MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krishna Mukunda Murari: గుడిలో చేయకూడని పనిచేసిన ముకుంద.. అనుకోని పరిణామానికి షాకైన మురారి!

Krishna Mukunda Murari: గుడిలో చేయకూడని పనిచేసిన ముకుంద.. అనుకోని పరిణామానికి షాకైన మురారి!

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తప్పనిసరి పరిస్థితులలో భార్యాభర్తలు అయిన ఇద్దరు వ్యక్తుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Navya G
Published : May 13 2023, 02:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఎపిసోడ్ ప్రారంభంలో తన గదిలో ఉన్న ముకుంద అన్ని నాకు అనుకూలంగానే జరుగుతున్నాయి. అనుకున్నది జరిగితే ఆనందం కానీ అనుకోకుండా జరిగితే అది అద్భుతం. నేను నీకు ఉంగరం తొడగాలనుకున్నాను. కానీ దేవుడు గుడిలో ఉంగరం తొడిగే అవకాశం వచ్చింది అంటే మనం ఇద్దరం కలవడం దేవుడికి కూడా ఇష్టమే.
 

210

ఎలా అయినా ఈరోజు గుడిలో ఉంగరం తొడగాలి అని డిసైడ్ అవుతుంది. మరోవైపు భవాని గదికి వెళ్తాడు మురారి. ఎందుకు పెద్దమ్మ రమ్మన్నావంట అని అడుగుతాడు. నేను ఆశ్రమానికి వెళ్తున్నాను అంటుంది భవాని. ఎందుకు అని కంగారుగా అడుగుతాడు మురారి. జీవితం మీద విరక్తి పుట్టి నా శేష జీవితాన్ని అక్కడే గడపటానికి మాత్రం కాదు అంటూ నవ్వుతుంది భవాని.

310

మనం ట్రస్టీగా ఉన్న ఆశ్రమానికి హాస్పిటల్ కి అవసరం ఉందంట అందుకే దగ్గరుండి హాస్పిటల్ కట్టించి పని పూర్తయ్యాక ఇంటికి వస్తాను అంటుంది భవాని. సరే అని ఒప్పుకుంటాడు మురారి. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ గుడికి చేరుకుంటారు. అక్కడ ఒక ముసలి తాత ఆకలికి తాళలేక బాధపడుతూ ఉంటాడు. అది చూసిన కృష్ణ ఈరోజు మీ పుట్టిన రోజు సందర్భంగా వారికి ఏదైనా సాయం చేయండి అంటుంది.

410

అట్నుంచి వచ్చాక చేద్దువుగానివి ఇప్పటికే ఆలస్యం అయిపొయింది గుడి మూసేస్తారేమో అంటుంది భవాని. కృష్ణ తరపున నువ్వు దానం చేసిన ఫలిస్తుంది ఈ లోపల అత్తయ్య వాళ్ళు పూజ చేయిస్తారు అని సలహా ఇస్తుంది ముకుంద. రేవతి కూడా అలాగే అనడంతో కృష్ణ ముసలి వాళ్లకి ప్రసాదం తీసుకురావడం కోసం వెళుతుంది. మరోవైపు కాస్త ముందు రావలసింది ఇప్పుడు ప్రదక్షిణాలు చేసి పూజ చేయటానికి సమయం ఉండదు
 

510

 అందుకని మీరు ప్రదక్షిణలు చేయండి బాబు చేత నేను అభిషేకం చేయిస్తాను అంటారు పూజారి. నాకు అన్నీ మంచి శకునములే దొరుకుతున్నాయి కృష్ణ లేదు అత్తయ్య వాళ్ళు ప్రదక్షిణం చేయటానికి వెళితే సమయం చూసుకొని మురారి చేతికి ఉంగరం పెట్టేయాలి అనుకుని ఆనందపడుతుంది ముకుంద. రేవతి ముకుందని కూడా తనతో పాటు రమ్మంటుంది.

610

అభిషేకం దగ్గర సహాయంగా ఉంటుంది ఆమెని ఉంచండి అంటారు పూజారి. ఇష్టం లేకపోయినా అక్కడ నుంచి బయలుదేరుతుంది రేవతి. ఆమెతోపాటు భవాని కూడా వెళ్తుంది ఇద్దరు కలిసి ప్రదక్షిణలు చేస్తారు. మరోవైపు ప్రసాదం పొట్లాలు తీసుకెళ్లి ముసలి వాళ్లకి ఇస్తుంది కృష్ణ. ప్రసాదంతో పాటు కొంచెం డబ్బు కూడా ఇస్తుంది.

710

అందుకు ఆనందించిన తాత నువ్వు భర్త పిల్లలతో నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలి అని దీవిస్తాడు. ఎంతో ఆనంద పడిపోతుంది కృష్ణ. మరోవైపు ప్రదక్షిణలు చేస్తూ ముకుంద జీవితం ఏ పరమార్థమూ లేకుండా నిస్సారంగా గడిచిపోతుంది ఆమె జీవితానికి ఒక మార్గం సూచించు ఆదర్శనీ త్వరగా రప్పించే లాగా చేయు అని దేవుడికి దండం పెట్టుకుంటుంది భవాని.

810

మురారి దగ్గర ముకుందని వదిలి రావడం ఇష్టం లేదు త్వరగా కృష్ణని రప్పించే లాగా చూడు అని రేవతి దండం పెట్టుకుంటుంది. ప్రదక్షిణలు చేస్తున్న కృష్ణని పిలిచి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది రేవతి. ప్రదక్షిణలు చేస్తున్న అత్తయ్య అంటుంది కృష్ణ. అక్కడ మీ ఆయన పూజ చేస్తున్నాడు చూసావా అంటుంది రేవతి. చూసాను అత్తయ్య ముకుంద హెల్ప్ చేస్తుంది కదా అందుకే నేను ప్రదర్శనలు చేస్తున్నాను అంటుంది.

910

తల మీద మెత్తగా చిన్న దెబ్బ వేసి అందుకే నిన్ను మట్టి బుర్ర అనేది భర్త పూజ చేస్తున్నప్పుడు పక్కన భార్య ఉండాలి తొందరగా వెళ్ళు అంటూ కసురుకుంటుంది. నాకు ఇవన్నీ తెలియదు కదా అత్తయ్య అని ముఖం చినుపుచ్చుకుంటుంది. కృష్ణ. నీకు అన్నీ తెలిస్తే నాకెందుకు ఈ బాధ అంటుంది రేవతి. మరోవైపు అభిషేకానికి సాయం చేస్తున్నట్లుగా చేసి మురారి చేతికి ఉంగరం తొడిగేస్తుంది ముకుంద. అనుకోని ఆ పరిణామానికి షాక్ అయిపోతాడు మురారి. ఈ ఉంగరం నీ వేలికి తొడిగేసాను మన నిశ్చితార్థం అయిపోయినట్లే అంటూ ఆనందంగా చెప్తుంది ముకుంద. 

1010

మొహం చికాగ్గా పెట్టి ఉంగరాన్ని తీయటానికి ప్రయత్నిస్తాడు కానీ అది రాదు. ఇంతలోనే అక్కడికి అందరూ రావడంతో కామ్ గా ఊరుకుంటాడు. తరువాయి భాగంలో ముడుపు కట్టమని పసుపుతాడు కృష్ణకి ఇస్తారు పంతులుగారు. తన చేత ఎలాగైనా ముడుపు కట్టించకూడదు అనుకుని కృష్ణని వేరే పని మీద పంపించి ఆ ముడుపు ముకుంద కట్టేస్తుంది. అది చూసిన కృష్ణ మురారి ఇద్దరు షాక్ అవుతారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved