- Home
- Entertainment
- మురళీ మోహన్ కాలర్ పట్టుకున్న మోహన్ బాబు, గెట్ అవుట్ అంటూ వెళ్లగొట్టిన స్టార్ నటుడు, కారణం ఏంటి?
మురళీ మోహన్ కాలర్ పట్టుకున్న మోహన్ బాబు, గెట్ అవుట్ అంటూ వెళ్లగొట్టిన స్టార్ నటుడు, కారణం ఏంటి?
తెలుగు సినీ పరిశ్రమలో వివాదాలు, అభిప్రాయ భేదాలు సర్వసాధారణం. అయితే కొన్ని సందర్భాల్లో ప్రముఖుల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి వెళ్లిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక సంఘటనకు సంబంధించి సీనియర్ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా వెల్లడించారు.

మోహన్ బాబు వివాదాలు
టాలీవుడ్‌లో ‘కాంట్రవర్సీ స్టార్’ గా మోహన్ బాబుకు గుర్తింపు ఉంది. చాలా సందర్భాల్లో ఆయన వివాదాల్లో చిక్కుకుని సంచలనంగా మారిన న విషయం తెలిసిందే. మోహన్ బాబు మాత్రమే కాదు ఆయన ఫ్యామిలీకి కూడా వివాదాలు కొత్త కాదు. ట్రోలర్స్ ఎక్కువగా టార్గెట్ చేసేది కూడా మోహన్ బాబు అండ్ ఫ్యామిలీనే. ఈ కుటుంబంలో మంచు మనోజ్ తప్పించి మిగతా ముగ్గురు స్టార్స్ పై విపరీతమైన ట్రోల్స్ రావడం అందరికి తెలిసిందే. ఈ విషయంలో మంచు విష్ణు కేసులు కూడా పెట్టారు. ఇక రీసెంట్ గా మంచు మనోజ్, విష్ణు మధ్య ఆస్తి గొడవలు, పోలీస్ కేసులు, మోహన్ బాబు మీడియా రిపోర్డర్ పై దాడి చేయడం ఇవన్నీ చూస్తునే ఉన్నాం. మోహన్ బాబు సూటిగా మాట్లాడటం, ముఖం మీదనే విమర్శలు చేయడం, చిరంజీవితో గొడవలు ఇలా మోహన్ బాబు గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి.
KNOW
మురళీమోహన్ తో మోహన్ బాబు గొడవ
అయితే మోహన్ బాబు ఆయన సన్నిహితంగా పిలుచుకునే, సౌమ్యుడిగా పేరున్న సీనియర్ నటుడు మురళీ మోహన్ తో కూడా ఒకసారి ఘర్షణకు దిగిన ఘటన గురించి మీకు తెలుసా? అవును ఒక సారి ముళీమోహన్ తో గొడవకు దిగారు మోహన్ బాబు. ఆ గొడవ ఎంత దూరం వెళ్లిందంటే, ఇద్దరు కాలర్లు పట్టుకునే వరకూ వెళ్లింది. దాంతో మోహన్ బాబను గెట్ అవుట్ అంటూ మురళీ మోహన్ బయటకు వెళ్లగొట్టారు. ఇదంతా మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఆఫీస్ లో జరిగింది.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం
ఈ సంఘటన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) ఏర్పాట్ల సందర్భంగా చోటు చేసుకుంది. ఆ సమయంలో మా అధ్యక్షుడిగా మురళీ మోహన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ లను క్రికెట్ జట్టులో చేర్చాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ మురళీ మోహన్ మాత్రం వారి పేర్లను తిరస్కరించారు. అప్పటికీ విష్ణు, మనోజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు. దాంతో అది దృష్టిలో పెట్టుకుని రూల్స్ ప్రకారం "వాళ్లు ఇండస్ట్రీలోకి ఇంకా రాలేదు కాబట్టి ఆటలో పాల్గొనలేరు" అని తేల్చి చెప్పారు.
మోహన్ బాబును గెట్ అవుట్ అన్న మురళీమోహన్
దీంతో మోహన్ బాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎందుకు చేర్చుకోరో చూస్తాను. మా పిల్లలు ఈ మ్యాచ్ లో ఆడాల్సిందే అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దాంతో మురళీ మోహన్ కూడా అంతే కోపంగా రియాక్ట్ అయ్యారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం మధ్య మాటల తూటాలు పేలడంతో పాటు, మోహన్ బాబు మురళీ మోహన్‌ను నిలదీస్తూ ఆయన చొక్క పట్టుకుని "గెట్ అవుట్" అని అన్నారని మురళీ మోహన్ స్వయంగా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మళ్లీ కలిసిపోయిన పాత మిత్రులు
ఈ సంఘటన సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. అప్పట్లో టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే కొద్దిరోజుల తరువాత, దర్శకుడు దాసరి నారాయణ రావు కుమార్తె వివాహం చెన్నైలో జరిగితే ఇద్దరూ హాజరయ్యారు. తిరిగి విమానంలో కలిసిన సందర్భంలో మోహన్ బాబు ముందుగా వచ్చి మురళీ మోహన్ కు "సారీ బావా" అని చెప్పారు, మురళీ మోహన్ కూడా పాత విషయాలు వదిలేసి పాజిటీవ్ గానే స్పందించారు. "ఇవి మామూలే" అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, నీ మనసేంటో నాకు తెలుసు, నా మనసేంటో నీకు తెలుసు, నేను కూడా తొందపడి ఉండకూడదు అని చెప్పి సరదగా జోకులు వేసుకుంటూ మళ్ళీ కలిసిపోయారట. ఈ విషయాన్ని మురళీ మోహన్ స్వయంగా వెల్లడించారు.
మోహన్ బాబుపై మురళీమోహన్ కామెంట్స్
మరళీ మోహన్ మాట్లాడుతూ.. ‘’ మోహన్ బాబు కోపిష్టి అయినా సరే ఆయన మనసు చాలామంచిది. తోందరపడి మాటలు అంటాడు కాని మనసలో మాత్రం ఏమీ ఉండదు. ఈ విషయంలో నేను అప్పుడప్పుడు ఆటపట్టిస్తుంటాను. వేరే వాళ్లు అయితే తన తప్పును ఒప్పుకుని ఇలా పలకరించరు, ఆయన హృదయం ఎంతో విశాలమైనది. తన తప్పును అంగీకరించి మళ్లీ కలిసిపోవడం గొప్ప విషయం అని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు.