Naga Chaitanya Sobhita: తమ ఉద్యోగులకు స్వయంగా భోజనాలు వడ్డించిన నాగచైతన్య, శోభిత
Naga Chaitanya Sobhita: అన్నపూర్ణ స్టూడియో ఉద్యోగులకు నాగచైతన్య, శోభిత స్వయంగా దగ్గరుండి వారికి ఆహారం వడ్డించారు. వారితో కాసేపు ఆనందంగా గడిపారు. వారి కుటుంబాలతో కలిసి సందడి చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంక్రాంతి సందడి మొదలు
అన్నపూర్ణ స్టూడియోస్ లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో వందల మంది పనిచేస్తున్నారు. అక్కడ సంక్రాంతి వేడుకలకు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల కలిసి హాజరయ్యారు. వారు ఉద్యోగులతో కలిసి పండగను నిర్వహించారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అక్కినేని కుటుంబ సభ్యులు ఉద్యోగులు ఒక్కచోటే పండుగలు నిర్వహించుకున్నారు. నాగచైతన్య, శోభిత తమ ఉద్యోగులతో కలిసిమెలిసి మాట్లాడి.. వారితో ఫోటోలు దిగారు. ఒక్కసారిగా స్టూడియో మొత్తం పండగ వాతావరణంతో నిండిపోయింది.
సంక్రాంతి స్పెషల్ వంటకాలతో విందు
అన్నపూర్ణ స్టూడియోస్ ఉద్యోగులకే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం పలికారు. అక్కడే భోజనాలు ప్రత్యేకంగా వండించారు. ఇక నాగచైతన్య శోభిత ఇద్దరు ఉద్యోగులకు భోజనాలు వడ్డించి వారి మనసులు దోచుకున్నారు. స్టార్ హోదా ఉన్నప్పటికీ ఆప్యాయంగా వారు భోజనాలను వడ్డించడం చూసి ఉద్యోగులు కూడా ఎంతో ఆనందించారు. సంక్రాంతి స్పెషల్ వంటకాలు తో సంప్రదాయ భోజనాలను ఏర్పాటు చేశారు.
ఫోటోలు వైరల్
భోజనాలు ముగిసిన తర్వాత ఉద్యోగులతో కలిసి ఫోటోలు దిగారు. నాగ చైతన్య తమ ఉద్యోగులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దాదాపు వంద మంది దాటి ఉద్యోగుల ఈ వేడుకలకు హాజరయ్యారు. ప్రతి ఏడాది ఈ వేడుకలకు అక్కినేని కుటుంబం నుంచి ఎవరో ఒకరు వచ్చే సంప్రదాయం ఉంది.
సినిమాలతో బిజీ
సమంతతో అనుబంధం తెగిపోయాక నాగచైతన్య.. శోభితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శోభిత కూడా పెళ్లి తర్వాత కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఒప్పుకున్నారు. త్వరలోనే అవి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక నాగచైతన్య వృషకర్మ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. తండేల్ సినిమాతో హిట్టు కొట్టిన నాగచైతన్య అదే జోరును వృషకర్మతో కూడా సాగించేందుకు ఎదురుచూస్తున్నారు.

