వేసవిలోనూ అందంగా మెరిసిపోవాలంటే ఈ ఫేస్ మాస్క్ లు తప్పనిసరి!
వేసవికాలంలో ఏర్పడే చర్మ సమస్యలన్నింటిని (Skin problems) తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారా! అధిక మొత్తంలో డబ్బు ఖర్చవుతోందా!

అయినా తగిన ఫలితం లభించడం లేదా! అయితే మీ చర్మ సమస్యలన్నింటినీ తగ్గించుకోవడానికి ఇంటిలోనే కొన్ని ఫేస్ ప్యాక్స్ (Face packs) లను ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. వాటి తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వేసవికాలంలో అధిక ఎండ తీవ్రత కారణంగా మొటిమలు, మచ్చలు, చర్మం నల్లబడడం, మెరుపును కోల్పోవడం జరుగుతుంది. అలాగే వేడికి చెమటలు కారడంతో చర్మంపై అనేక అలర్జీలు (Allergies) ఏర్పడతాయి. వీటికోసం బయట మార్కెట్లో ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty Products) ను ప్రయత్నిస్తే చర్మం సహజ సిద్ధమైన సౌందర్యాన్ని కోల్పోతుంది. ఈ ప్రొడక్ట్స్ లో ఉండే కెమికల్స్ చర్మానికి హాని కలిగిస్తాయి.
కనుక ఈ చర్మ సమస్యలన్నింటినీ తగ్గించుకోవడానికి ఇంటిలోనే అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో (Ingredients) చేసుకునే ఫేస్ ప్యాక్స్ చర్మ నిగారింపును పెంచేందుకు సహాయపడుతాయి. ఈ ఫేస్ ప్యాక్స్ తయారీ కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు వృధా చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ ఫేస్ ప్యాక్స్ కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) ఉండవని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
బియ్యప్పిండి, తేనె, పాలు: ఒక కప్పులో రెండు స్పూన్ ల బియ్యప్పిండి (Rice flour), ఒక స్పూన్ తేనె (Honey), కొన్ని పాలను (Milk) తీసుకుని బాగా కలుపుకోని ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత కొద్ది కొద్దిగా తడి చేసుకుంటూ ముఖాన్ని సున్నితంగా రుద్దుకుంటూ శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంలో పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి ఎండ వేడి కారణంగా నల్లబడిన చర్మం తిరిగి కాంతివంతంగా మారుతుంది.
గ్రీన్ టీ, పాలు, కోకో పౌడర్: ఒక కప్పులో రెండు స్పూన్ ల కాచి చల్లార్చిన గ్రీన్ టీ (Green tea), ఒక టేబుల్ స్పూన్ పాలు (Milk), ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ (Cocoa powder) ను తీసుకుని బాగా కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మానికి తగిన పోషణను అందించి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.
గులాబీ రేకుల పొడి, తేనె, పసుపు, రోజ్ వాటర్, గంధం: ఒక కప్పులో ఒక స్పూన్ గులాబీ రేకుల పొడి (Rose petals powder), ఒక స్పూన్ గంధం (Sandalwood), ఒక స్పూన్ రోజ్ వాటర్ (Rose water), పావు స్పూన్ తేనె (Honey), కొద్దిగా పసుపు (Turmeric) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా, తాజాగా ఉంటుంది.