- Home
- Entertainment
- Karthika Deepam: బాబాయ్ 'డెత్'కు స్పాట్ పెట్టిన మోనిత... కన్నకొడుకు ఎక్కడున్నాడో తెలుసుకున్న మోనిత?
Karthika Deepam: బాబాయ్ 'డెత్'కు స్పాట్ పెట్టిన మోనిత... కన్నకొడుకు ఎక్కడున్నాడో తెలుసుకున్న మోనిత?
Karthika Deepam: బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సౌందర్య, మోనిత (Monitha) వాళ్ళ బాబాయ్ దగ్గరకు వచ్చి నా కొడుకు నీకు అనుకున్న విధంగానే ఆపరేషన్ చేసేస్తాడు.

నువ్వు ఎలాగైనా మోనిత (Monitha) ను ఇక్కడ నుంచి నీతో పాటు తీసుకెళ్లాలి అని అంటుంది. ఇదే క్రమంలో మోనిత ఎలా గర్భం దాల్చిందో కూడా వాళ్ల బాబాయ్ కి చెప్పేస్తుంది సౌందర్య. ఇక ఇంతలో అక్కడకు వచ్చి కార్తీక్ కు తనకి ఉన్న సంబంధం నిజమే అని చెప్పి ఆ తర్వాత ఆపరేషన్ కానివ్వండి, నా కొడుకు దొరకనివ్వండి మీ జోలికి రాను అని సౌందర్య (Soundarya) తో అంటుంది.
ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చిన సౌందర్య (Soundarya) నేను బస్తీ కి వెళ్ళొచ్చాను అని దీపతో చెబుతుంది. దీప ఎందుకు వెళ్లారు అత్తయ్య అని అడగగా.. ఆ మోనిత (Monitha) వాళ్ళ బాబాయ్ ఆపరేషన్ వెనుక ఎం కుట్ర చేస్తుందో అని బయపడి వెళ్ళాను అని చెబుతుంది. ఆ తర్వాత అక్కడ జరిగినదంతా చెబుతుంది.
ఇక ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి కార్తీక్ ఆపరేషన్ ఆపరేషన్ విషయంలో మోనితను నమ్ముతున్నందుకు కొంత భాదను వ్యక్తం చేస్తారు. మరోవైపు కార్తీక్ (Karthik) సరిచేయడానికి సర్జరీ చేయడానికి డాక్టర్లను సిద్ధంగా ఉండమంటాడు. మరోవైపు మోనిత (Monitha) వాళ్ళ బాబా పై కపట ప్రేమ చూపుతూ ఆపరేషన్ కంటే ముందే వాళ్ల బాబాయి చనిపోతే బాగుండు అని మనసులో అనుకుంటుంది.
అలా వాళ్ళ బాబాయి చనిపోతే మోనిత (Monitha) కార్తిక దగ్గరికెళ్లి ఏడుస్తూ కార్తీక్ ఓదార్పును పొందాలని మనసులో అనుకుంటుంది. మరోవైపు కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీ కార్తీక్ చేసే ఆపరేషన్ విషయంలో మోనిత ఏం ప్లాన్ చేస్తుందో అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తరువాత మోనిత కార్ లో వెళుతుండగా అప్పారావు (Monitha) కలిసి మేడం.. మేడం అంటు విసిగిస్తాడు.
ఇక మోనిత (Apparao) విసుక్కుంటూ అప్పారావు ను అక్కడినుంచి వెళ్ళమంటుంది. అప్పారావు వెళుతుండగా కోటేష్ దంపతుల ఫోటోను పడెసుకొని వెళ్తాడు. అది మోనిత గమనించి వీళ్ళు నీకు తెలుసా అని అడుగుతుంది. అంతేకాకుండా సరిగ్గా చెప్పమని అప్పారావు ను చెంప మీద కొడుతుంది. దాంతో అప్పారావు (Apparao) జరిగినదంతా చెబుతాడు.
అంతే కాకుండా ఇప్పుడు ఆ బాబు వాళ్ళ అక్క బావ దగ్గర ఉన్నాడు అని చెబుతాడు. ఇక కార్తీక్ (Karthik) బాబుతో ఉన్న ఒక ఫోటోను కూడా చూపిస్తాడు. ఆ తర్వాత మోనిత (Monitha),కార్తీక్ దగ్గరకి వెళ్లగా చెంపమీద కొడతాడు కార్తీక్ మరి చెంప మీద ఎందుకు కొట్టాడో తెలియాలంటే రేపటి భాగం వరకు వేచి చూడాల్సి ఉంది.