MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?

Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?

గులాబ్ జామ్‌తోనో, ఫ్రూట్ సలాడ్‌తోనో ఐస్‌క్రీమ్ తినడం కామన్. కానీ వేడివేడి అన్నంలో ఐస్‌క్రీమ్ వేసుకుని తినేవాళ్లను చూశారా? మృణాల్ ఠాకూర్ అలానే తింటారట. ఈ వింత అలవాటు వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఏంటో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 07 2026, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అన్నంతో ఐస్ క్రీమ్ తినే అలవాటు..
Image Credit : Instagram

అన్నంతో ఐస్ క్రీమ్ తినే అలవాటు..

భోజనం తర్వాత స్వీట్‌గా ఐస్‌క్రీమ్ తినడం మనందరికీ అలవాటే. కొందరు గులాబ్ జామ్‌తో తింటారు, మరికొందరు ఫ్రూట్ సలాడ్‌తో తింటారు. కానీ వేడి అన్నంలో ఐస్‌క్రీమ్ కలుపుకుని తినడం ఎప్పుడైనా చూశారా?
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
విచిత్రమైన ఫుడ్ హ్యాబిట్..
Image Credit : Instagram

విచిత్రమైన ఫుడ్ హ్యాబిట్..

వినడానికి వింతగా ఉన్నా, మనందరి ఫేవరెట్ 'సీతా మహాలక్ష్మి' మృణాల్ ఠాకూర్‌కు ఈ కాంబినేషన్ అంటే ప్రాణమట! అవును, సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో సత్తా చాటుతున్న మృణాల్, ఓ ఇంటర్వ్యూలో తన ఈ విచిత్రమైన ఫుడ్ హ్యాబిట్ గురించి మాట్లాడింది.

Related Articles

Related image1
Viral Song: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..
Related image2
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
36
డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌..
Image Credit : Instagram

డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌..

హీరోయిన్లు డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. కానీ మృణాల్ మాత్రం డిఫరెంట్. మృణాల్ మాట్లాడుతూ.. "నా స్నేహితురాలు ఒక సినిమాలో పాత్ర కోసం అన్నంలో ఐస్‌క్రీమ్ కలుపుకుని తినాల్సి వచ్చింది. తను తింటుంటే చూసి నాకు కూడా ట్రై చేయాలనిపించింది. తిని చూస్తే, నాకు విపరీతంగా నచ్చేసింది. అప్పటి నుంచి ఇది నా ఫేవరెట్ అయిపోయింది" అని మృణాల్ నవ్వుతూ చెప్పింది.

46
డెంటిస్ట్ అవ్వాలనుకుంది..
Image Credit : Instagram

డెంటిస్ట్ అవ్వాలనుకుంది..

మృణాల్ ఫుడ్ హ్యాబిట్‌లాగే ఆమె జీవిత ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మహారాష్ట్రలోని ధులే అనే చిన్న ఊరిలో పుట్టిన మృణాల్, తల్లిదండ్రుల కోరిక మేరకు డెంటిస్ట్ అవ్వాలనుకుంది. కానీ నటనపై ఇష్టంతో ముంబైకి వచ్చింది. మొదట్లో ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోయినా, చదువుతో పాటు ఆడిషన్లకు వెళ్తూ చాలా కష్టపడింది.
56
ఎన్నో అవమానాలు దాటుకుని..
Image Credit : Instagram

ఎన్నో అవమానాలు దాటుకుని..

కేవలం 19 ఏళ్లకే 'కుంకుమ భాగ్య' సీరియల్‌తో ఫేమస్ అయినా, సినిమా అవకాశాలు అంత సులభంగా రాలేదు. సినిమా ఆఫీసులకు వెళ్తే, "నువ్వు టీవీ నటివి, నీది హీరోయిన్ ఫేస్ కాదు" అని డైరెక్టర్లు ముఖం మీదే చెప్పేవారట.
66
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
Image Credit : Instagram

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు

అవమానాలను తట్టుకుని నిలబడ్డ మృణాల్, 'లవ్ సోనియా' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆ తర్వాత వచ్చిన 'సీతా రామం' సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది. ఒకప్పుడు అవకాశాల కోసం ఎదురుచూసిన మృణాల్, ఇప్పుడు వరుణ్ ధావన్, పూజా హెగ్డే లాంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Recommended image2
Jana Nayagan: 5 నెలలుగా రిలీజ్ కాని విజయ్ సినిమా.. అసలు కారణం ఏంటి?
Recommended image3
Viral Song: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..
Related Stories
Recommended image1
Viral Song: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..
Recommended image2
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved