాలంటే దాని గురించి నేను వెయ్యి సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే దాని పరిణామాలు నాకు తెలుసు. నేను ఒక బ్రోకెన్(విడాకులు) ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆ అనుభవం, ఆ పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఆ విషయంలో నేను ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను. ఇది మేము ఇద్దరం(సమంత, తాను) కలిసి తీసుకున్న నిర్ణయం.
దురదృష్టవశాత్తు అదొక టాపిక్‌లాగా అయిపోయి, అదొక హెడ్‌లైన్‌గా అయిపోయి, అదొక గాసిప్‌లా, ఇప్పుడదొక ఎంటర్‌టైన్‌మెంట్‌లాగా అయిపోయింది. దాని గురించి నేను మాట్లాడితే, ఆ ఇంటర్వ్యూ నుంచైనా ఇంకొన్ని ఆర్టికల్స్ పుడతాయి. దీనికి ఫుల్‌స్టాప్ అనేది ఎక్కడుండి? రాసే వాళ్లే పుల్ స్టాప్ పెట్టాలి` అని తెలిపారు నాగచైతన్య. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
naga Chaitanya
చైతూ నటించిన `తండేల్` మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించడం విశేషం. అల్లు అరవింద్, బన్నీవాసు నిర్మించిన ఈ మూవీకి చందూ మొండేటి. చాలా కాలం తర్వాత చైతూకి ఈ మూవీతో హిట్ పడినట్టే అని తెలుస్తుంది. సినిమాకి భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
read more: Thandel Day 1 Collections: దుమ్మురేపుతున్న `తండేల్` కలెక్షన్లు.. నాగచైతన్య కెరీర్‌లోనే హైయ్యెస్ట్ ?