MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Samantha favorite Hero: సమంతకి ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? ఆయనంటే పడిచచ్చేది, సర్‌ప్రైజ్‌ ఏంటంటే?

Samantha favorite Hero: సమంతకి ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? ఆయనంటే పడిచచ్చేది, సర్‌ప్రైజ్‌ ఏంటంటే?

స్టార్‌ హీరోయిన్‌ సమంతకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయన్ని చూసే సినిమాల్లోకి వచ్చిందట. ఆయనంటే పడిచచ్చేదట. అలాంటిది ఆయనతోనే సినిమాలు చేయడం జీవితంలో మర్చిపోలేనని తెలిపింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 05 2026, 07:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మా ఇంటి బంగారంతో సమంత కమ్‌ బ్యాక్‌
Image Credit : our own

మా ఇంటి బంగారంతో సమంత కమ్‌ బ్యాక్‌

సమంత ఇప్పుడు టాలీవుడ్‌లో లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న నటి. ఒకప్పుడు గ్లామర్‌ హీరోయిన్‌గా మెప్పించిన ఆమె ఇప్పుడు కథాబలం ఉన్న సినిమాలతో ఆకట్టుకుంటుంది.  ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. అయితే తన అనారోగ్యం కారణంగా కొంత గ్యాప్‌ తీసుకున్న సమంత ఇప్పుడు `మా ఇంటి బంగారం` సినిమాతో కామ్‌ బ్యాక్‌ ఇచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది. త్వరలో ఇది రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో సమంతకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సమంతకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?
Image Credit : instagram/samantha

సమంతకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?

సమంత టాలీవుడ్‌, కోలీవుడ్‌లో చాలా మంది బిగ్‌ స్టార్స్ తో నటించింది. ఇక్కడ పవన్‌ కళ్యాణ్‌ నుంచి, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, నాగచైతన్య, విజయ్‌ దేవరకొండ, నాని, శర్వానంద్‌లతోనూ నటించింది. అటు కోలీవుడ్‌ విజయ్‌, సూర్య, విక్రమ్‌, ధనుష్‌, విశాల్‌, శివకార్తికేయన్‌, సిద్ధార్థ్‌, విజయ్‌ సేతుపతి వంటి స్టార్స్ తోనూ రొమాన్స్ చేసింది. తమిళంలో ఆమె ఎక్కువగా   విజయ్‌తో కలిసి నటించింది. అయితే సమంతకి ఇష్టమైన నటుడు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆమె గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూలో తన అభిప్రాయం వెల్లడించింది. తాను కాలేజీలో ఉన్నప్పుడు ఎవరిని ఇష్టపడిందో తెలిపింది.

Related Articles

Related image1
Vijay Trisha Movies: విజయ్‌, త్రిష కలిస్తే బాక్సాఫీసుకి పూనకాలే.. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలివే
Related image2
TVK Vijay: చిరంజీవి, పవన్‌కి సాధ్యం కానిది విజయ్‌కి ఎలా సాధ్యం.. దళపతి సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే
35
సూర్య అంటే సమంతకి పిచ్చి
Image Credit : youtube/vijaytelevision

సూర్య అంటే సమంతకి పిచ్చి

సమంత చదువుకునే సమయంలోనే కోలీవుడ్‌ స్టార్‌ సూర్య అంటే ఇష్టమట. ఆయన తన ఫేవరేట్‌ హీరో అని చెప్పింది సామ్‌. ఆయనంటే పడిచచ్చేదట. అలాంటిది తాను సినిమాల్లోకి వచ్చాక ఆయనతో కలిసి నటించడం జీవితంలో మర్చిపోలేని సంఘటన అని తెలిపింది. తాను సాధించిన ఘనతల్లో అదొకటని వెల్లడించింది సమంత. ఈనాడుకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది. సూర్యతో సమంత `24`, `అంజాన్‌` వంటి చిత్రాల్లో కలిసి నటించింది. ఇందులో 24 మూవీ క్రిటికల్‌గా ప్రశంసలందుకుంది.

45
మహేష్‌ లుక్స్ అంటే ఇష్టం
Image Credit : Mahesh Babu\Instagram

మహేష్‌ లుక్స్ అంటే ఇష్టం

ఇక తెలుగులో మహేష్‌ బాబు ఫేవరేట్‌ అని చెప్పింది. ఆయన హ్యాండ్సమ్ లుక్, స్టైల్ తనకు చాలా ఇష్టమని, `దూకుడు` సినిమాలో మహేశ్ బాబుతో కలిసి నటించడంతో తన కెరీర్‌లో గొప్ప అనుభవమని వెల్లడించింది. వీరిద్దరు కలిసి `దూకుడు`, `సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు`, `బ్రహ్మోత్సవం` వంటి చిత్రాల్లో నటించారు. `బ్రహ్మోత్సవం` తప్ప రెండు చిత్రాలు భారీ విజయాలు సాధించాయి.

55
రాజ్‌ నిడిమోరుని రెండో పెళ్లి చేసుకున్న సమంత
Image Credit : our own

రాజ్‌ నిడిమోరుని రెండో పెళ్లి చేసుకున్న సమంత

సమంత.. నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నాలుగేళ్లకి విడిపోయారు. ఇటీవల మళ్లీ రెండో పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్‌ నిడిమోరుని ఆమె ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక త్వరలో ఆమె కమ్‌ బ్యాక్‌ ఇవ్వబోతున్న `మా ఇంటి బంగారం` చిత్రంలో సమంత యాక్షన్‌ చేయబోతుంది. దీనికి సంబంధించిన టీజర్‌ ఆకట్టుకుంది. దీనికి నందినిరెడ్డి దర్శకత్వం వహించగా, రాజ్‌ నిడిమోరు నిర్మాత కావడం విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
శంకరమంచి జానకి, షావుకారు జాన‌కి ఎలా అయ్యారు.? ఆమె జీవితంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Recommended image2
Sowcar Janaki Net Worth: షావుకారు జానకి ఆస్తులు తెలిస్తే మైండ్‌ బ్లాక్‌, వేల కోట్లు.. ఒక్క ఇళ్లే 200 కోట్లకుపైగా
Recommended image3
Madhuri Rathod: నిమ్మతోట వనములో సాంగ్ తో దుమ్మురేపిన మాధురి రాథోడ్.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Vijay Trisha Movies: విజయ్‌, త్రిష కలిస్తే బాక్సాఫీసుకి పూనకాలే.. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలివే
Recommended image2
TVK Vijay: చిరంజీవి, పవన్‌కి సాధ్యం కానిది విజయ్‌కి ఎలా సాధ్యం.. దళపతి సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved