MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Trisha Krishnan: ఇక నా టైమ్‌ స్టార్ట్ అయ్యింది, తమిళనాట విజయ్‌ సంచలనం వేళ త్రిష పోస్ట్ దుమారం

Trisha Krishnan: ఇక నా టైమ్‌ స్టార్ట్ అయ్యింది, తమిళనాట విజయ్‌ సంచలనం వేళ త్రిష పోస్ట్ దుమారం

విజయ్‌ తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో భారీ స్థాయిలో విజయం సాధించారు. అత్యధిక సీట్లు సాధించారు. ఈ క్రమంలో త్రిష పెట్టిన పోస్ట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆమె ముందే హింట్‌ ఇచ్చిందా అనేది చర్చనీయాంశం అవుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 05 2026, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తమిళనాడు రాజకీయాల్లో త్రిష హాట్ టాపిక్‌
Image Credit : instagram/@trishakrishnan

తమిళనాడు రాజకీయాల్లో త్రిష హాట్ టాపిక్‌

హీరోయిన్‌ త్రిష ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారుతుంది. ఆమె దళపతి విజయ్‌కి క్లోజ్‌గా ఉండటమే దీనికి కారణం. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు కలిసి దాదాపు ఐదు సినిమాల్లో నటించారు. దీంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని సమాచారం. విజయ్‌తో త్రిష దిగిన కొన్ని ఫోటోలే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. దీనికితోడు ఆమె విజయ్‌పై ప్రేమని పరోక్షంగా వెల్లడిస్తూనే ఉంది. హింట్‌ ఇస్తూనే ఉంది. దీంతో ఇప్పుడు తమిళనాడులో విజయ్‌ ఊహించని విధంగా అత్యధిక సీట్లు సాధించడంతో త్రిషకి లింక్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో అనేక పోస్ట్‌ లు వైరల్‌ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విజయ్‌ విజయం.. త్రిష పోస్ట్ దుమారం
Image Credit : x

విజయ్‌ విజయం.. త్రిష పోస్ట్ దుమారం

ఈ విజయం వెనుక త్రిష ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు త్రిష పెట్టిన పోస్ట్ సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ఇక తన టైమ్‌ స్టార్ట్ అయ్యిందని ఆమె ఇన్‌ స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. మూడు రోజుల క్రితమే ఆమె ఈ పోస్ట్ ని పంచుకుంది. ఇందులో బ్యాక్‌ సైడ్‌ నుంచి దిగిన ఫోటోని షేర్‌ చేసుకుంది. `ఇక నా సీజన్‌ అధికారికంగా స్టార్ట్ అయ్యింది` అని త్రిష వెల్లడించింది. బ్యాక్‌ లెస్‌ గౌన్‌, బ్లూ జీన్స్ ధరించింది. బ్లాక్‌ హ్యాండ్‌ బ్యాగ్‌ వేసుకుంది. సైడ్‌లో స్టయిల్‌గా చూస్తోంది త్రిష.

34
ఇక నా సీజన్‌ స్టార్ట్ - త్రిఫ
Image Credit : trisha krishnan instagram

ఇక నా సీజన్‌ స్టార్ట్ - త్రిఫ

ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట దుమారం రేపుతుంది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ ఏకంగా 108 సీట్లు గెలుపొందింది. తమిళనాట లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అన్నీ కుదిరితే విజయ్‌ అధికారం దక్కించుకోబోతున్నారు. సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు. పార్టీ స్థాపించి, ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే సీఎం అయిన సినిమా స్టార్ గా విజయ్‌ చరిత్ర సృష్టించబోతున్నాడని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ కి ఈ ఘనత సాధ్యమైంది. ఆ తర్వాత నలభై ఏళ్ల తర్వాత విజయ్‌ దాన్ని సాధించారు. ఈ క్రమంలో విజయ్‌ విజయాన్ని త్రిష ముందే చెప్పిందా, తన పోస్ట్ ద్వారా హింట్‌ ఇచ్చిందనే ప్రచారం జరుగుతుంది. నెటిజన్లు త్రిష పోస్ట్ ని వైరల్‌ చేస్తున్నారు. విజయ్‌ గెలుపుకి ముడిపెడుతూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.

44
త్రిష మరో జయలలిత అవుతుందా?
Image Credit : instagram /@trishakrishnan

త్రిష మరో జయలలిత అవుతుందా?

త్రిష తమిళ రాజకీయాల్లో కీలకంగా మారబోతుందా? ఇన్నాళ్లు తెరవెనుక ఉన్న త్రిష.. ఇప్పుడు తెరముందుకు రాబోతుందా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాదు విజయ్‌, త్రిష మరో ఎంజీఆర్‌, జయలలిత అవుతారని అంటున్నారు. అప్పట్లో ఎంజీఆర్‌ సీఎంగా ఉన్నారు. జయలలిత ఆయన వద్ద సహాయకురాలిగా ఉంది. తెరవెనుక చక్రం తిప్పింది. ఆయన చనిపోయిన తర్వాత ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యింది. తమిళనాడుని శాసించింది. ఇప్పుడు త్రిష కూడా అదే చేయబోతుందా, విజయ్‌ మరో ఎంజీఆర్‌ అయితే, త్రిష మరో జయలలిత అవుతుందా అనే చర్చ గట్టిగా నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
త్రిష
టీవీకే విజయ్
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image2
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Related Stories
Recommended image1
Samantha favorite Hero: సమంతకి ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? ఆయనంటే పడిచచ్చేది, సర్‌ప్రైజ్‌ ఏంటంటే?
Recommended image2
TVK Vijay: పెళ్లిలో విజయ్‌కి దారుణమైన అవమానం, దళపతికి రాజకీయ బీజం.. స్టాలిన్‌ కొంపముంచింది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved