5 నిమిషాల పాట కోసం 50 లక్షలు, మెగాస్టార్ తో డాన్స్ చేయబోతున్న హీరోయన్ ఎవరు?
ఈ మధ్య స్టార్ హీరోయిన్లు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు. ఒక్క స్పెషల్ సాంగ్ చేసినా 2 కోట్లు అడుగుతున్నారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం చాలా తక్కువ పారితోషికం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం హీరోయిన్ల రెమ్యునరేషన్ కోట్లలో ఉంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్లు కూడా భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఇక సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసినా కాని రెండు నుంచి మూడు కోట్టు వసూలు చేస్తున్నారు. తక్కువలో తక్కువ 5 నిమిషాల ప్రత్యేక సాంగ్ కు డాన్స్ చేస్తే కోటి రూపాయల వరకూ ఛార్జ్ చేస్తున్నారు. కాని ఓ హీరోయిన్ మాత్రం చాలా తక్కువ రెమ్యునరేషన్ కు స్పెషల్ సాంగ్ చేసింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ తీసుకున్న రెమ్యునరేషన్ చర్చనీయాంశం అయ్యింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ విశ్వంభర. యంగ్ డైరెక్టర్ వశిష్ట డైరెక్షన్ లో రూపొందుతున్న ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. వరుస ప్లాప్ లతో ఇబ్బందిపడ్డాడు చిరంజీవి. దాంతో కాస్త గ్యాప్ తరువాత మెగాస్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. గత కొద్ది నెలలుగా షూటింగ్ వేగంగా సాగుతుండగా, తాజాగా ఈ సినిమాలో మౌనీరాయ్ నటించిన స్పెషల్ సాంగ్ హైలెట్ కాబోతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ ఏరికోరి బాలీవుడ్ నటి మౌనీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవితో కలిసి ఈ ప్రత్యేక పాటలో నటించినందుకు మౌనీ రాయ్ చాలా తక్కవు పారితోషికం తీసుకుందట. హిందీ టెలివిజన్ సీరియల్ నాగినీ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన మౌనీ రాయ్, బ్రహ్మాస్త్రం వంటి సినిమాలతో ఫేమస్ అయ్యింది. అంతే కాదు కన్నడ పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ లో స్పెషల్ సాంగ్ చేసి సౌత్ ఆడియన్స్ కు కూడా చాలా దగ్గరయ్యింది.
విశ్వంభర చిత్రంలోని ఈ పాటకు గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ అందిస్తుండగా, భీమ్స్ సిసిరోహియో ఈ సాంగ్ వరకు మాత్రమే సంగీతం అందిస్తున్నది . దాదాపు 5 నిమిషాల పాటు సాగే ఈ పాటకుగాను మౌనీ రాయ్‌కు రూ.50 లక్షల పారితోషికం చెల్లిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభమైనట్లు సెట్ నుంచి చిరంజీవి ఫోటోను మేకర్స్ విడుదల చేశారు. దీంతో పాటగా మౌనీ రాయ్ పర్ఫార్మెన్స్ కూడా చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న మౌనీ, తరచూ తన గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ వస్తోంది. ఇప్పుడు చిరంజీవితో కలిసి డాన్స్ చేయబోతున్న ఈ పాట, సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ సాంగ్ షూటింగ్ పూర్తయిన వెంటనే సినిమాకు సంబంధించి మిగతా పార్ట్‌ను సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేయాలని యూనిట్ నిర్ణయించినట్టు సమాచారం. విశ్వంభర రిలీజ్ పై మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈసినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.