MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Kalki 2: కల్కి 2 రిలీజ్‌ అయ్యేది అప్పుడే.. ఏడాదంతా ప్రభాస్‌ సినిమాల ఫెస్టివల్‌, అభిమానులకు పండగే పండగ

Kalki 2: కల్కి 2 రిలీజ్‌ అయ్యేది అప్పుడే.. ఏడాదంతా ప్రభాస్‌ సినిమాల ఫెస్టివల్‌, అభిమానులకు పండగే పండగ

ప్రభాస్‌ అభిమానులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌ చెప్పాడు నాగ్‌ అశ్విన్‌. ఒకే ఏడాది మూడు సినిమాలతో అభిమానులను అలరించబోతున్నారు డార్లింగ్‌. వచ్చేదంతా ప్రభాస్‌ సినిమాల ఫెస్టివల్‌ అని చెప్పొచ్చు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 08 2026, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫౌజీ, స్పిరిట్‌తో ప్రభాస్‌ బిజీ
Image Credit : Asianet News

ఫౌజీ, స్పిరిట్‌తో ప్రభాస్‌ బిజీ

ప్రభాస్‌ ఈ ఏడాది సంక్రాంతికి `ది రాజాసాబ్‌`తో వచ్చారు. ఈ మూవీ ఆడియెన్స్ ని డిజప్పాయింట్‌ చేసింది. ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్నారు. `ఫౌజీ`, `స్పిరిట్‌` చిత్రాలు షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ`, సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` రెండూ సమాంతరంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కల్కి 2 అప్‌ డేట్‌, జులైలో ప్రభాస్‌ ఎంట్రీ
Image Credit : X/@VyjayanthiFilms

కల్కి 2 అప్‌ డేట్‌, జులైలో ప్రభాస్‌ ఎంట్రీ

ఇప్పుడు కల్కి 2 అప్‌ డేట్‌ వచ్చింది. `కల్కి 2898 ఏడీ` వచ్చి రెండేళ్లు అయిపోయింది. ఇప్పుడు రెండో పార్ట్ కి సంబంధించిన అప్‌ డేట్‌ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్‌. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌లకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో ప్రభాస్‌కి సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు నాగ్‌ అశ్విన్‌. జులైలో ప్రభాస్‌ ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటాడట. అమితాబ్‌, కమల్‌, ప్రభాస్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం.

34
కల్కి 2 రిలీజ్‌ డేట్‌ చెప్పిన నాగ్‌ అశ్విన్‌
Image Credit : our own

కల్కి 2 రిలీజ్‌ డేట్‌ చెప్పిన నాగ్‌ అశ్విన్‌

అదే సమయంలో ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ కూడా చెప్పాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. వచ్చే ఏడాదిలోనే ఈ మూవీ రిలీజ్‌ ఉంటుందట. 2027 డిసెంబర్‌లో ప్లాన్‌ చేస్తున్నట్టు చెప్పాడు. డిసెంబర్‌ మొదటి వారంలోగానీ, లేదంటే క్రిస్మస్‌ స్పెషల్‌గానీ రిలీజ్‌ చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్‌లో ఓ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుందట, హాట్‌ స్టూడియోలో చిత్రీకరిస్తున్నామని హీరో కమల్‌ హాసన్‌ తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా `సింగ్‌ గీతం` మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో కమల్‌.. `యాస్కిన్‌` అనే పాత్రలో నెగటివ్‌ రోల్‌లో నటిస్తున్నారు. మొదటి పార్ట్ లో గెస్ట్ గా మెరిసిన ఆయన ఇప్పుడు పార్ట్2లో మాత్రం విశ్వరూపం చూపించబోతున్నారట. 

44
వచ్చే ఏడాది ప్రభాస్‌ సినిమాల పండగ
Image Credit : our own

వచ్చే ఏడాది ప్రభాస్‌ సినిమాల పండగ

`కల్కి 2` వచ్చే ఏడాది డిసెంబర్‌లో వస్తే.. ప్రభాస్‌ నుంచి ఒకే ఏడాది మూడు సినిమాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే `ఫౌజీ` ఈ ఏడాది చివర్లో.. అంటే డిసెంబర్‌లోనే విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ షూటింగ్‌ అవుతున్న తీరు చూస్తుంటే, అది డిసెంబర్‌లో రావడం కష్టమే అని చెప్పొచ్చు. ఒకవేళ అదే జరిగితే, 2027 మిడ్‌లో వస్తుందని చెప్పొచ్చు. ఇక స్పిరిట్‌ మూవీని మార్చి 5న రిలీజ్‌ చేయనున్నట్టు సందీప్‌ రెడ్డి వంగా ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇప్పుడు `కల్కి 2` కూడా అదే ఏడాది ఎండింగ్‌లో రాబోతుంది. ఏడాది గ్యాప్‌తో మూడు సినిమాలతో అభిమానులను అలరించబోతున్నారు ప్రభాస్. ఇక వచ్చేదంతా ప్రభాస్‌ సినిమాల పండగే అని చెప్పొచ్చు.  

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
నాగ్ అశ్విన్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Ramesh Babu: రమేష్‌బాబు సూపర్‌ స్టార్‌ అయ్యే ఛాన్స్ మిస్‌.. మహేష్‌ చేతుల మీదుగా ప్రారంభమై ఆగిపోయిన మూవీ ఏంటంటే?
Recommended image2
Peddi 4 Days Collections: పెద్ది 4 రోజుల్లో రాబట్టింది ఇంతే, ఆదివారం ర్యాంపేజ్‌.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved