- Home
- Entertainment
- CM Vijay Back To Acting: మళ్లీ కెమెరా ముందుకు సీఎం విజయ్... డైరెక్టర్ ఎవరో తెలుసా?
CM Vijay Back To Acting: మళ్లీ కెమెరా ముందుకు సీఎం విజయ్... డైరెక్టర్ ఎవరో తెలుసా?
CM Vijay Back To Acting: తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పిన విజయ్, ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ఆయన కెమెరా ముందుకు రాబోతున్నారు. ఆ వివరాలు చూద్దాం.
కెమెరా ముందుకు సీఎం విజయ్
సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందిన విజయ్, తన కెరీర్లో 69 సినిమాలు చేసి ఫ్యాన్స్ గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. సినిమాల్లో వచ్చిన క్రేజ్‌తో ప్రజలకు నేరుగా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నికల్లో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, ఇప్పుడు ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు.
సినిమాలకు గుడ్ బై చెప్పిన విజయ్
రాజకీయాల్లో ఫుల్ టైమ్ బిజీ అవ్వడం కోసం ఇక సినిమాల్లో నటించనని విజయ్ చెప్పడం ఫ్యాన్స్‌ను బాగా నిరాశపరిచింది. తమ ఫేవరెట్ హీరోను ఇక స్క్రీన్ మీద చూడలేమా అని వాళ్లు బాధపడ్డారు. అయితే, ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్‌కు ఒక కిక్ ఇచ్చే న్యూస్ బయటకొచ్చింది. ఆయన మళ్లీ నటించబోతున్నారు. కానీ ఈసారి సినిమాలో కాదు, ఒక ప్రభుత్వ యాడ్‌లో.
మళ్లీ ఎందుకు నటిస్తున్నారు?
తమిళనాడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యమైన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక అవేర్నెస్ యాడ్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా నటించబోతున్నారని సమాచారం. ఈ యాడ్‌ను డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేయనున్నారట. సీఎం అయ్యాక ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంపై విజయ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.
విజయ్ను డైరెక్ట్ చేయనున్న గౌతమ్
ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పేందుకు ఈ కొత్త యాడ్ ఫిల్మ్ రెడీ చేస్తున్నారు. ఇందులో సీఎం విజయ్ నటించనుండటం అటు పాలిటిక్స్‌లో, ఇటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. తన మార్క్ టేకింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ యాడ్‌ను డైరెక్ట్ చేయనున్నారు. సీఎం బిజీ షెడ్యూల్ మధ్యలో ఈ యాడ్ కోసం విజయ్ రెండు రోజులు కేటాయించారట.
భారీ అంచనాల్లో ఫ్యాన్స్
ప్రభుత్వ పథకాలు, ఉచిత సాయం, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ప్రజలకు క్లియర్‌గా తెలిసేలా ఈ యాడ్ ఉండబోతోంది. చెన్నై, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో త్వరలోనే ఈ యాడ్ షూటింగ్ జరగనుంది. గతంలో సీఎం విజయ్, డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబోలో 'యోహాన్' అనే సినిమా రావాల్సి ఉండి ఆగిపోయింది. ఆ తర్వాత వాళ్లు కలిసి పనిచేయలేదు. ఇప్పుడు ఈ యాడ్ ద్వారా ఇద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.





