MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు

Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు

బండ్ల గణేష్‌ ఇటీవల షాద్‌ నగర్‌లో కొత్త ఇంటిని నిర్మించారు. అందులోనే ఉంటున్నారు. అయితే దాని ఖరీదు లీక్‌ అయ్యింది. రాజా రవీంద్ర ఆ విషయాన్ని లీక్‌ చేశారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 25 2026, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నిర్మాతగా కమ్‌ బ్యాక్‌ ఇవ్వబోతున్న బండ్ల గణేష్‌
Image Credit : youtube/@RajaRaveendarTalks

నిర్మాతగా కమ్‌ బ్యాక్‌ ఇవ్వబోతున్న బండ్ల గణేష్‌

ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, నటుడు బండ్ల గణేష్‌ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే మళ్లీ ఆయన కమ్‌ బ్యాక్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. నిర్మాతగా సినిమాలు చేసే పనిలో ఉన్నారు. కాకపోతే ఈ సారి చిన్నవాళ్లతో, తక్కువ బడ్జెట్‌లో ప్లాన్‌ చేస్తున్నట్టు గతంలో తెలిపారు. తనదైన స్పీచ్‌లతో దుమారం రేపే బండ్ల గణేష్‌ కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇటీవల వార్తల్లో నిలిచారు. కాలినడకన తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అదే సమయంలో మెగా 158 మూవీ ఓపెనింగ్‌లో పవన్‌, చిరంజీవిలను కలవడం చర్చనీయాంశంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
షాద్‌ నగర్‌లో కొత్తిళ్లు కట్టుకున్న బండ్ల గణేష్‌
Image Credit : Asianet News

షాద్‌ నగర్‌లో కొత్తిళ్లు కట్టుకున్న బండ్ల గణేష్‌

ఈ క్రమంలో బండ్లగణేష్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన గతేడాది కొత్తింట్లోకి వెళ్లారు. గృహ ప్రవేశానికి చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. చిరంజీవి, వెంకటేష్‌, యంగ్‌ హీరోలు, నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. చాలా గ్రాండ్‌గా ఈ గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. చిరంజీవి ఇందులో పాల్గొనడం. ఆయనకు బ్యాక్‌ పెయిన్‌ ఉన్నా కూడా, బండ్ల గణేష్‌ పిలుపు మేరకు వెళ్లారు. ఆయన్ని హ్యాపీ చేశారు. చిరంజీవికి కూడా అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చారు గణేష్‌. ఆయన కోసం ప్రత్యేకంగా చైర్‌ తయారుచేయించారు. ఇండస్ట్రీకి ఆయనే బాస్‌, పెద్ద దిక్కు అనేలా ఆయన కుర్చీని తయారు చేయించడం, అందులో ఆయన్నే కూర్చోబెట్టడం విశేషం.

Related Articles

Related image1
Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Related image2
Kalyan Padala: తనూజతో రిలేషన్‌పై ఓపెన్‌ అయిన కళ్యాణ్‌ పడాల.. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుందా?
34
బండ్ల గణేష్ ఇంటి విలువ వంద కోట్లు
Image Credit : youtube/@RajaRaveendarTalks

బండ్ల గణేష్ ఇంటి విలువ వంద కోట్లు

అయితే ఇంటికి సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. నటుడు రాజా రవీంద్ర ఆ విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఆయన బండ్లగణేష్‌ని ఇంటర్వ్యూ చేశారు. తన పాడ్‌ కాస్ట్ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్‌ ఇంటిప్రస్తావన రాగా, షాద్‌ నగర్‌లో నిర్మించిన తన ఇంటి గురించి షాకింగ్‌ విషయం వెల్లడించారు. దాని విలువ వంద కోట్లు ఉంటుందట. మీ వంద కోట్ల ఇంటికి చిరంజీవి గారు వచ్చారు. బ్యాక్‌ పెయిన్‌తోనూ మీపై ప్రేమతో వచ్చారని తెలిపారు. నువ్వు తక్కువోడివి కాదు అని బండ్ల గణేష్‌ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌ ఇంటి ఖరీదుని లీక్‌ చేశారు రాజా రవీంద్ర. వంద కోట్లతో ఆయన ఈ ఇంటిని నిర్మించడం విశేషం.

44
చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదేమో
Image Credit : Asianet News

చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదేమో

అయితే ఇంతటి ఖరీదైన ఇళ్లు మరే హీరోకి లేదని చెప్పొచ్చు. ఈవెన్‌ ఇండస్ట్రీ పెద్ద, మెగాస్టార్‌ అయిన చిరంజీవి ఇంటి ఖరీదు కూడా అందులో సగం కూడా ఉండదు. జూబ్లీ హిల్స్ లో ఉండే చిరంజీవి ఇంటి ఖరీదు సుమారు రూ.40కోట్లు ఉంటుందని సమాచారం. మొత్తంగా బండ్ల గణేష్‌ బిగ్‌ షాట్‌ అని చెప్పొచ్చు. ఆయనకు సినిమాలే కాదు, దాన్ని మించిన చాలా వ్యాపారాలున్నాయి. అందులో ఒకటి కోళ్ల ఫామ్‌లు అని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sharvari Wagh: ఈ హీరోయిన్ మాజీ సీఎం మనవరాలా ? త్వరలో స్పై యాక్షన్ మూవీతో రంగంలోకి..
Recommended image2
Ram Charan: పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్
Recommended image3
Sreemukhi: అడుక్కున్నారు, అయినా ఆ షోని రిజెక్ట్ చేశా.. హీరోయిన్ గా కూడా ఛాన్స్ పోయింది
Related Stories
Recommended image1
Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Recommended image2
Kalyan Padala: తనూజతో రిలేషన్‌పై ఓపెన్‌ అయిన కళ్యాణ్‌ పడాల.. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved