Allu Arjun: సినిమా బావుంది.. కానీ అందులో నేను బాలేను, ఎంతో బాధ పడ్డ అల్లు అర్జున్
Allu Arjun: అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. కానీ మొదట్లో గంగోత్రి సినిమాలో ఆయన లుక్ పై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ విమర్శలే ఇప్పుడు అల్లు అర్జున్ ను స్టార్ హీరోగా ఎదిగేలా చేశాయి. అదెలాగో తెలుసుకోండి.

బాధ పడిన అల్లు అర్జున్
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప ఫస్ట్ పార్ట్, పుష్ప సెకండ్ పార్ట్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అల్లు అర్జున్ ని చూస్తే ఒకప్పుడు గంగోత్రి సినిమాలో చేసింది ఇతడేనా అనిపిస్తుంది. అంత తేడాను చూపించాడు బన్నీ. అల్లు అర్జున్ చేసిన మొదటి సినిమా గంగోత్రి. అది హిట్ అయింది కానీ అందులో బన్నీ లుక్ మాత్రం ఎవరికీ నచ్చలేదు. ఇతడు హీరో ఎలా అయ్యాడు అంటూ ఎన్నో నెగటివ్ కామెంట్లు వచ్చాయి. ఇక అందులో వేసిన ఆడవేషం విపరీతంగా ట్రోల్ అయింది. డైలాగులు కూడా సరిగా చెప్పలేకపోయాడని విపరీతంగా విమర్శించారు. దీంతో బన్నీ చాలా బాధపడ్డాడు.
శపథం చేసిన అల్లు అర్జున్
గంగోత్రి సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్ళాడు బన్నీ. ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూశాడు. తన లుక్స్ గురించి థియేటర్లో ప్రేక్షకుల కామెంట్లు విన్నాడు. అవి విన్నాక చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో ఇండియాలోనే సూపర్ స్టార్ గా ఎదిగి తీరుతానని శపధం చేశాడట. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ఫ్రెండ్ అయినా నిర్మాత బన్నీ బాసు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆరోజు చేసిన శపథం ఈరోజు నెరవేర్చుకున్నాడనే అనుకోవాలి. ఇప్పుడు బన్నీ డేట్స్ కోసం ఎంతోమంది పెద్ద నిర్మాతలు ఎదురుచూస్తూ ఉంటారు.
సినిమాలో నేను బాలేను
బన్నీ వాసు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ కు సినిమాలో థియేటర్లో చూడడం అలవాటు. ఆ సమయంలో ప్రేక్షకుల స్పందనను నేరుగా చూడాలని ఆయన కోరుకుంటాడు. అందుకే ఇప్పటికీ క్యాప్ పెట్టుకుని, ముఖానికి మాస్క్ వేసుకొని థియేటర్లకు వెళ్లి సినిమా చూసొస్తుంటాడు. గంగోత్రి సినిమాకి కూడా అలానే చేశాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని తిరుమల థియేటర్‌కు అల్లు అర్జున్‌తో పాటు నేను కూడా వెళ్లాను. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆయన లుక్ గురించి నెగిటివ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా అమ్మాయి వేషంపై విపరీతంగా కామెంట్లు చేసి నవ్వుకున్నారు. అప్పుడు థియేటర్ నుంచి వచ్చాక అల్లు అర్జున్ చాలా బాధగా కనిపించాడు. సినిమా హిట్ అయింది అని తెలిసి కూడా ఆయన బాధపడ్డాడు. సినిమా బాగుంది. కానీ నేను బాలేను కదా అన్నాడు’ అని బన్నీ వాసు వివరించారు.
పుష్ప 2తో పాన్ ఇండియా స్టార్
అల్లు అర్జున్ ఇంటికి వచ్చాక ‘నేను ఏదో రోజు కచ్చితంగా మన దేశంలోనే సూపర్ స్టార్ స్థాయికి ఎదుగుతాను’అని అన్నాడు. కానీ అది నిజంగానే పాన్ ఇండియార్ స్టార్ గా మారాడు.పుష్ప 2 సినిమాతో అతడు పెద్ద హీరోలలో ఒకరిగా ఎదిగిపోయాడు. పుష్ప 2 సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లిన అల్లు అర్జున్... థియేటర్ దద్దరిల్లిపోవడం కళ్ళారా చూసి ఆనందించాడని బన్నీ వాసు చెప్పాడు. ముఖ్యంగా పుష్ప 2 అల్లు అర్జున్ లేడీ గెటప్ వేశాడు. ఈ గెటప్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఒకప్పుడు అల్లు అర్జున్ వేసిన లేడీ గెటప్ ను చూసి విమర్శించిన ఆడియన్స్.. ఇప్పుడు అదే లేడీ గెటప్ కు అభిమానులైపోయారు. థియేటర్లో నేను కూడా నిల్చుని చప్పట్లు కొట్టానని చెప్పుకొచ్చాడు బన్నీ వారు.
అల్లు అర్జున్ 2003లో గంగోత్రి సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించాడు. మొదటి సినిమా హిట్ అయినప్పటికీ మంచి పేరు రాలేదు. కానీ 2004లో ఆర్య సినిమా కూడా హిట్ కావడంతో ఆయనకి స్టైలిష్ స్టార్ గా పేరు వచ్చింది. డాన్స్ అదరగొట్టడంతో అల్లు అర్జున్ కి సినిమా అవకాశాలు వరుసగా వచ్చాయి. ఇక సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం, అల వైకుంఠపురం.. వరుస పెట్టి హిట్లు రావడంతో అల్లు అర్జున్ కు అభిమానులు ఎక్కువైపోయారు. ఇక పుష్ప సినిమా జాతీయ చలనచిత్ర అవార్డుని గెలుచుకుంది.

