MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krishna Mukunda Murari: నిజం తెలిసేలా చేసి అందరి నోర్లు మూయించిన కృష్ణ.. పశ్చాతాపంతో కుమిలిపోతున్న మురారి!

Krishna Mukunda Murari: నిజం తెలిసేలా చేసి అందరి నోర్లు మూయించిన కృష్ణ.. పశ్చాతాపంతో కుమిలిపోతున్న మురారి!

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ తో ముందుకి సాగుతూ మంచి రేటింగ్ ని సంపాదిస్తుంది. ఉమ్మడి కుటుంబంలో ఉండే వివిధ రకాల వ్యక్తులు, వివిధ రకాల పరిస్థితుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

4 Min read
Author : Navya G
Published : Mar 30 2023, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఎపిసోడ్ ప్రారంభంలో నందిని విషయంలో నేను కావాలనే తప్పు చేశానని నన్ను బ్లెయిమ్ చేయటంలో బాగానే సక్సెస్ అయ్యింది ముకుంద.  అందుకే నా నా తప్పు లేదని నిరూపించుకోవడం కోసమే మా సీనియర్ డాక్టర్ని రమ్మన్నాను అంటుంది కృష్ణ. అంతలోనే గౌతమ్ రావటంతో అతన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తుంది కృష్ణ. కారు దిగిన గౌతమ్ ని చూసి భవాని షాక్ అవుతుంది. ఈశ్వర్, ప్రసాద్ ఇద్దరూ కోపంతో రగిలిపోతారు. భవాని వాళ్ళని చూసి ఇంత కోపంగా చూస్తున్నారు ఏదైనా గొడవ పడతారా, అసలు బయటపడతారా అనుకుంటుంది కృష్ణ. అతన్ని చూసి వీళ్లెందుకు అంత షాక్ అవుతున్నారు అనుకుంటుంది ముకుంద. మా ఫ్యామిలీ మెంబర్స్ ని పరిచయం చేస్తాను అంటుంది కృష్ణ. నేను గెస్ చేసి చెప్తాను అంటాడు గౌతమ్. మా గురించి మీకెలా తెలుస్తుంది అంటుంది ముకుంద.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రోజూ మీ గురించి కృష్ణ చెప్తూనే ఉంటుంది అంటూ భవానిని అత్తయ్య అని పిలుస్తాడు గౌతమ్. ఆ మాటకి కోపంతో రగిలిపోతుంది భవాని. అదే మీ పెద్ద అత్తయ్య భవాని దేవి గారు కదా అంటూ మాట మారుస్తాడు గౌతమ్. ఈ ఇంటికి రక్షణ కవచం లాగా నిలబడే ఈ ఇద్దరూ ఒకరు మామగారు ఈశ్వర్ ఇంకొకరు చిన్న మామగారు ప్రసాద్ అంటాడు గౌతమ్.కక్కలేక, మింగలేక కోపంతో రగిలిపోతూ ఉంటారు భవాని ఈశ్వర్,  ప్రసాద్. అందరి గురించి కరెక్ట్ గా గెస్ చేశారు అంటుంది కృష్ణ. మురారి దగ్గరికి వెళ్లి బావగారు అని పిలుస్తాడు. అయోమయంగా చూస్తాడు మురారి. కృష్ణ నా సొంత చెల్లెలు కన్నా ఎక్కువ అప్పుడు మీరు నాకు బావగారే కదా అవుతారు అంటాడు గౌతమ్. కరెక్టే అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు మురారి.

37

గౌతమ్ ని అల్లుడు గారు అని పిలిచి షాకిస్తుంది రేవతి. అందరూ ఆమె వైపు అయోమయంగా చూస్తారు. అంటే మా కృష్ణకి అన్నయ్య అయితే నాకు అల్లుడు గారే అవుతారు కదా అంటూ సర్ది చెప్పి భోజనానికి పిలుస్తుంది రేవతి. మీ గురించి కూడా కృష్ణ చెప్పింది మీరు తనని అమ్మ లాగా చూసుకుంటారంట కదా అంటాడు గౌతమ్. భవాని, ఈశ్వర్, ప్రసాద్ తప్ప అందరూ భోజనానికి వెళ్తారు. కృష్ణ తెలిసి తీసుకొచ్చిందా తెలియక తీసుకువచ్చిందా అంటాడు  ఈశ్వర్. తను ఎలా తీసుకువచ్చిన మన ఇంటికి వచ్చేంత ధైర్యం తనకి ఎలా వచ్చింది ఇప్పుడే షూట్ చేసి పరాయాలనంత కోపం వస్తుంది అంటుంది భవాని. కానీ ఇప్పుడు ఆవేశపడితే మురారి ముందు దోషిగా నిలబడాలి వాడు ఎవరిని క్షమించడు అంటుంది. భోజనాల దగ్గర కూర్చున్న గౌతమ్ నేను పంపించిన టాబ్లెట్ వల్లే రియాక్షన్ వచ్చిందంట కదా అది అందరికీ జరగదు.

47

వేలల్లో ఒకరికి మాత్రమే జరుగుతుంది మన దురదృష్టం కొద్దీ అది నందిని విషయంలో జరిగింది అంతేకానీ ఇందులో కృష్ణ తప్పేమీ లేదు అంటాడు గౌతమ్. ఈ తప్పు నావల్లే జరిగిందని ఒప్పుకోమని ఇంటికి వచ్చి మరి గొడవ చేసింది నేనేమో లీవ్ లో ఉన్నాను. నన్ను పట్టుకోవటానికి ఒక గంట పర్మిషన్ అడిగితే బావగారు హర్ట్ అయ్యేలాగా ప్రవర్తించారంట కదా అదే చెప్పుకొని ఏడ్చింది  అంటాడు గౌతమ్.అవన్నీ గుర్తు చేసుకోవడం ఎందుకు ప్రశాంతంగా భోంచేయండి అంటుంది రేవతి. అంతలో నందిని కిందికి వస్తుంది. అది గమనించిన రేవతి వాళ్లు కంగారు పడతారు. గౌతమ్ నందినిని చూసి ఎమోషనల్ అవుతాడు. నందిని, గౌతమ్ ని చూసే లోపు అక్కడ నుంచి తీసుకెళ్ళిపోమని ప్రసాద్ కి చెప్తారు ఈశ్వర్, భవాని. అది చూసిన కృష్ణ, గౌతమ్ నిరాశ పడతారు.

57

భోజనం తర్వాత బయలుదేరుతున్న గౌతమ్ నేను ఇంక బయలుదేరుతాను రేపటి నుంచి నందిని కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అంటాడు. సరే అంటాడు మురారి. భవాని మాత్రం ఒప్పుకోదు. మా నందిని కి ట్రీట్మెంట్ చేయటానికి కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు అంటుంది. సరే మీ ఇష్టం అంటూ రేవతి వైపు తిరిగి  అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడికి వడ్డించినట్లు కొసరి కొసరి వడ్డించారు.మీ ఆతిథ్యాన్ని ఎప్పుడూ మర్చిపోను అంటాడు గౌతమ్. దాందేముంది అప్పుడప్పుడు వస్తుందండి అంటుంది రేవతి. మీ చేతి భోజనం కోసమైనా వస్తూ ఉంటాను అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు గౌతమ్. మీకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి అనుకుంటాను ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అంటుంది కృష్ణ. అలాగే ఏసీపి సర్ కి కావలసిన సమాధానం కూడా వారికి దొరికినట్లుగా ఉంది అంటుంది.
 

67

 ఇక క్లారిటీ రావాల్సింది నందిని కేసు మాత్రమే. అది కూడా అతి త్వరలోనే క్లియర్ చేస్తాను అంటుంది కృష్ణ. నాకు తెలుసు నా కోడలు తలుచుకుంటే ఏమైనా చేయగలదు ఆ నమ్మకం నాకుంది అంటుంది రేవతి. కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది భవాని. మరోవైపు గదిలో ఉన్న మురారి ఆలోచనలో పడతాడు. గౌతమ్ కృష్ణని సొంత చెల్లెలు లాగా ఫీల్ అవుతున్నాడు.నేను ఎంత పొరపాటు పడ్డాను అసలు ఆ నిమిషంలో ఎందుకు అంత ఆవేశపడ్డాను అనుకుంటాడు. ఇదంతా కృష్ణ కోసమే తనంటే నాకు అభిమానమా ఇష్టమా అనుకుంటాడు. ఇంతలోనే కృష్ణ రావడంతో లేచి నిల్చుంటాడు మురారి. నేను వస్తే మీరు లేచి నించోడం ఎందుకు మీరు పెద్ద ఆఫీసర్ నేను జస్ట్ జూడోని మాత్రమే కూర్చోండి సార్ అంటుంది కృష్ణ.

77

ఓర్పులో, సహనంలో, ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవటంలో మొండితనంలో నీలోని స్త్రీ ఔన్నత్యం ముందు నాలో ఉన్న పురుష అహంకారం చచ్చిపోయింది.నీతో ఆరోజు అలా ప్రవర్తించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటాడు మురారి. తరువాయి భాగంలో మన ఇద్దరి ప్రేమ సంగతి ఏం చేశావు అంటూ మురారిని అడుగుతుంది ముకుంద.కొన్ని ప్రశ్నలకు జవాబులు ఉండవు అంటాడు మురారి. అంతలోనే కృష్ణ రావడం గమనించి ముకుందని వెళ్లిపోమంటాడు. అంతలోనే అక్కడికి వచ్చిన కృష్ణ ఏంటి సార్ పెద్ద మెసేజ్ పెట్టారు అని అడుగుతుంది. తను నాతో ఏదో మాట్లాడ్డానికి వచ్చింది అంటాడు మురారి. కానీ నేను ఇంకా మాట్లాడటం పూర్తి అవ్వలేదు అంటుంది ముకుంద. మీరు మాట్లాడుకోండి అంటూ వెళ్ళిపోతున్న కృష్ణని చేయి పట్టుకుని ఆపుతాడు మురారి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Recommended image3
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved