కోరికలు గుర్రాలైతే.. మంచు మనోజ్‌తో గొడవ వేళ మోహన్‌బాబు పోస్ట్ సంచలనం
మంచు మనోజ్‌ని మోహన్‌బాబు కొట్టాడంటూ వార్తలు వైరల్‌గా మారాయి. మనోజ్ కూడా ఇదే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు పోస్ట్ సంచలనంగా మారింది.
మంచు ఫ్యామిలీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మంచు మనోజ్, మోహన్‌బాబు మధ్య గొడవలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆస్తుల గొడవలతో ఇద్దరు రోడ్డుకెక్కారనే వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్‌పై మోహన్‌బాబు దాడి చేయించాడని తెలుస్తుంది. యూనివర్సిటీని చూసుకునే వినయ్ అనే వ్యక్తి మనోజ్‌పై దాడి చేశాడని, దీనికి ఆస్తుల వ్యవహారమే కారణమని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా మనోజ్ ఆసుపత్రిలో చేరారు. టీఎక్స్ ఆసుపత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. తన భార్య మౌనికారెడ్డితో కలిసి ఆయన ఆసుపత్రికి వచ్చారు. కుంటుకుంటూ ఆయన ఆసుపత్రికి రావడం గమనార్హం.
మంచు మనోజ్ పరిస్థితి చూస్తుంటే దాడి జరిగింది నిజమే అని తెలుస్తుంది. దీనిపై మనోజ్ స్పందించలేదు. అయితే ఓ ప్రముఖ ఛానెల్‌తో మాట్లాడుతూ, తనపై దాడి జరిగింది నిజమే అని, తాను పోలీసులకు పిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు.
దీంతో మంచు వారి బాగోతం బయట పడిందని చెప్పొచ్చు. పీఆర్ టీమ్ నుంచి ఎంతగా ఈ గొడవలో నిజం లేదు అని చెప్పినా వాస్తవం బయటకు వచ్చేసింది. గొడవ జరిగిందనేది వాస్తవమని అర్థమవుతుంది. ఈ క్రమంలో మంచు మోహన్‌బాబు పోస్ట్ మరింత సంచలనం రేపుతుంది.
`కోరికలు గుర్రాలైతే` అనే సినిమాలోని సీన్‌ని పోస్ట్ చేస్తూ మోహన్‌బాబు ఈ పోస్ట్ పెట్టారు. ఇది 1979లో విడుదలైన `కోరికలు గుర్రాలైతే` సినిమాలోని సీన్. ఈ మూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. ఇందులోని తనకు నచ్చిన బెస్ట్ సీన్‌ని పోస్ట్ చేశారు మోహన్‌బాబు.
ఈ సన్నివేశం నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన మైలురాయిలాంటిది. చంద్రమోహన్, మురళీమోహన్‌లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. వారంతా గుర్తిండిపోయేలా చేశారు. తొలి సారిగా యమధర్మ రాజు పాత్రని చేయడం మరచిపోయేలేని అనుభూతి. ఈ సన్నివేశం ఒక సవాలు, సంతోషాన్ని కలిగించేలా ఉంది. అదే సమయంలో ఈ చిత్రం నా ప్రయాణంలో ప్రతిష్టాత్మకంగా మారింది` అని తెలిపారు మోహన్‌బాబు.
మంచు మనోజ్‌తో గొడవ నేపథ్యంలో ఆయన ఈ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. పెద్ద రచ్చ అవుతుంది. మంచు మనోజ్‌ని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టాడా? తాను కొడుకు విషయంలో యమధర్మరాజుని అనే విషయాన్ని తెలియజేస్తున్నాడా? లేక ఇదంతా పెద్ద డ్రామా అని తెలిపే ప్రయత్నం చేస్తున్నాడా?
మనోజ్‌కి కోరికలు గుర్రాలైనవి అని చెబుతున్నాడా. అసలు ఏం చెప్పదలుచుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా మంచు మోహన్‌బాబు తన ఫ్యామిలీ వ్యవహారం ఇలా రోడ్డున పడేలా చేసుకోవడం విచారకం. ఆయన అభిమానులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
read more:వసుంధరతో బాలకృష్ణ పెళ్లి వేళ, ఎన్టీఆర్ ఉక్కిరి బిక్కిరి ఎందుకో తెలుసా? మ్యారేజ్‌లో ఇదే స్పెషల్
also read: కొట్టుకున్న మంచు మనోజ్, మోహన్‌బాబు ? కేసు నమోదు.. మంచు ఫ్యామిలీ వివరణ ఇదే?