శోభితతో నాగ చైతన్య ఫ్యామిలీ ప్లాన్.. కొడుకు పుడితే నాగ చైతన్య ఏం చేస్తాడో తెలుసా?
నాగచైతన్య.. నాలుగు రోజుల క్రితమే మరోసారి ఓ ఇంటివాడు అయ్యారు. అయితే శోభితతో తన ఫ్యామిలీ ప్లానింగ్ బయటపెట్టాడు చైతూ. ఏం చేయబోతున్నాడంటే ?
యువ సామ్రాట్, అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే రెండోసారి ఫ్యామిలీ జీవితంలోకి అడుగుపెట్టాడు. హీరోయిన్ శోభితా దూళిపాళని ఆయన పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బుధవారం(డిసెంబర్ 4న) అన్నపూర్ణ స్టూడియోలో చాలా అతికొద్ది మంది సెలబ్రిటీలు, బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్‌గానే మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం పెళ్లి లైఫ్‌ని, పెళ్లి తర్వాత కార్యక్రమాలను ఎంజాయ్ చేస్తున్నారు చైతూ.
ఇదిలా ఉంటే నాగచైతన్య ఫ్యామిలీ ప్లానింగ్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పిల్లలు, 50ఏళ్ల తర్వాత తన జీవితం గురించి మాట్లాడారు. తాను ఏం చేయాలనుకుంటున్నాడో తెలిపారు. ఈ క్రమంలో పిల్లలపై తనకున్న ఆసక్తిని, తాను పిల్లలు కోరుకుంటున్నాననే విషయాన్ని ఆయన చెప్పారు. శోభితతో పిలలను కనేందుకు ప్రధానంగా ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలిపారు. రానా టాక్ షోలో ఆయన ఓపెన్ అయ్యాడు చైతూ.
ఇందులో మాట్లాడుతూ, కొడుకు పుడితే ఏం చేస్తాడో చెప్పాడు చైతూ. కొడుకు పుడితే వాడిని రేస్ ట్రాక్‌కి తీసుకెళ్తా అని, కూతురు పుడితే తనకు ఎలాంటి హాబీలు ఇష్టమో వాటిని ప్రోత్సహిస్తూ, ఆమెతో కలిసి ఎంజాయ్ చేస్తా అని చెప్పాడు. తనకు 50ఏళ్లు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటున్నా అని తెలిపారు.
వెంకీ మామలా కాకుండా ఒకరిద్దరు పిల్లనే కనాలనుకుంటున్నట్టు, వాళ్లతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నట్టు చెప్పారు. మనం చిన్నప్పుడు పిల్లలుగా కొన్ని క్షణాలు ఎంజాయ్ చేశాం, ఆ క్షణాలను పిల్లలతో కలిసి మళ్లీ ఆస్వాధించాలని ఉంది అన్నారు నాగచైతన్య. ఇలా శోభితాతో తన ఫ్యామిలీ ప్లానింగ్ బయటపెట్టాడు అక్కినేని హీరో.
ఇక ప్రస్తుతం చైతూ `తండేల్` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. మత్స్యకారుల జీవితాలను ఆవిష్కరిస్తూ, అందులోని స్ట్రగుల్స్, ఓ కుర్రాడి ప్రేమని తెలియజేస్తుంది. రియల్ లైఫ్ స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీ గురించి, సాయిపల్లవి గురించి చెబుతూ, రియల్ లైఫ్ స్టోరీ అని, షూటింగ్ చేయడం చాలాకష్టంగా అనిపించిందని, సాయిపల్లవితో డాన్సులు, నటించడం అంటే టెన్షన్ గా ఉంటుందన్నారు. ఏదైనా సీన్ సరిగా రాకపోతే మానిటర్‌లో వెంటనే బాగోలేదని చెప్పేస్తుందని, ఆమెతో వర్క్ కష్టమని చెప్పేశాడు చైతూ.
నాగచైతన్య `తండేల్` సినిమాతోపాటు `విరూపాక్ష` దర్శకుడితో సినిమా చేయబోతున్నారు. నెక్ట్స్ ఇది ప్రారంభం కానుంది. దీని తర్వాత మరో ఇద్దరు దర్శకులకు కమిట్ అయ్యాడట. ఆ వివరాలు తెలియాల్సి ఉంది. కానీ `తండేల్`పై భారీ అంచనాలు పెట్టుకున్నారు చైతూ.
ఆయనకు చాలా రోజులుగా హిట్ లేదు. ఈ మూవీతో హిట్ కొట్టి బిగ్ బ్రేక్ అందుకోవాలని చూస్తున్నారు. మరి అది సాధ్యమవుతుంది. శోభితా తన జీవితంలోకి వచ్చిన తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఆయనకు కలిసి వస్తుందా అనేది చూడాలి.
read more:యాక్టింగ్ స్కూల్‌లో పరువుపోగొట్టుకున్న నాగచైతన్య, అక్కినేని ఫ్యాన్స్ తలదించుకునే సంఘటన అది
also read: 2024లో సీక్వెల్ సినిమాల హవా, పుష్ప 2, సింగం అగైన్, స్ట్రీ 2