- Home
- Entertainment
- Krishna Mukunda Murari: నడిరోడ్డులో ముకుంద కి జరిగిన ఘోర అవమానం.. కోడలు చెప్పింది విని కంగారుపడ్డ భవాని!
Krishna Mukunda Murari: నడిరోడ్డులో ముకుంద కి జరిగిన ఘోర అవమానం.. కోడలు చెప్పింది విని కంగారుపడ్డ భవాని!
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ కథ, కథనాలు బాగుండటంతో మంచి రేటింగ్ ని సంపాదించి ముందుకి దూసుకుపోతుంది. ఎవరి ప్రమేయం లేకుండానే తారుమారు అయిన మూడు జీవితాల కధ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో కృష్ణని ముందు సీట్లో కూర్చోబెట్టి ముకుందని వెనక సీట్లో కూర్చోమంటాడు మురారి. కృష్ణ సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఆమెకి హెల్ప్ చేస్తాడు మురారి. అది చూసిన ముకుంద కోపంతో రగిలిపోతుంది. మరోవైపు ప్లాన్ ఏ నందు ని అమెరికా పంపించడం అయితే ప్లాన్ బి ఏంటి అని భవానిని అడుగుతాడు ఈశ్వర్. ఒక్క నిమిషం అంటూ శాంతి అనే ఆవిడకి ఫోన్ చేసి ఏదో మాట్లాడుతుంది భవాని. ఫోన్ పెట్టేసిన తరువాత ఎలా ఉంది మన ప్లాన్ బి అంటుంది. సూపర్ అంటూ వదినని తెగ పొగిడేస్తాడు ఈశ్వర్.
మరోవైపు కృష్ణతో టైం స్పెండ్ చేయాలని నేను లీవ్ పెడితే ఈ ముకుంద మధ్యలో దూరిపోయింది అని తిట్టుకుంటాడు మురారి. నువ్వు ఎక్కడ దిగాలి అని అడుగుతుంది కృష్ణ. ఎక్కడా దిగను నిన్ను డ్రాప్ చేసి నేను మురారి వెనక్కి వచ్చేస్తాము అంటుంది ముకుంద. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఎలా దిగిపోతాను అనుకుంటూ రాత్రి సోఫా మీద పడుకున్నట్లు ఉన్నావు కుట్టలేదా అని మురారిని అడుగుతుంది ముకుంద. లేదు అంటాడు మురారి. నువ్వు నందిని రూమ్ లో పడుకుంటే నందిని నిన్ను ఎలవ్ చేయలేదా అని అడుగుతుంది ముకుంద.
నేను మా బెడ్ రూమ్ లోనే పడుకున్నాను అని చెప్తుంది కృష్ణ. నందిని పడుకున్న వెంటనే కృష్ణ మా గదిలోకి వచ్చి పడుకుంది. ఆ విషయం తెలియక నేను సోఫాలో పడుకున్నాను అంటాడు మురారి. ఇద్దరూ బయటపడడం లేదు అనుకుంటుంది ముకుంద. నువ్వు ఎక్కడ దిగాలి అని ముకుందని అడుగుతాడు మురారి. ఇప్పుడు దిగను కృష్ణని డ్రాప్ చేసి రిటర్న్ అవుతాం కదా అప్పుడు దిగుతాను అంటుంది ముకుంద. మురారిని కార్ ఆపమంటుంది కృష్ణ. మురారి కార్ ఆపితే ముకుందని కార్ దిగమంటుంది కృష్ణ. ఎందుకు అని అడుగుతుంది ముకుంద.
వచ్చేటప్పుడు అర్జెంటు అన్నదానివి ఇప్పుడు తాపీగా దిగుతాను అంటావేంటి అసలు మేమిద్దరం బయలుదేరుతున్నప్పుడు నువ్వు వస్తాననటమే తప్పు. నాకు నాకు ఏసీపీ సర్ తో చాలా పని ఉంది నిన్ను డ్రాప్ చేసేంత టైం మాకు లేదు అర్జెంటుగా కార్ దిగు అంటుంది కృష్ణ. ఇదే మాట మీ ఏసీపీ సార్ ని చెప్పమను అంటుంది ముకుంద. అయినా చెప్పేదేంటి నేను చెప్తున్నాను కదా మా ఇద్దరి మధ్యలో నువ్వుంటే డిస్టబెన్స్ గా ఫీల్ అవుతున్నాము అంటుంది కృష్ణ. చేసేదిలేక కారు దిగిపోతుంది ముకుంద. వెళ్ళిపోతున్న మురారి వాళ్లని చూస్తూ ఎక్కడికి వెళ్ళినా ఇంటికి కదా తిరిగి రావాలి అక్కడ మీ పొగరు మొత్తం దిగిపోయేలాగా చేస్తాను అనుకుంటుంది ముకుంద.
ముకుందతో అలా చెప్పి మంచి పని చేశావు అసలు నేనే చెబుదామనుకున్నాను ఈ లోపల నువ్వే చెప్పావు అంటాడు మురారి. మీరు మీ పెద్దమ్మకి ముకుంద కి ఎదురు చెప్పలేరని నాకు తెలుసు సార్ అంటుంది కృష్ణ. కృష్ణతో ఎలాగైనా టైం స్పెండ్ చేయాలనుకున్న మురారి కావాలనే వాళ్ళ కారు ఆగిపోయిందని చెప్తాడు. కారు కాకపోతే ఆగిపోయింది కానీ మన గెస్ట్ హౌస్ ఎదురుకుంటానే ఆగిపోయింది. మనం వెళ్లి లోపల వెయిట్ చేద్దాం పద ఈ లోపు మెకానిక్ వచ్చి కారు బాగు చేస్తాడు అనుకుంటూ ఆమెను తీసుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు నా ప్రేమ విషయంలో కృష్ణకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు తను మా ఇద్దరికీ హెల్ప్ చేయాలని చూస్తుంది
అసలు నేను ఎందుకు ఒంటరిగా ఫైట్ చేయకూడదు అప్పుడు అంటే స్టూడెంట్ ని పైగా పేదవాడిని ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు నేను పెద్ద డాక్టర్ని. నా సంగతి నేనే తేల్చుకుంటాను నందిని కోసం చచ్చినా నా కదొక తృప్తి అనుకుంటాడు. ఇంతలో కృష్ణ ఫోన్ చేసి నా కార్లు పాడైంది నేను రావడం లేట్ అవుతుంది కానీ నేను వచ్చిన వరకు వెయిట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. మరోవైపు క్యాబ్లో ఇంటికి వచ్చిన ముకుంద, కృష్ణ ని ఇంట్లోంచి పంపించేయండి తను చాలా ఎక్కువ చేస్తుంది. మురారి తనకి చాలా చనువు ఇచ్చాడు అందుకే ఇతను ఎవరిని చేయడం లేదు అంటూ భవానికి చెప్తుంది.
ఏమైంది మీరు ముగ్గురు కలిసే వెళ్లారు కదా అంటాడు ఈశ్వర్. కలిసే వెళ్ళాం కానీ నన్ను మధ్యలో దింపేసింది అంటుంది ముకుంద. తను హత్య లాగా మాట్లాడావా అని అడుగుతుంది భవాని. నేను షాపింగ్ కోసం డ్రాప్ చేయమన్నాను తనకి హాస్పిటల్ కి లేట్ అవుతుందని ముందు తనని డ్రాప్ చేసేయమన్నాను అది తనకి నచ్చలేదు. అందుకే నన్ను దిగిపోమంది అంటూ కంప్లైంట్ చేస్తుంది ముకుంద.కృష్ణకి నువ్వు అడ్డు అని నీకెందుకు అనిపించింది అంటుంది భవాని.
కృష్ణ ఏదో చేయాలనుకుంటుంది అందుకు మురారి హెల్ప్ అడిగినట్లుగా ఉంది అందుకు మురారి కూడా ఒప్పుకున్నట్లుగా ఉన్నాడు. అందుకే మురారిని హాస్పిటల్ కి తీసుకెళ్ళింది అని చెప్తుంది ముకుంద. ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది భవాని.తరువాయి భాగంలో ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో ఎవరో ఉండరా అని అడుగుతుంది కృష్ణ. మురారి టీ పెడతాను అనటంతో మీరు టీ పెడతారా అంటూ ఆశ్చర్యపోతుంది కృష్ణ.