MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Ramesh Babu: రమేష్‌బాబు సూపర్‌ స్టార్‌ అయ్యే ఛాన్స్ మిస్‌.. మహేష్‌ చేతుల మీదుగా ప్రారంభమై ఆగిపోయిన మూవీ ఏంటంటే?

Ramesh Babu: రమేష్‌బాబు సూపర్‌ స్టార్‌ అయ్యే ఛాన్స్ మిస్‌.. మహేష్‌ చేతుల మీదుగా ప్రారంభమై ఆగిపోయిన మూవీ ఏంటంటే?

Ramesh Babu: మహేష్‌ బాబు అన్నయ్య, కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా సక్సెస్‌ కాలేదు. కానీ ఒక్క మూవీ చేస్తే ఆయన సూపర్‌ స్టార్‌ అయ్యేవాడు. మరి ప్రారంభమై ఆగిపోయిన సినిమా ఏంటంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 06 2026, 06:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హీరోగా సక్సెస్‌ కాలేకపోయిన రమేష్‌ బాబు
Image Credit : times of india

హీరోగా సక్సెస్‌ కాలేకపోయిన రమేష్‌ బాబు

సూపర్‌ స్టార్‌ కృష్ణకి ఇద్దరు కుమారులు అనే విషయం తెలిసిందే. పెద్ద కొడుకు రమేష్‌ బాబు సినిమాల్లో సక్సెస్‌ కాలేకపోయారు. ఆయన హీరోగా సక్సెస్‌ కాలేదు. నిర్మాతగానూ సక్సెస్‌ కాలేదు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లి అనారోగ్యానికి గురయ్యారు. కొన్నాళ్లపాటు అనారోగ్య సమస్యలతో బాధపడి కన్నుమూశారు. నాలుగేళ్ల క్రితమే ఆయన మరణించారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సక్సెస్‌ లేకపోవడంతో సినిమాలకు రమేష్‌ బాబు గుడ్‌ బై
Image Credit : the indian express

సక్సెస్‌ లేకపోవడంతో సినిమాలకు రమేష్‌ బాబు గుడ్‌ బై

అయితే రమేష్‌ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాస మంగాపురం అనే చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్‌ వచ్చి ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే రమేష్‌ బాబు బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పలు చిత్రాలు చేసి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగానూ సినిమాలు చేశాడు. `సామ్రాట్‌` చిత్రంతో హీరోగా మారాడు. కానీ ఆశించిన స్థాయిలో ఈ మూవీ ఆడలేదు. ఆ తర్వాత `చిన్నికృష్ణుడు` చేసినా ప్రయోజనం లేదు. `బజార్‌ రౌడీ` అనే మూవీతో డీసెంట్‌ హిట్‌ని అందుకున్నాడు. `కళియుగ కర్ణుడు`, `ముగ్గురు కొడుకులు` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు. హీరోగా పదికిపైగానే సినిమాలు చేశాడు. కానీ అవి రమేష్‌ బాబుకి బ్రేక్‌ ఇవ్వలేకపోయాయి. హీరోగా నిలబెట్టలేకపోయాయి.

35
హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నం
Image Credit : our own

హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నం

దీంతో సినిమాలు మానేశాడు. 1997లో చివరగా ఆయన `ఎన్‌కౌంటర్‌` చిత్రంలో మెరిశారు. ఆ తర్వాత నటనకు ఫుల్‌ స్టాప్‌ పెట్టి నిర్మాతగా మారాడు. `సూర్యవంశం`, `అర్జున్‌`, `అతిథి`, `దూకుడు`, `ఆగడు` వంటి చిత్రాలను నిర్మించాడు. `అర్జున్‌`, `దూకుడు` పెద్ద హిట్‌ అయ్యాయి. `ఆగడు`తో నష్టపోవాల్సి వచ్చింది. దీంతో నిర్మాణానికి కూడా గుడ్‌ బై చెప్పాడు. అయితే రమేష్‌ బాబు హీరోగా నిలబడటానికి, ఆయన్ని సూపర్‌ స్టార్‌ని చేసే మంచి కంటెంట్‌ ఒకటి ప్లాన్‌ చేశారు. మహేష్‌ బాబు చేతుల మీదుగా ఓపెనింగ్‌ కూడా చేశారు. కానీ సినిమా ఆగిపోయింది. రమేష్‌ బాబు కెరీర్‌ కూడా ఆగిపోయింది.

45
ఆగిపోయిన రమేష్‌ బాబు సినిమా
Image Credit : Asianet News

ఆగిపోయిన రమేష్‌ బాబు సినిమా

రమేష్‌ బాబు కెరీర్‌ని దెబ్బకొట్టిన మూవీ ఏంటనేది చూస్తే, అది `భూలోక వీరుడు జగదేక సుందరి`. ఇందులో రమేష్‌ బాబు హీరోగా, ఇంద్రజ హీరోయిన్‌. వీరిద్దరిపై సినిమా ఓపెనింగ్‌ జరిగింది. వారి పాత్రల గెటప్‌లోనే ఓపెనింగ్‌ ని చేశారు. మహేష్‌ బాబు క్లాప్‌ కొట్టారు.  బాబా మూవీ చిత్ర బ్యానర్ పై ఈ మూవీ స్టార్ట్ అయ్యింది. 1999 జూన్‌ 24న ఈ మూవీ స్టార్ట్ అయ్యింది. దీనికి జానపద బ్రహ్మ విఠలాచార్య తనయుడు శ్రీనివాస్‌ దర్శకుడు. ఫోక్‌, ఫాంటసీ బ్యాక్‌ డ్రాప్‌, భారీ సెట్స్, జానపద అంశాలతో సినిమా తెరకెక్కించాలని ప్లాన్‌ చేశారు. కొన్ని రోజులు షూటింగ్‌ కూడా జరిగింది. కానీ అనుకోకుండా ఆపేశారు. కారణం ఏంటోగానీ ఈ సినిమా విడుదలై ఉంటే రమేష్‌ బాబు పెద్ద స్టార్‌ అయిపోయేవాడు, ఆయన కెరీర్‌ మారిపోయేది, సూపర్‌ స్టార్‌గా ఎదిగేవారు అని అంటుంటారు. కానీ అంతా తలక్రిందులయ్యాయి. ఈ దెబ్బతో ఆయన ఇక సినిమాలు చేయడమే మానేశారు.

55
సూపర్‌ స్టార్‌ అయిన తమ్ముడు మహేష్‌
Image Credit : urstrulymahesh/Instagram

సూపర్‌ స్టార్‌ అయిన తమ్ముడు మహేష్‌

అన్న స్టార్‌ కాలేకపోయారు. కానీ తమ్ముడు మహేష్‌ బాబు చేసి నిరూపించారు. ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చి నిలబడ్డాడు. `మురారి`తో హిట్‌ అందుకున్నాడు. `ఒక్కడు`తో బ్రేక్‌ అందుకున్నాడు. `పోకిరి`తో సూపర్‌ స్టార్‌ అయిపోయాడు. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `దూకుడు`, `శ్రీమంతుడు`, `భరత్ అనే నేను`, `మహర్షి` వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు. ఇది అంతర్జాతీయ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ మూవీతో మహేష్‌ రేంజ్‌ మారబోతుందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
కృష్ణ ఘట్టమనేని
మహేష్ బాబు ఘట్టమనేని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image2
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Recommended image3
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Related Stories
Recommended image1
Pushpa vs Peddi: పుష్ప, పెద్దికి మధ్య ఉన్న పోలికలివే.. ఆ విషయంలో రెండూ ఒక్కటే, కానీ తేడా ఏంటంటే?
Recommended image2
Anasuya Bharadwaj: అనసూయ పోస్ట్ దుమారం, అసలు రంగు బయటపడింది.. అర్జున్‌ రెడ్డి టైమ్‌లో ఈ నీతులు ఏమయ్యాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved