MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Agadha 2 Days Collections రెండో రోజు కలెక్షన్లు జంప్‌.. ఎంఎస్‌ రాజు అగధ మూవీ ఎంత రాబట్టిందంటే?

Agadha 2 Days Collections రెండో రోజు కలెక్షన్లు జంప్‌.. ఎంఎస్‌ రాజు అగధ మూవీ ఎంత రాబట్టిందంటే?

ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో రూపొందిన `అగధ` మూవీ థియేటర్లో సందడి చేస్తోంది. ఈ సినిమాకి మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్లు పెరగడం విశేషం. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 16 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిస్టరీ హర్రర్‌ థ్రిల్లర్‌గా వచ్చిన అగధ
Image Credit : Asianet News

మిస్టరీ హర్రర్‌ థ్రిల్లర్‌గా వచ్చిన అగధ

నిర్మాతగా ఎంఎస్‌ రాజు అనేక బ్లాక్‌ బస్టర్స్ ఇచ్చారు. స్టార్‌ ప్రొడ్యూసర్‌గా రాణించారు. కానీ దర్శకుడిగా మాత్రం ఆ స్థాయి విజయం దక్కలేదు. వేరైటీ సినిమాలు చేస్తూ వచ్చారు. ఇదేంటి ఎంఎస్‌ రాజు ఇలాంటి సినిమాలు చేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మిస్టరీ, హర్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో `అగధ` చిత్రాన్ని రూపొందించారు. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో భానుచందర్‌, శ్రావణ్‌ రెడ్డి, వనితా విజయ్‌ కుమార్‌, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌ కుమార్‌ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అగధ మూవీకి మిశ్రమ స్పందన
Image Credit : Asianet News

అగధ మూవీకి మిశ్రమ స్పందన

స్వతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఎంఎస్‌ రాజు దర్శకుడిగా కొత్తగా చేసిన ప్రయత్నమిది. దేవి రేంజ్‌లో ఉంటుందని ఆయన చెబుతూ వచ్చారు. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కానీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. దీనికి చాలా వరకు నెగటివ్‌ టాక్‌ వచ్చింది. తాజాగా కలెక్షన్లు కూడా అలానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపించడం లేదు. మొదటి రోజు తక్కువ కలెక్షన్లు వచ్చాయి. కేవలం ముప్పై లక్షలు మాత్రమే వచ్చినట్టు ట్రేడ్‌ సైట్లు వెల్లడించాయి.

Related Articles

Related image1
Nagarjuna: నేను కరప్ట్ అయ్యాను, నాది నాకే నచ్చడం లేదు.. నాగార్జున సంచలన కామెంట్‌
Related image2
MS Raju: అగధ సినిమా రిజల్ట్ పై ఎంఎస్‌ రాజు రియాక్షన్‌.. ఎమోషనల్‌ కామెంట్‌
34
అగధ కలెక్షన్లు
Image Credit : Asianet News

అగధ కలెక్షన్లు

అయితే మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్లు పుంజుకోవడం విశేషం. ఇండిపెండెన్స్ డే సందర్భంగా కలెక్షన్లు పెరిగాయి. సుమారు రూ.43లక్షలు వచ్చాయి. ప్రీమియర్స్ ద్వారా మరో ఐదు లక్షల వరకు వచ్చినట్టు సమాచారం. మొత్తంగా రెండు రోజుల్లో ఈ చిత్రానికి ఇండియాలో రూ.78లక్షలు రావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా సుమారు కోటి వరకు వచ్చినట్టు టాక్‌. అంటే దాదాపు యాభై లక్షల వరకు షేర్‌ వచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమా హిట్‌ కావాలంటే ఐదు కోట్ల షేర్‌ రావాలని సమాచారం. అంటే పది కోట్ల గ్రాస్‌ రావాలి. మరి ఈ చిత్రం ఆ స్థాయిలో వసూలు చేస్తుందా అనేది చూడాలి. మూవీ మాత్రం నెమ్మదిగా పుంజుకుంటుందని, పెద్ద రేంజ్‌కి వెళ్తుందని టీమ్‌ నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది. మరి ఏస్థాయిలో రాబడుతుందనేది చూడాలి.

44
అగధ బడ్జెట్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌
Image Credit : Asianet News

అగధ బడ్జెట్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

ఈ సినిమాకి సుమారు రూ.10కోట్ల వరకు బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. ఓటీటీ ఇంకా అమ్మలేదు. రిలీజ్‌ తర్వాత అమ్మాలని దర్శకుడు ఎంఎస్‌ రాజు ప్లాన్‌ చేశారు. థియేట్రికల్‌గా ఐదు కోట్ల వరకు బ్రేక్‌ ఈవెన్ టార్గెట్‌ పెట్టుకున్నారు. ఇక ఈ మూవీ అగధ అనే నెగటివ్‌ శక్తి చుట్టూ తిరుగుతుంది. అది ప్రధాన పాత్రలో నటించిన కామాక్షి భాస్కర్ల బాబాయ్‌ కుటుంబాన్ని పీడిస్తుంది. ఒక్కొక్కరిని చంపేస్తుంటుంది. దాన్ని అంతు చూసేందుకు కామాక్షి ఏం చేసిందనేది సినిమా. సినిమాలో థ్రిల్లర్‌, హర్రర్‌ డోస్‌ తగ్గిందనే విమర్శలు వినిపించాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun Home Tour: 100 కోట్ల అల్లు అర్జున్ 'బ్లెస్సింగ్' ఇల్లు చూశారా? లోపల ఎంత లగ్జరీగా ఉందో చూడండి
Recommended image2
Suspense Thriller OTT: మూడు మరణాలు, ఒకే అనుమానం! ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్, ఎక్కడ చూడొచ్చంటే?
Recommended image3
Nandu Bigg Boss: యూట్యూబర్ నందు బిగ్ బాస్ కోసం ఇండియాకు వచ్చిందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిజమెంత?
Related Stories
Recommended image1
Nagarjuna: నేను కరప్ట్ అయ్యాను, నాది నాకే నచ్చడం లేదు.. నాగార్జున సంచలన కామెంట్‌
Recommended image2
MS Raju: అగధ సినిమా రిజల్ట్ పై ఎంఎస్‌ రాజు రియాక్షన్‌.. ఎమోషనల్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved