కొట్టుకున్న మంచు మనోజ్, మోహన్‌బాబు ? కేసు నమోదు.. మంచు ఫ్యామిలీ వివరణ ఇదే?
మంచు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా మంచు మనోజ్, మోహన్ బాబు తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మంచు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా మంచు మనోజ్, మోహన్ బాబు తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ తెలుగు మీడియా ఛానల్స్ కథనం ప్రకారం మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఘర్షణ చోటు చేసుకుందట. ఆస్తుల విషయంలో విభేదాలు మొదలై పెద్ద రచ్చగా మారినట్లు తెలుస్తోంది.
గతంలో కూడా మంచు మనోజ్ కి.. మంచు విష్ణుకి విభేదాలు తలెత్తాయి. కొన్ని దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సంఘటనతో మంచు ఫ్యామిలీ ఇంట రచ్చ బయటకి వచ్చింది. మంచు ఫ్యామిలీ ఆస్తుల విషయంలో ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీకి విద్యాసంస్థలు ఉన్నాయి. ఆస్తులు, స్కూలు వ్యవహారంలో మంచు మనోజ్ తండ్రిని ఎదిరిస్తున్నాడని తెలుస్తోంది. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు ఘర్షణకి దిగినట్లు మీడియా కథనాల్ని బట్టి ప్రచారం జరుగుతోంది.
ఘర్షణ తర్వాత మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు తనపై దాడి చేశారు అంటూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబు మనోజే తనపై దాడి చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం మంచు మనోజ్ గాయాలతో వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తన భార్యపై కూడా దాడి చేసినట్లు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
మరికొన్ని కథనాల ప్రకారం మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ 100కి డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మంచు ఫ్యామిలీ పీఆర్ స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని మంచు ఫ్యామిలీ పిఆర్ టీమ్ ద్వారా స్పందించినట్లు తెలుస్తోంది. ఏ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు కాలేదని పిఆర్ చెబుతున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ దాడి చేసుకున్నారనే వార్తల్లో కూడా నిజం లేదు అని అంటున్నారు. కొన్ని మీడియా ఛానల్స్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి అంటూ పిఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
అదే సమయంలో ఈ సంఘటనపై మంచు మనోజ్ స్పందించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తనపై దాడి జరిగిందని మంచు మనోజ్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. తన తండ్రి మోహన్ బాబు ఆయన అనుచరుల చేత దాడి చేయించినట్లు మంచు మనోజ్ పేర్కొన్నారట. ఈ ఆస్తుల విషయంలో గొడవ జరిగినట్లు కూడా మంచు మనోజ్ పేర్కొన్నారట. దీనిపై తప్పకుండా కేసు నమోదు చేస్తానని మంచు మనోజ్ చెబుతున్నారట. మోహన్ బాబుకి చెందిన కాలేజీ, యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ అనే వ్యక్తి మంచు మనోజ్ ని కొట్టినట్లు తెలుస్తోంది. తండ్రి ఆదేశాలతోనే అతడు తనపై దాడికి తెగబట్టట్లు మంచు మనోజ్ పేర్కొన్నారట. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా మరోసారి మంచు ఫ్యామిలీ ఇంటి గొడవలు రచ్చకెక్కాయి.