MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Micro Dramas: ఓటీటీలకు బిగ్‌ షాక్‌, ఇకపై ఫ్యూచర్‌ అంతా వీటిదే.. స్టోరీ టీవీ భారీ ప్లాన్‌

Micro Dramas: ఓటీటీలకు బిగ్‌ షాక్‌, ఇకపై ఫ్యూచర్‌ అంతా వీటిదే.. స్టోరీ టీవీ భారీ ప్లాన్‌

Micro Dramas: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. చాలా మంది ఆడియెన్స్ ఓటీటీలోనే సినిమాలు, సిరీస్‌లు చూస్తున్నారు. ఈ క్రమంలో దీనికి పోటీ రాబోతుంది. మైక్రో డ్రామాలు వస్తున్నాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 31 2026, 08:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
ఓటీటీలను డామినేట్‌ చేయబోతున్న మైక్రో డ్రామాలు
Image Credit : Asianet News

ఓటీటీలను డామినేట్‌ చేయబోతున్న మైక్రో డ్రామాలు

థియేటర్ తర్వాత టీవీల ప్రభావం ఉండేది, ఇప్పుడు ఓటీటీ ప్రభావం నడుస్తుంది. ఇవి థియేటర్‌ని డామినేట్‌ చేసే స్థాయికి ఎదిగాయి. చాలా వరకు ఆడియెన్స్ థియేటర్లో సినిమా చూడటం కంటే, ఓటీటీలోనే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఓటీటీల కోసమే ప్రత్యేకంగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు రూపొందుతున్నాయి. మరోవైపు ఓటీటీల కోసం సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీలకు చెక్‌ పెట్టే టైమ్‌ రాబోతుంది. ఓటీటీ సినిమాలు, సిరీస్‌లకు పెద్ద షాకిచ్చే కథలు రాబోతున్నాయి. అందుకు స్టోరీ టీవీ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మైక్రో డ్రామాలు విస్తరిస్తున్నాయి. పలు యాప్‌లలో ఇప్పటికే మైక్రోడ్రామాలు వస్తున్నాయి. మంచి ఆదరణ పొందుతున్నాయి.

వచ్చే ఏడాదికి వెయ్యి మైక్రో డ్రామాలు

ఈ నేపథ్యంలో స్టోరీ టీవీ దీన్ని మరింతగా విస్తరించే ప్లానింగ్‌లో ఉంది. దీని మాతృ సంస్థ ఎలోఎలో గ్రూపు అదిరిపోయే ప్లానింగ్‌తో ముందుకు సాగుతుంది. 2027 మార్చి నాటికి వెయ్యికిపైగా మైక్రో డ్రామాలను రూపొందించడమే లక్ష్యంతో ముందుకు సాగుతుందట. ఇందులో తెలుగు కంటెంట్‌కి ప్రయారిటీ ఇవ్వబోతుందట. ఈరోజు ప్రేక్షకులు మొబైల్‌లోనే వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో తమ భాషలో, తమ సంస్కృతికి, తమ జీవితాలకు దగ్గరగా ఉండే కథలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ మారుతున్న అభిరుచిని దృష్టిలో పెట్టుకుని, తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా పూర్తిగా స్థానిక కథలతో నాణ్యమైన మైక్రో డ్రామాలను రూపొందించేందుకు స్టోరీ టీవీ సిద్ధమైంది. దక్షిణాది ప్రేక్షకులు రోజుకు సగటున 95 నిమిషాలకు పైగా స్టోరీ టీవీలో గడుపుతున్నారని సంస్థ వెల్లడించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
స్థానికతకు ప్రయారిటీ ఇచ్చేలా మైక్రో డ్రామాలు
Image Credit : Asianet News

స్థానికతకు ప్రయారిటీ ఇచ్చేలా మైక్రో డ్రామాలు

అందులో భాగంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్థానిక రచయితలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి ఒరిజినల్ కథలను రూపొందించనుంది. ప్రతి భాషలో అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కథలను అందిస్తూ, భారతీయ మైక్రో డ్రామాల రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని ఇది భావిస్తోంది. తెలుగు ఒరిజినల్ షోల కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులు స్టోరీ టీవీతో చేతులు కలిపారు. 'వన్ లాస్ట్ రైడ్' దర్శకుడు అజ్జు, నంది అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాష్ (స్వాతి చినుకులు, ఋతురాగాలు), అలాగే చరణ్ లక్కరాజు (టెంపరరీ రూమ్‌మేట్స్), రాజ్ (బిగ్‌బాస్ తెలుగు), అన్విత (దేవయాని), విశాలాక్షి (లక్ష్మీ నివాసం), రక్ష (గుప్పెడంత మనసు), రోహిత్ (అభిషేకం), మోనిక (పద్మావతి కల్యాణం) వంటి ప్రముఖ నటీనటులు ఈ ప్రాజెక్టుల్లో భాగమవుతున్నారు.

తెలుగు మైక్రో డ్రామాలకే ప్రయారిటీ 

ఈ సందర్భంగా స్టోరీ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ GSN Aditya మాట్లాడుతూ, ఈరోజు వినోదం పూర్తిగా మొబైల్‌కే పరిమితమైంది. ప్రేక్షకులు కూడా తమ భాషలో, తమ సంస్కృతికి, తమ జీవితాలకు దగ్గరగా ఉండే కథలనే ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు. దీంతో రచయితలు, దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లు... ఇలా ఎంతో మంది సృజనాత్మక ప్రతిభకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. భారతీయ కథలను మరింత కొత్తగా, మరింత మందికి చేరేలా చెప్పడానికి ఇది ఒక మంచి వేది కగా మారింది. మా ప్రయాణంలో తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కథలకు ఉన్న ఆదరణ, సృజనాత్మక ప్రతిభ రెండూ అసాధారణమైనవి. తెలుగు ప్రేక్షకులకు అత్యుత్తమమైన మైక్రో డ్రామాలను అందించడమే కాదు, ఇక్కడ నిర్మించే కథలతో దేశవ్యాప్తంగా ప్రీమియం వర్టికల్ స్టోరీటెల్లింగ్‌కు కొత్త దిశ చూపించాలని కోరుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మొదలవుతున్న ఈ ప్రయాణమే రేపు దేశంలోని ఇతర భాషల్లో మా ఎదుగుదలకు బలమైన పునాది అవుతుందని మేము విశ్వసిస్తున్నాం` అని తెలిపారు. మొత్తంగా ఇది భవిష్యత్‌లో ఓటీటీలపై గట్టి ప్రభావం పడబోతుందని చెప్పొచ్చు.

Related Articles

Related image1
Trisha: మహేష్‌ బాబు, త్రిష కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? జస్ట్ లో బ్లాక్‌ బస్టర్‌ మిస్‌
Related image2
Karmakhya Movie Review: `కర్మాఖ్య` మూవీ రివ్యూ.. అదిరే అభి డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉందంటే?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
Trisha: మహేష్‌ బాబు, త్రిష కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? జస్ట్ లో బ్లాక్‌ బస్టర్‌ మిస్‌
Recommended image2
Karmakhya Movie Review: `కర్మాఖ్య` మూవీ రివ్యూ.. అదిరే అభి డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved