యాక్టింగ్ స్కూల్‌లో పరువుపోగొట్టుకున్న నాగచైతన్య, అక్కినేని ఫ్యాన్స్ తలదించుకునే సంఘటన అది
నాగచైతన్య రెండు రోజుల క్రితమే మరోసారి ఓ ఇంటివాడయ్యాడు. అయితే ఆయన యాక్టింగ్ స్కూల్‌లో పరువు పోగొట్టుకున్న సంఘటన బయటపెట్టాడు చైతూ.
అక్కినేని ఫ్యామిలీలో మూడో తరం నట వారసుడు నాగచైతన్య. నాగార్జున పెద్ద కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య.. ఒక్కో సినిమాతో తనని తాన బెటర్‌మెంట్ చేసుకుంటూ, తనని తాను మంచి నటుడిగా మలుచుకుంటూ వస్తున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా తన మరింత ఫోకస్డ్ గా ఎవాల్వ్ అవుతున్నాడు.
హీరోగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటున్నా మెయిన్ స్ట్రీమ్ హీరోల జాబితాలోకి ఇంకా రాలేదు. ఇప్పుడు అలాంటి ఓ సినిమా `తండేల్`తో రాబోతున్నాడు. అయితే నాగచైతన్య కి సంబంధించిన ఓ మతిపోయే విషయం బయటకు వచ్చింది. ముంబాయి యాక్టింగ్ స్కూల్‌లో ఆయనకు ఎదురైన సంఘటన, అవమానం బయటపెట్టాడు చైతూ.
చెన్నైలో ఇంటర్ వరకు చదవుకున్న నాగచైతన్య ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాడు. యూసఫ్ గూడలోని సెయింట్ మేరీ కాలేజీలో బీకామ్‌లో జాయిన్ అయ్యాడట. రానా సలహా మేరకు ఇక్కడ జాయిన్ అయ్యారు. మధ్య మధ్యలో రానాతో కలిసి షూటింగ్‌లకు వెళ్లేవాడట. అలా సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. లైఫ్‌లో ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నాడట.
సినిమాలపై ఇంట్రెస్ట్ ని నాన్న నాగార్జునతో చెప్పాడట చైతూ, డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత పంపిస్తా అన్నాడట. కంప్లీట్ అయ్యాక సుశాంత్‌తో కలిసి ముంబయిలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అందులో ఒక ఎంబారిజింగ్ మూమెంట్ జరిగిందట. ఓ రోజు `దేవదాసు` సినిమాపై క్లాస్ జరుగుతుంది. ఆ రోజు మొత్తం దానికి డెడికేట్ చేస్తూ అనాలసిస్ జరుగుతుంది. లెక్చరర్.. చైతూ లేపి `దేవదాసు` చూశావా? అని అడిగాడట. లేదు సర్ అన్నాడట. మీ తాత చేసిన క్లాసిక్ మూవీ చూడలేదా అంటూ అందరి ముందు బాగా తిట్టి క్లాస్ నుంచి బయటకు పంపించాడట లెక్చరర్.
అంతేకాదు ఓ డీవీడీ కొనిపించి ఆ సినిమా చూసి నెక్డ్స్ డే రావాలని తెలిపారట. ఆ రోజు జరిగిన ఆ సంఘటన తనని ఎంతగానో బాధపెట్టిందని, పరువు పోయినట్టు అయ్యిందని, ఆ సినిమా తన లైఫ్‌నే మార్చేసిందని, సినిమాలపై ఉన్న ఆలోచనే మార్చిందన్నారు చైతూ. ఆ సంఘటన, ఆ సినిమా తాను ఎప్పటికీ మర్చిపోలేను అని తెలిపారు చైతూ. ప్రదీప్ మాచిరాజు కొంచెం టచ్‌లో ఉటే చెబుతా షోలో తెలిపారు చైతూ.
నాగచైతన్య `తండేల్` చిత్రంలో నటిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీ, యాక్షన్ ఎలిమెంట్‌తో తెరకెక్కిన చిత్రమిది. చందూమొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే చైతూ బుధవారం మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. హీరోయిన్ శోభితా దూళిపాళ మెడలో మూడుముళ్లు వేశారు. రెండోసారి ఆయన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు.
read more: అనుష్క శెట్టికి ఫస్ట్ లవ్ ప్రపోజల్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? స్వీటి చేసిన పనికి నోరెళ్లబెట్టాల్సిందే