Karthik Deepam: కార్తీక్ ను కలవబోతున్న మోనిత.. దీపను వదలనంటున్న రుద్రాణి!
Karthik Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. రేటింగ్ లో కూడా ఈ సీరియల్ మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

డాక్టర్ ఈ సర్జరీ చేయడం నావల్ల కాదు. కేవలం డాక్టర్ కార్తీక్ వల్లే అవుతుందని చెబుతాడు. దానికి దీప (Deepa) కార్తీక్ గారిని నేను పిలిపించుకుంటాను అని చెబుతుంది. నేను ఎలాగైనా డాక్టర్ కార్తీక్ (Karthik) ను తీసుకు వస్తాను. మీరు సర్జరీకి కావాల్సిన ఏర్పాట్లు చేయండి అని దీప చెప్పి బయటకు వస్తుంది.
ఇక దీప తన భర్త కార్తీక్ ను వైద్యం చేయమని బ్రతిమిలాడుతుంది. అది నా వల్ల ఎలా సాధ్యమవుతుంది దీప అని కార్తీక్ అంటాడు. దానికి దీప (Deepa) కార్తీక్ చేతులు పట్టుకుని మరీ వేడుకుంటుంది ఉంటుంది. ఇక కార్తీక్ (Karthik) కు ఎటు అర్థం కాకుండా ఉంటుంది.
మరోవైపు మోనిత.. కార్తీక్ (Karthik) గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోగా అక్కడకు భారతి రాగా.. పదిరోజుల్లో కార్తీక్ ను, బాబు ను తీసుకుని ఆ ఇంట్లో అడుగు పెడతాను అన్న ఛాలెంజ్ చేశానని భారతి (Bharathi) తో చెబుతుంది. అది ఎలా సాధ్యం అని భారతి అడుగుతుంది.
దాంతో సాధ్యానికి అసాధ్యాన్ని ఒకే అక్షరం తేడా అని మోనిత (Monitha) చెబుతుంది. ఇక డాక్టర్ భారతి తనకు తన ఫ్రెండ్ ఓ ఫంక్షన్ కు ఆహ్వానించింది అని అంటుంది. దాంతో మోనితను కూడా రమ్మంటుంది. మొదట మోనిత నిరాకరించగా.. ఒకవేళ డాక్టర్ భారతి ద్వారా అక్కడ కార్తీక్ (Karthik) గురించి ఏదైనా జాడ దొరుకుతుందేమో అని వెళ్లడానికి ఓకే అని చెబుతుంది.
నిజానికి డాక్టర్ అంజలి భారతిని ఆహ్వానిస్తుంది. దీన్ని బట్టి చూస్తే అంజలి ద్వారా మోనితకు కార్తీక్ దొరికే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవైపు రుద్రాణి (Rudrani) కార్తీక్, దీప వాళ్ళు ఏ హాస్పిటల్ లో ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె తన తమ్ముళ్లకు ఫోన్ చేసి త్వరగా వెతకండి అని విరుచుకు పడుతుంది. మరోవైపు కార్తీక్.. సౌర్య (Sourya) కు వైద్యం చేయడానికి సిద్దమై హాస్పిటల్ కి వస్తాడు.
ఆ హాస్పిటల్ కి డాక్టర్ కార్తీక్ వచ్చాడని ఆ హాస్పిటల్ స్టాప్ మొత్తం ఆశ్చర్యపోతారు. ఇక కార్తీక్ (Karthik) వైద్యం మొదలు పెడుతాడు. మొత్తానికి కార్తీక్ సౌర్య కు వైద్యం పూర్తి చేస్తాడు. ఆ తర్వాత కార్తీక్ బయటకు వస్తుండగా దీప చూసి ఎంతో ఆనందపడుతుంది. అక్కడకు డాక్టర్స్ కూడా వచ్చి సక్సెస్ అని చెబుతుంది. ఆ క్షణంలో దీప (Deepa) మనసులో ఆనందం మరింత పెరుగుతుంది.