వసుంధరతో బాలకృష్ణ పెళ్లి వేళ, ఎన్టీఆర్ ఉక్కిరి బిక్కిరి ఎందుకో తెలుసా? మ్యారేజ్‌లో ఇదే స్పెషల్
నందమూరి బాలకృష్ణ నేడు పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా వారి పెళ్లికి సంబంధించి రెండు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
నందమూరి తారక రామారావు వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చారు బాలకృష్ణ. కొడుకుగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ సంతానంలో చిత్ర పరిశ్రమలో నిలబడింది అంటే బాలయ్య ఒక్కడే అని చెప్పాలి. అంతేకాదు రాజకీయంగానూ అక్క పురందేశ్వరితోపాటు తను కూడా సక్సెస్ అయ్యారు. మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ హిట్ కొట్టాడు.
ఇక ప్రస్తుతం అటు రాజకీయంగా, ఇటు సినిమాలతో బిజీగా ఉన్నా బాలకృష్ణ నేడు(డిసెంబర్ 8)న పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. తన పెళ్లి అయి 42ఏళ్లు అవుతుంది. 1982 డిసెంబర్ 8న బాలయ్య వివాహం జరిగింది. ఆయన మ్యారేజ్ డే వేళ బాలయ్య పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి కార్లు చక్కర్లు కొడుతుంది. మరి వీరి పెళ్లిలో స్పెషల్ ఏంటంటే
బాలయ్య పెళ్లి 1982 డిసెంబర్ 8న తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవ స్థానం(తిరుపతి)లో మధ్యాహ్నం 12.41గంటలకు జరిగింది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ కల్చర్ ప్రకారం రాత్రి సమయంలో పెళ్లిళ్లు అవుతుంటాయి. కానీ బాలయ్య పెళ్లి పగలు అయ్యింది. కర్నాటక కళ్యాణ పండమంలో జరగడం మరో విశేషం.
కాకినాడకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దేవరపల్లి సూర్యారావు, దేవరపల్లి ప్రమీలా రాణి వారి రెండో కూతురు వసుంధరాదేవితో నందమూరి తారకరామారావు ఐదో పుత్రుడు బాలకృష్ణతో ఈ వివాహం జరిగినట్టుగా ఈ పెళ్లి కార్డులో ఉంది. ఇది పెళ్లి కూతురు అంటే వసుంధరాదేవి తరఫు పెళ్లిపత్రిక కావడం విశేషం. చాలా సింపుల్‌గానే కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే బాలకృష్ణ పెళ్లి సమయంలో ఎన్టీఆర్ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కారణం రాజకీయంగా ఆయన బిజీగా ఉండటం. ఎన్టీఆర్ ఇదే ఏడాది(1982 మార్చి)లో టీడీపీ(తెలుగు దేశం పార్టీ)ని స్థాపించారు. 1983 జనవరిలో ఎన్నికలున్నాయి. డిసెంబర్‌లో బాలయ్య పెళ్లి.
ప్రచారం ఉదృతంగా సాగుతున్న సమయంలో అటు మ్యారేజ్ పనులు చూసుకోలేక, ఇటు రాజకీయంగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటూ ఓ రకంగా ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోయారట. ఆ పెళ్లిని రామారావు ఆస్వాదించలేకపోయారట. ఓ రకంగా కొడుకు పెళ్లికి రామారావు గెస్ట్ పాత్ర పోషించారని సమాచారం.
ఇక బాలకృష్ణ, వసుంధరా దేవిలకు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు బ్రహ్మణి, తేజస్విని, కొడుకు మోక్షజ్ఞ జన్మించారు. ఇద్దరు కూతుళ్ల మ్యారేజ్ జరిగింది. పెద్ద కూతురు బ్రహ్మాణిని సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్‌తో పెళ్లి చేశారు. తేజస్విని పెళ్లి గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకుడి మనవడు భరత్‌తో జరిగింది. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు.
మరోవైపు కొడుకు మోక్షజ్ఞ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రశాంత్ వర్మతో సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుందట. బాలకృష్ణ ప్రస్తుతం `డాకు మహారాజ్` సినిమాలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుంది.
read more:శోభితతో నాగ చైతన్య ఫ్యామిలీ ప్లాన్.. కొడుకు పుడితే ఏం చేస్తాడో తెలుసా?
also read: పుష్ప 2, స్ట్రీ 2, సింగం అగైన్.. 2024లో సీక్వెల్ సినిమా హవా